హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mutual funds: కోటీశ్వరులు కావడమే మీ టార్గెట్టా...ప్రతి నెల కాలు కదపకుండా ఒక్క క్లిక్ చేస్తే చాలు..

Mutual funds: కోటీశ్వరులు కావడమే మీ టార్గెట్టా...ప్రతి నెల కాలు కదపకుండా ఒక్క క్లిక్ చేస్తే చాలు..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్ ప్రకారం ఒక వ్యక్తి నెలకు రూ.8,000 పెట్టుబడి పెడితే రూ.1.51 కోట్లు, నెలకు రూ.9,000 పెట్టుబడి పెడితే సుమారు రూ.1.7 కోట్ల వరకు సంపాదించవచ్చు.

కరోనా తరువాత బ్యాంకులు అందించే వడ్డీరేట్లు తగ్గిపోయాయి. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆధారపడే సంప్రదాయ పెట్టుబడిదారులు, సీనియర్ సిటిజన్లకు అందే రాబడిలో కోత పడుతోంది. దీని వల్ల ఇప్పుడు తక్కువ నష్టభయం ఉండే పెట్టుబడులపై ఆసక్తి చూపేవారి సంఖ్య పెరుగుతోంది. దీర్ఘకాలంలో మంచి లాభాలను అందించే చిన్న పెట్టుబడులకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది. దీన్ని గుర్తించిన మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు నెలవారీగా కొంతమొత్తాన్ని పెట్టుబడులకు కేటాయించే SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)లను రూపొందించాయి. ఇవి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు ఉపయోగంగా ఉంటాయి. వీటి ద్వారా ఉద్యోగ విరమణ తరువాత పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్ ప్రకారం ఒక వ్యక్తి నెలకు రూ.8,000 పెట్టుబడి పెడితే రూ.1.51 కోట్లు, నెలకు రూ.9,000 పెట్టుబడి పెడితే సుమారు రూ.1.7 కోట్ల వరకు సంపాదించవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్ ద్వారా పెట్టుబడులు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

రాబడి ఎంత వస్తుంది?

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో 15 సంవత్సరాల వరకు చేసే దీర్ఘకాలిక పెట్టుబడులపై కనీసం 12 శాతం రాబడిని పొందవచ్చని ట్రాన్సెండ్ కన్సల్టెన్ట్స్ వెల్త్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ కార్తిక్ ఝవేరి చెబుతున్నారు. ఇవే పెట్టుబడులను 20 సంవత్సరాలకు మించి ఉండేలా ఎంచుకుంటే.. ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ ప్లాన్‌ను బట్టి 15 శాతం వరకు రాబడి లభిస్తుంది. మ్యాచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్ ద్వారా రాబడిని సులభంగా అంచనా వేయవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ SIPపై వార్షిక రాబడి(annual return) 12 శాతంగా ఉంటుందనుకుందాం. అతడు 25 సంవత్సరాల వరకు నెలకు రూ.8,000 పెట్టుబడి పెడితే... మెచూరిటీ తరువాత అందే మొత్తం రూ.1,51,81,081గా ఉంటుంది. దీంట్లో పెట్టుబడి చేసిన మొత్తం రూ.24,00,000. దీనికి ఈ 25ఏళ్లలో లభించే వడ్డీ రూ.1,27,81,081.

లక్ష్యాలను బట్టి పెట్టుబడులు ఉండాలి

25 సంవత్సరాల తరువాత కనీసం రూ.1.5 కోట్ల వరకు సంపాదించాలనుకునేవారు.. నిర్దేశించుకున్న మొత్తంపై కనీసం రూ.500 నుంచి రూ.1,000 వరకు ఎక్కువగా పెట్టుబడి పెట్టాలి. అప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. రూ.1.5 కోట్ల వరకు సంపాదించాలనుకునే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుడు.. నెలకు రూ.9,000 పెట్టుబడి పెడితే మెచూరిటీ తరువాత వచ్చే రాబడిపై భరోసా ఉంటుంది. ఉదాహరణకు.. 25 సంవత్సరాల మెచూరిటీ ఉండే మ్యూచువల్ ఫండ్ సిప్‌లో నెలకు రూ.9,000 చొప్పున పెట్టుబడి పెట్టారనుకుందా. దీనిపై 12 శాతం వడ్డీని అంచనా వేస్తే.. మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్ ప్రకారం మెచ్యూరిటీ తరువాత అందే మొత్తం రూ.1,70,78,716కు చేరుకుంటుంది. దీంట్లో నికర పెట్టుబడులు రూ.27,00,000, దీనిపై అందే వడ్డీ రూ.1,43,78,716గా ఉంటుంది.

First published:

Tags: Business, Money making, Mutual Funds