Suggestions For House Buyers: ఇల్లు కొనాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

Suggestions For House Buyers: హోమ్​ బయ్యర్లు అంతకు ముందు కట్టిన ప్రాజెక్టులకు వెళ్లడం చాలా ముఖ్యం. ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి ఇళ్లు ఎలా ఉన్నాయి, నిర్మాణాల నాణ్యత ఎలా ఉందని పరిశీలిస్తే చాలా మంచిది.

  • Share this:
సొంత ఇల్లు అనేది ఎంతో మందికి కల. దశాబ్దాల పాటు డబ్బు దాచుకొని.. మంచి ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకుంటారు. జీవితకాలం ఉండే ఆస్తి కావడంతో ఎంతో పెట్టుబడి పెట్టి కొంటారు. అయితే ఇల్లు కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డెవలపర్ల గురించి అన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా నిర్మాణ దశలోనే ఉన్నప్పుడే ఇంటిని కొనాలనుకుంటే మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చాలా ప్రాజెక్టులు వివాదాల్లో చిక్కుకొని.. చెల్లించిన వారికి డబ్బు తిరిగిరాక సంవత్సరాల పాటు కోర్టుల్లో కేసులు నడిచిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇల్లు కొనేందుకు డబ్బు చెల్లించే ముందే డెవలపర్​ (బయ్యర్​)కు చెందిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అందుకు మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..

రెరా (RERA) వెబ్​సైట్​ ద్వారా:
రియల్ ఎస్టేట్​ నియంత్రణ, అభివృద్ధి చట్టం 2016 ప్రకారం ప్రతీ డెవలపర్​ కచ్చితంగా తమ ప్రాజెక్టును, ఏజెంట్లను రిజిస్టర్ చేయించి రిజిస్ట్రేషన్ నంబర్ పొందాలి. అందుకే ప్రతీ ప్రాజెక్టుకు సపరేట్ నంబర్ ఉంటుంది. అందువల్ల ఇల్లు కొనాలంటే మొదటగా రెరా వెబ్​సైట్​లోకి వెళ్లి.. ఆ డెవలపర్​ రెరా రిజిస్ట్రేషన్ నంబర్​ను వెరిఫై చేసుకోవాలి.

“రెరా వెబ్​సైట్​లోకి వెళితే ప్రమోటర్ పేరు, ఫోన్ నంబర్లు, ఐదు సంవత్సరాల్లో చేపట్టిన ప్రాజెక్టు వివరాలు పేర్లతో సహా చూడవచ్చు. అలాగే ప్రాజెక్టు పేరు, అప్రూవల్స్​, కన్స్ట్రక్షన్ విలువ ఇలా అన్ని వివరాలను పొందవచ్చు. ఎంత పెట్టుబడి పెట్టారు.. ఒకవేళ ప్రాజెక్టు ఆలస్యమైతే ఎందుకైందో కూడా చూడవచ్చు” స్వ్కైర్​ యార్డ్స్​ కో ఫౌండర్​ అనుపమ్ రస్తోగీ చెప్పారు. అలాగే ప్రాజెక్టుకు అన్ని అప్రూవల్స్ వచ్చాయా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

వార్షిక ఆర్థిక రిపోర్టులను పరిశీలించడం: ఇల్లు కొనాలనుకుంటున్నా వారు.. ముఖ్యంగా హోమ్ బయ్యర్ల​ ఆర్థిక రిపోర్టుల గురించి తెలుసుకోవాలి. గతంలో చేపట్టిన ప్రాజెక్టు ఫైనాన్షియల్ వివరాలు గమనించాలి. ప్రాజెక్టులు ఆర్థిక కారణాల వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నాయా అన్నది తెలుసుకోవాలి. గత ప్రాజెక్టులకు వెళ్లాలి: హోమ్​ బయ్యర్లు అంతకు ముందు కట్టిన ప్రాజెక్టులకు వెళ్లడం చాలా ముఖ్యం. ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి ఇళ్లు ఎలా ఉన్నాయి, నిర్మాణాల నాణ్యత ఎలా ఉందని పరిశీలిస్తే చాలా మంచిది. అవి పరిశీలించాకే ఇంటికి అడ్వాన్సు చెల్లిస్తే బాగుంటుంది.

పేపర్లు, సోషల్ మీడియాల్లో..
అలాగే ఇళ్లు అమ్ముతున్న డెవలపర్ల గురించి న్యూస్​ పేపర్లు, సోషల్ మీడియాలో సెర్చ్ చేయాలి. ఫేక్​బుక్​, ట్విట్టర్​, లింక్డ్​ఇన్​ల్లో ఫస్ట్​హ్యాండ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే ఇంతకు ముందు ఇల్లు కొన్న వారి రివ్యూలు కూడా ఉంటాయి. ఏదేమైనా ఏదైనా ఆస్తి కొనేటప్పుడు అసలు తొందరపడకూడదు. అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే ముందడుగేయాలి. అలాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, డెవలపర్లు ఇచ్చే హామీలన్నింటికీ డాక్యుమెంట్లు తీసుకోవడం తప్పనిసరి.
Published by:Kishore Akkaladevi
First published: