Mutual fund SIP: 40 ఏళ్లకు కోటీశ్వరులు కావాలంటే.. మ్యూచువల్ ఫండ్స్​ సిప్​లో ఇలా పెట్టుబడి పెట్టండి

ప్రతీకాత్మక చిత్రం

స్టెప్​ అప్​తో కూడిన ఈక్విటీ మ్యూచువల్​ ఫండ్స్ వైపు వెళ్లాలి. ఈ ఫండ్లలో 12 శాతం రాబడి వస్తుంది. ఒక వ్యక్తి 40 ఏళ్ల వయస్సు వచ్చే నాటికి కోటి రూపాయలు పొందాలన్న లక్ష్యంతో ఉంటే.. వారు ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి.

  • Share this:
మన భారతీయులు డబ్బు ఆదా చేయడంపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తం దాచుకొని, మిగతా నిధులతో పెట్టుబడులు పెడుతుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం తిరిగి ఇచ్చే పథకాల్లో చాలామంది పెట్టుబడులు పెడుతుంటారు. కానీ కొంత మంది మాత్రమే స్మార్ట్​గా ఆలోచించి తెలివిగా ఇన్వెస్ట్​ చేస్తుంటారు. ఈ స్మార్ట్​ ఇన్వెస్ట్​మెంట్లతో తక్కువ సమయంలోనే అధిక రాబడి సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మ్యూచువల్​ ఫండ్లలో సిస్టమెటిక్​ ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్​ (సిప్) లలో ఇన్వెస్ట్​ చేయడం ద్వారా కాంపౌండింగ్​ ప్రయోజనాలతో దీర్ఘకాలంలో మంచి రాబడి పొందేందుకు ఆస్కారం ఉంటుందని సూచిస్తున్నారు.

దీర్ఘకాలంలో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాలి అనుకునేవారు సిప్​ ద్వారానే మ్యూచువల్​ ఫండ్లలో మదుపు చేస్తుంటారు. అయితే స్థిరంగా ఒకే రకంగా పెట్టుబడి పెట్టకుండా.. ఆదాయం పెరుగుతున్న కొద్దీ నెలవారీ పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్తుండాలి. ఇలా మీ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చు. నాలుగు పదుల వయసులో రూ.1 కోటి వరకు సంపాదించాలంటే.. 25 ఏళ్ల నుంచే సిప్‌ల ద్వారా పెట్టుబడులు కొనసాగించాలని సూచిస్తున్నారు.

పెట్టుబడి మొత్తాన్ని పెంచాలి
కోటి రూపాయల రాబడి లక్ష్యంగా పెట్టుకొని ఇన్వెస్ట్​ చేసే వారు తమ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సాధారణ మ్యూచువల్​ ఫండ్​ సిప్​లతో సాధ్యపడకపోవచ్చు. ఆ లక్ష్యం నెరవేరాలంటే వార్షిక స్టెప్​ అప్​తో కూడిన ఈక్విటీ మ్యూచువల్​ ఫండ్స్ వైపు వెళ్లాలి. ఈ ఫండ్లలో 12 శాతం రాబడి వస్తుంది. ఒక వ్యక్తి 40 ఏళ్ల వయస్సు వచ్చే నాటికి కోటి రూపాయలు పొందాలన్న లక్ష్యంతో ఉంటే.. వారు ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి. వీటిలో 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి ద్వారా రిస్క్​ సామర్థ్యాన్ని బట్టి 8 నుంచి 12 శాతం వడ్డీ లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్ సిప్​ రిటర్న్ క్యాలిక్యులేటర్ ప్రకారం 10 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పాటు మ్యూచువల్ ఫండ్లలో పెట్టాలంటే.. సాధారణ సిప్​కు బదులు స్టెప్ -అప్ సిప్​ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

40 ఏళ్ల వయస్సు నాటికి కోటి రూపాయలే లక్ష్యంగా ఒక వ్యక్తి 25 ఏళ్ల వయస్సులో పెట్టుబడులు ప్రారంభిస్తే.. తన లక్ష్యాన్ని చేరేందుకు ఇంకా 15 ఏళ్ల సమయం ఉంటుంది. సాధారణంగా 10 శాతం వార్షిక స్టెప్​ అప్​ ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. కానీ, ఇక్కడ ఇన్వెస్టర్​ లక్ష్యం పెద్దది కాబట్టి వార్షిక స్టెప్​ అప్​ సిప్​ కనీసం 15 శాతంగా ఉండాలి. మ్యూచువల్​ సిప్​ క్యాలిక్యులేటర్ ప్రకారం.. ఒక వ్యక్తి తన 25 సంవత్సరాల వయస్సులో సిప్​ చేయడం ప్రారంభిస్తే.. 40 ఏళ్ల వయసు వచ్చే నాటికి అనగా తర్వాతి 15 సంవత్సరాల పాటు ప్రతినెలా రూ. 9,00‌‌0 పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత క్రమంగా పెట్టుబడి పెంచుకుంటూ పోతే 40 ఏళ్లు పూర్తయ్యే నాటికి రూ. 1 కోటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
Published by:Krishna Adithya
First published: