Home /News /business /

MUTUAL FUND OPPORTUNITY TO BECOME A BILLIONAIRE BY SAVING ONLY RUPEES 167 PER DAY LEARN ABOUT THIS SIP SCHEME NK

Mutual Fund: రోజూ రూ.167 సేవ్ చెయ్యండి... బిలియనీర్ అవ్వండి... పూర్తి వివరాలు

రోజూ రూ.167 సేవ్ చెయ్యండి... బిలియనీర్ అవ్వండి... పూర్తి వివరాలు

రోజూ రూ.167 సేవ్ చెయ్యండి... బిలియనీర్ అవ్వండి... పూర్తి వివరాలు

Mutual Fund: దీర్ఘకాలికంగా మనీ సేవ్ చెయ్యాలి అనుకునేవారికి సిప్ (SIP) బాగా ఉపయోగపడుతుంది. ఇందులో వడ్డీ బాగా వస్తుంది. ఓ 15 లేదా 20 ఏళ్లు పొదుపు చేస్తే... రిటర్న్స్ బాగా వస్తాయి.

    Mutual Fund: బిలియనీర్ కావాలని అందరికీ ఉంటుంది. కానీ అదంత తేలిక కాదు. ముఖ్యంగా తక్కువ శాలరీ, తక్కువ ఆదాయం వచ్చే వారికి అది మరింత కష్టం. కానీ అసాధ్యం కాదు. పొదుపు చేసే డబ్బు తక్కువే అయినా... ఎక్కడ పొదుపు చేస్తున్నాం అనే దాన్ని బట్టీ ఎంత వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. రోజూ జస్ట్ రూ.167 పొదుపు చేస్తూ... బిలియనీర్ కావచ్చు. ఇందుకు మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) ఉపయోగపడతాయి. వీటిలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ - సిప్ (SIP) కరెక్టుగా సెట్ అవుతుంది. మరి అంత తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టి బిలియనీర్ అవ్వడం ఎలాగో తెలుసుకుందాం.

    దీర్ఘకాలిక పెట్టుబడులకు సిప్ సరైనది. ఎందుకంటే ఇందులో చక్రవడ్డీ వస్తుంది. అంటే... గడువు కాలం పూర్తవ్వగానే... అప్పటివరకూ అమౌంట్‌పై వచ్చిన వడ్డీని అసలుకు కలుపుతారు. నెక్ట్స్ డే నుంచి వడ్డీ కలిసిన మొత్తం కూడా అసలుగానే ఉంటంది. దాంతో... అసలు అమౌంట్ పెరుగుతుంది. దానిపై వడ్డీ ఇంకా పెరుగుతుంది. ఇలా కంటిన్యూగా అసలు అమౌంట్ సంవత్సరాల తరబడి పెరుగుతూనే ఉంటుంది. ఓ ఇన్వెస్టర్ 15 లేదా 20 సంవత్సరాలకు పెట్టుబడి పెడితే... భారీగా రిటర్నులు పొందవచ్చు. SIPలో పెట్టుబడి పెట్టేటప్పుడు కచ్చితమైన కాల పరిమితి ఏదీ ఉండదు. ఏ సమయంలోనైనా పెట్టుబడి ఆపేయవచ్చు. దానికి ఎలాంటి పెనాల్టీ ఉండదు. అందువల్ల ఇది సరైన ఆప్షన్‌గా నిలుస్తోంది.

    రోజుకు రూ.167 అంటే.. నెలకు రూ.5000... మీరు సిప్ విధానంలో ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్ ఎంచుకొని దానిలో పెట్టుబడి పెట్టాలి. మీరు పెట్టిన ఫండ్ సంవత్సరానికి 12 శాతం రిటర్న్ ఇస్తే... మీరు 28 సంవత్సరాల్లో రూ.1.4 కోట్లు (రూ.కోటి 40 లక్షలు) కంటే ఎక్కువే పొందగలరు. అదే 30 ఏళ్లలో మీరు రూ.1.8 కోట్ల దాకా పొందగలరు. అదే 35 ఏళ్లలో అది రూ.3.24 కోట్లు (రూ.3 కోట్ల 24 లక్షలు) అవుతుంది.

    ఇది ముఖ్యం:
    మీరు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుపడి పెట్టేటప్పుడు... ఆ ఫండ్‌పై ఓ కన్నేసి ఉంచాలి. ప్రతి 6 నెలలు లేదా కనీసం సంవత్సరానికి ఒకసారైనా దాని ట్రెండ్ ఎలా ఉందో చూడాలి. ఏడాదికి ఎంత రిటర్న్ ఇస్తోందో చూడాలి. అలాగే వడ్డీ ఎంత వస్తోంది... పెంచారా, తగ్గించారా అన్నది గమనించుకోవాలి. మీరు పెట్టిన పెట్టుబడి పెరుగుతూ ఉంటే... ఆ సిప్ కొనసాగించవచ్చు. అలా కాకుండా మీరు కోరుకున్నంత రిటర్న్ రావట్లేదు అనిపిస్తే... ఆ సిప్‌ వదిలేసి... మరో సిప్‌లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. కొన్ని సిప్‌లలో కనీస మొత్తం రూ.100 నుంచి రూ.500 లోపే ఉంటోంది.

    ICICI Pru Technology Fund -
    ఈ సిప్‌లో మీకు 5 సంవత్సరాల్లో 26.32 శాతం రిటర్న్ వస్తోంది.
    దీనికి కనీస పెట్టుబడి రూ.100 మాత్రమే.
    దీన్ని 2013 జనవరి 1న ప్రారంభించారు.
    ప్రారంభం తర్వాత ఇది 22.45 శాతం రిటర్న్ ఇచ్చింది.
    202 నవంబర్ 30 నాటికి ఇందులో రూ.938 కోట్ల పెట్టుబడి ఉంది.
    2020 అక్టోబర్ 31 నాటికి ఇందులో ఎక్స్‌పెన్స్ రేషియో 1.91 శాతంగా ఉంది.

    SBI Technology Opportunity Fund -
    ఈ సిప్‌లో మీకు 5 సంవత్సరాల్లో 22.33 శాతం రిటర్న్ వస్తోంది.
    దీనికి కనీస పెట్టుబడి రూ.500
    దీన్ని 2013 జనవరి 1న ప్రారంభించారు.
    ప్రారంభం తర్వాత ఇది 20.31 శాతం రిటర్న్ ఇచ్చింది.
    202 నవంబర్ 30 నాటికి ఇందులో రూ.367 కోట్ల పెట్టుబడి ఉంది.
    2020 అక్టోబర్ 31 నాటికి ఇందులో ఎక్స్‌పెన్స్ రేషియో 1.69 శాతంగా ఉంది.

    ఇది కూడా చదవండి: Basil Tree Benefits: తులసి మొక్క కింద ఇది పెడితే లక్ష్మీదేవి కటాక్షమే

    సిప్‌లో ఒకేసారి పెద్ద మొత్తం పెట్టే కంటే... నెల నెలా చిన్న మొత్తం ఇన్వెస్ట్ చేయడం మేలు. నెలకు రూ.100 పెట్టొచ్చు. లేదా రూ.500 పెట్టొచ్చు. మీకు వచ్చే డబ్బును బట్టీ ఇది లెక్క వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో మీకు మంచి రిటర్న్స్ వస్తాయి.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Mutual Funds, SIP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు