మార్కెట్ పరిశీలన అవసరం లేకుండా తక్కువ రిస్కుతో చక్కటి రాబడి అందించే మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds)కు ఆదరణ పెరుగుతోంది. ఎఫ్‌డీల కంటే అధిక మొత్తంలో రాబడి అందిస్తున్న మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఒకటే మార్గమనే అభిప్రాయం చాలామందిలో బలంగా పాతుకుపోతోంది. అంతేకాదు సిప్‌ల ద్వారా పెట్టుబడి పెట్టడమే సురక్షితమనే భావన అందరిలో కలుగుతోంది. కానీ ఇది నిజం కాదు. మ్యూచువల్ ఫండ్స్ అంటే కేవలం సిప్‌లు మాత్రమే కాదు. మ్యూచువల్ ఫండ్లలో చాలా ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు (Investment Options) ఉన్నాయి. అందువల్ల మీరు సిప్‌ల ద్వారానే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి అవసరం లేదు.
మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అసెట్ క్లాస్‌లు, పన్ను ప్రయోజనాలు, రిటర్న్ రిస్క్‌ల పరంగా మారుతూ ఉండే అనేక రకాల పెట్టుబడి ఆప్షన్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో ఏకమొత్తం (lump sum)లో లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు.
Investment: లక్ష రూపాయల పెట్టుబడికి మూడేళ్లలో 10 లక్షల రూపాయల రాబడి
సిప్‌లు దీర్ఘకాలిక క్రమానుగత పెట్టుబడులు. దీర్ఘకాలంలో క్రమంగా సంపదను పోగుచేయాలనుకున్న పెట్టుబడిదారులు సిప్‌లు ఇష్టపడతారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టే పెట్టుబడుల ఆప్షన్ల జోలికి వీళ్లు వెళ్లరు. ఏదేమైనప్పటికీ, ప్రతి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడికి సిప్‌లు ప్రధాన పెట్టుబడి ఆప్షన్‌గా ఉండకూడదు. సిప్‌ల ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల ఒక్కోసారి నష్టపోవచ్చు. ఆర్థిక నిపుణుల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్‌లో కొన్ని సందర్భాల్లో సిప్‌ల ద్వారా అస్సలు ఇన్వెస్ట్ చేయకూడదు. మరి ఎప్పుడెప్పుడు సిప్‌ల పెట్టుబడికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఆర్థిక లక్ష్యాలకు చేరువలో ఉన్నప్పుడు..
సిప్‌ల ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల చేకూరే ముఖ్య ప్రయోజనాల్లో ఒకటి స్వల్పకాలంలోని వాలటిలిటీ (Volatility) రిస్కును తగ్గించడం. సిప్‌లు దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఉద్దేశించినవి కాబట్టి స్వల్పకాలిక మార్కెట్‌లోని వాలటిలిటీ గురించి కలవరపడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీ దీర్ఘకాలిక పెట్టుబడి పెరిగి, మీరు మీ ఆర్థిక లక్ష్యాలకు చేరువలో ఉన్నప్పుడు వెంటనే ఇన్వెస్ట్‌మెంట్ ఆపేయాలి. తద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చు. తర్వాత మీరు మీ కార్పస్‌ను తక్కువ వాలటిలిటీ సాధనాలకు మార్చడం చాలా ముఖ్యం.
IndianOil HDFC Bank Credit Card: 50 లీటర్ల Free Petrol కావాలా...అయితే ఈ కార్డు మీకోసం...
ఫైనల్ సమయంలో సిప్‌ల ద్వారా పెట్టుబడిని కొనసాగించడం మంచిది కాదు. మార్కెట్ అప్ స్వింగ్ లో ఉన్నా టెంప్టేషన్‌కు గురి కాకుండా మీ పెట్టుబడులను తక్కువ-రిస్క్ ఉత్పత్తికి మళ్లించడం ఉత్తమం. ఆర్థిక లక్ష్యాలకు చేరువైనప్పుడు కార్పస్‌ను కాపాడుకోవడంపైనే మీరు ఫోకస్ పెట్టాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది.
* ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు..
మీరు మీ నెలవారీ ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడానికి సిప్‌లు బాగా ఉపయోగపడతాయి. అయితే మీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే, సిప్‌లు ద్వారా ప్రతి నెలా చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. మీ వద్ద ఉన్న పెద్ద మొత్తంపై రాబడి పొందాలంటే చిన్న మొత్తంలో కాకుండా మొత్తం డబ్బుని ఇన్వెస్ట్ చేయడం మంచిది. అలా వద్దనుకుంటే మీరు తక్కువ-రిస్క్ గల మ్యూచువల్ ఫండ్లలో మొత్తం డబ్బులు పెట్టుబడి పెట్టి మంచి రాబడిని సంపాదించొచ్చు. అలాగే ఇదే డబ్బును క్రమక్రమంగా అధిక రాబడిని అందించే మరొక ఫండ్‌కు మార్చుకోవచ్చు.
ఒక కిలో టీ పొడి ధర రూ.99,999..రికార్డులు తిరగరాసిన అస్సాం
* ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ పథకం సరిగ్గా లేనప్పుడు
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు.. మీ పోర్ట్‌ఫోలియో పనితీరును ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మీ పోర్ట్‌ఫోలియోలోని కొన్ని స్కీమ్‌లు మీ అంచనాలకు అనుగుణంగా పర్ఫామ్ చేయకపోవచ్చు. ఒకవేళ మీరు కోలుకునే అవకాశం లేని నష్టాన్ని కలిగించే మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తే.. మీరు ఇప్పటికే చవిచూసిన దానికంటే ఎక్కువ నష్టాలను ఫేస్ చేసే ప్రమాదం చాలా అధికంగా ఉంటుంది. అందుకే తదుపరి నష్టాల బారి నుంచి బయటపడేందుకు మీ పోర్ట్‌ఫోలియోలో నష్టాన్ని కలిగించే సిప్‌ల పెట్టుబడిని వెంటనే ఆపివేయాలి. ఆపై మీ పెట్టుబడిని మెరుగైన పథకానికి మార్చాలి.
మీ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు సమీక్షించడం, నష్టాలు తెచ్చే పెట్టుబడిని సరిదిద్దడం చాలా కీలకం. ఒకవేళ మీరు పెట్టిన పెట్టుబడి పండ్లు అనుకున్నదానికంటే పేలవంగా పర్ఫామ్ చేస్తున్నాయనే అనుమానం వస్తే.. 3-6 నెలల పాటు దాన్ని పర్యవేక్షించి ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోండి. ఒకవేళ వాటిపై మీకు నమ్మకం లేకపోతే దాని నుంచి మంచి ప్లాన్ తో బయటకు వచ్చేయండి
మీరు సరైన ఫండ్‌ని ఎంచుకున్నప్పుడే సిప్‌లు మీకు రిస్క్‌ని తగ్గించడంలో సహాయపడతాయి. సిప్‌లకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఇవి దీర్ఘకాలానికి ఉద్దేశించినవి కాబట్టి, షార్ట్ టైమ్‌లో మీకు మంచి రాబడిని ఇవ్వకపోవచ్చు. వీటిలో పెట్టిన మీ పెట్టుబడులను ట్రాక్ చేస్తూ అప్‌డేట్‌గా ఉండవలసి అవసరం ఎంతైనా ఉంటుంది. కాస్త సమయం కేటాయిస్తే సిప్‌లు చక్కటి రాబడిని కచ్చితంగా అందిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Earn money, Money making, Mutual Funds