HOME »NEWS »BUSINESS »muthoot finance provides complimentary covid19 insurance cover to msl scheme customers ss

Muthoot Finance: ముత్తూట్ ఫైనాన్స్ కస్టమర్లకు గుడ్ న్యూస్... లోన్ తీసుకుంటే ఇన్స్యూరెన్స్

Muthoot Finance: ముత్తూట్ ఫైనాన్స్ కస్టమర్లకు గుడ్ న్యూస్... లోన్ తీసుకుంటే ఇన్స్యూరెన్స్
Muthoot Finance: ముత్తూట్ ఫైనాన్స్ కస్టమర్లకు గుడ్ న్యూస్... లోన్ తీసుకుంటే ఇన్స్యూరెన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Muthoot Finance | ముత్తూట్ ఫైనాన్స్ కస్టమర్లకు కాంప్లిమెంటరీగా కోవిడ్ 19 ఇన్స్యూరెన్స్ ప్రకటించింది కంపెనీ. ఏ కస్టమర్లకు ఈ ఇన్స్యూరెన్స్ లభిస్తుందో తెలుసుకోండి.

  • Share this:
    ముత్తూట్ ఫైనాన్స్‌లో గోల్డ్ లోన్ తీసుకునే కస్టమర్లకు శుభవార్త. తమ గోల్డ్ లోన్ కస్టమర్లకు కోవిడ్ 19 ఇన్స్యూరెన్స్‌ను కాంప్లిమెంటరీగా అందిస్తోంది ముత్తూట్ ఫైనాన్స్. ఇందుకోసం కొటక్ మహీంద్రా జనరల్ ఇన్స్యూరెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా వైరస్ సంక్షోభ కాలంలో తమ కస్టమర్లను ఆదుకోవడానికి ముత్తూట్ ఫైనాన్స్ ఈ అడుగు వేసింది. బంగారంపై ఎక్కువగా రుణాలు ఇవ్వడంతో పాటు ముత్తూట్ సూపర్ లోన్ స్కీమ్ కస్టమర్లకు రూ.1 లక్ష వరకు కాంప్లిమెంటరీగా కోవిడ్ 19 ఇన్స్యూరెన్స్ కవర్ అందిస్తోంది. కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ఆఫర్ ప్రకటించింది కంపెనీ. అర్హులైన గోల్డ్ లోన్ కస్టమర్లకు మాత్రమే కోవిడ్ 19 ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. ముత్తూట్ సూపర్ లోన్ స్కీమ్‌లో గోల్డ్ లోన్ తీసుకుంటేనే కోవిడ్ 19 ఇన్స్యూరెన్స్ కవరేజీ పొందొచ్చు. ముత్తూట్ సూపర్ లోన్ స్కీమ్‌లో గోల్డ్ లోన్ తీసుకుంటే వార్షికంగా 24% నుంచి 26% వరకు వడ్డీ చెల్లించాలి. 30 రోజుల గడువుతో లోన్ తీసుకుంటే వడ్డీ 1% రిబేట్ లభిస్తుంది. అంటే 23% వడ్డీ వర్తిస్తుంది. ఇక 360 రోజుల వరకు 24%, అంతకన్నా ఎక్కువ అయితే 26% చొప్పున వడ్డీ చెల్లించాలి.

    SBI: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా? ఈ విషయం తెలుసా?



    PAN Card: పాన్ కార్డులో తప్పులున్నాయా? ఈ యాప్‌లో అప్లై చేయండి ఇలా

    Muthoot super loan scheme, MSL Scheme, Muthoot Finance gold loan, Muthoot Finance personal loan, Muthoot Finance gold loan interest rates, Muthoot Finance Covid19 insurance, ముత్తూట్ సూపర్ లోన్ స్కీమ్, ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్, ముత్తూట్ ఫైనాన్స్ పర్సనల్ లోన్, ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్, ముత్తూట్ ఫైనాన్స్ బంగారం రుణాలు, ముత్తూట్ ఫైనాన్స్ కోవిడ్ 19 ఇన్స్యూరెన్స్
    ప్రతీకాత్మక చిత్రం


    కరోనా వైరస్ సంక్షోభకాలంలో కస్టమర్ల కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది ముత్తూట్ ఫైనాన్స్. ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు డిజిటల్ పేమెంట్స్ చేసినవారికి క్యాష్‌బ్యాక్ ప్రకటించింది. అంతేకాదు... లోన్ ఎట్ హోమ్ పేరుతో కొత్త సర్వీస్ ప్రారంభించింది. కస్టమర్లు బ్రాంచ్‌కు రావాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకొని కేవైసీ ప్రాసెస్ పూర్తి చేస్తే ఇంటికి వచ్చిమరీ గోల్డ్ లోన్స్ ఇస్తోంది. గతంతో పోలిస్తే ఇటీవల మంత్లీ కస్టమర్ ట్రాన్సాక్షన్స్ రెట్టింపు అయ్యాయని ముత్తూట్ ఫైనాన్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ ముత్తూట్ ఇటీవల ప్రకటించారు. లోన్ రెన్యువల్, టాప్ అప్స్, ఇంట్రెస్ట్ పేమెంట్ లాంటి లావాదేవీలు నెలకు 8.25 లక్షలు జరుగుతున్నాయని చెప్పారు.
    Published by:Santhosh Kumar S
    First published:August 18, 2020, 17:42 IST