డబ్బు పొదుపు చేయాలన్న ఆలోచన అందరిలో ఉంటుంది. కానీ పెరిగిపోతున్న ఖర్చులతో డబ్బు పొదుపు (Money Saving) చేయలేకపోతున్నామని అనుకుంటూ ఉంటారు. అయితే డబ్బు పొదుపు చేయాలంటే (Savings) వేలకు వేల రూపాయలు అవసరం లేదు. కోటీశ్వరులు కావాలంటే (How to Become Crorepati) నెలకు రూ.1,000 చొప్పున పొదుపు చేసినా చాలు. అయితే మీ సంపాదన పెరిగినప్పుడు పొదుపు కూడా కాస్త పెంచాలి. అప్పుడే మీరు వీలైనంత త్వరగా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్ (Mutual Fund) స్కీమ్స్ ఉపయోగపడతాయి. అనేక మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి. మరి మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఎలా పొదుపు చేయాలి? తెలుసుకోండి.
మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్ ప్లాన్ (SIP) ద్వారా పొదుపు చేయొచ్చు. అంటే ప్రతీ నెలా కొంత చొప్పున పొదుపు చేయాల్సి ఉంటుంది. ప్రతీ నెలా రూ.1,000 చొప్పున ఏదైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో దీర్ఘకాలం పొదుపు చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్‌లో సగటున ప్రతీ ఏటా 15 శాతం చొప్పున రిటర్న్స్ వస్తాయని నిపుణులు చెబుతుంటారు. ఈ లెక్కన 30 ఏళ్ల పాటు నెలకు రూ.1,000 చొప్పున పొదుపు చేస్తే మీకు రూ.70 లక్షలకు పైగా రిటర్న్స్ వస్తాయి.
PAN Card: పాన్ కార్డుపై ఈ ప్రభుత్వ సేవలు లభించవు... ఎందుకంటే
మ్యూచువల్ ఫండ్ కంపెనీలు స్టెప్ అప్ సిప్ అనే ఫీచర్ అందిస్తున్నాయి. స్టెప్ అప్ అంటే ఒక ఏడాది గడిచిన తర్వాత మీరు కొంత శాతం మీ పొదుపును పెంచాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు మొదటి ఏడాది నెలకు రూ.1,000 చొప్పున పొదుపు చేస్తున్నారనుకుంటే ప్రతీ ఏటా 5 శాతం స్టెప్ అప్ సిప్ ఎంచుకోవచ్చు. 5 శాతం స్టెప్ అప్ ఆప్షన్‌తో రెండో ఏడాది మీ పొదుపు రూ.1,050 చొప్పున ఉంటుంది. ఒకవేళ మీరు 10 శాతం స్టెప్ అప్ ఆప్షన్ ఎంచుకుంటే రెండో ఏడాది నెలకు రూ.1,100 చొప్పున జమ చేయాలి.
Driving License: డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా? ఇలా చేస్తే చలాన్ కట్టాల్సిన అవసరం లేదు
స్టెప్ అప్ సిప్ ఆప్షన్‌తో కోటీశ్వరులు ఎలా కావొచ్చో తెలుసుకుందాం. మీరు మొదటి ఏడాది రూ.1,000 తో మ్యూచువల్ ఫండ్ సిప్ ప్రారంభించాలి. 10 శాతం స్టెప్ అప్ సిప్ ఎంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్ రిటర్స్ 15 శాతం వస్తుందని అనుకున్నా మీరు 28 ఏళ్లలో రూ.1 కోటి పైనా రిటర్న్స్ పొందొచ్చు. ఇదే పద్ధతిలో మీరు 30 ఏళ్లు పొదుపు చేస్తే రూ.1,30,00,000 అంటే కోటీ 30 లక్షలకు పైనే రిటర్న్స్ పొందొచ్చు.
చాలామంది మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు కానీ స్టెప్ అప్ సిప్ ఆప్షన్ ఎంచుకునేవారు తక్కువ. భవిష్యత్తులో మీ సంపాదన ఎలాగూ పెరుగుతుందని కాబట్టి మీరు స్టెప్ అప్ సిప్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీని వల్ల మీకు దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ వస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mutual Funds, Personal Finance, Save Money