సోషల్ మీడియా(Social Media) దిగ్గజం ట్విట్టర్‌ను(Twitter) టెస్లా కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత ట్విట్టర్ ఉద్యోగులను తొలగిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే తాజాగా.. ఆ విషయం ఎట్టకేలకు రుజువైంది. తాజా సమాచారం ప్రకారం.. ట్విట్టర్ ప్రపంచ స్థాయిలో తన ఉద్యోగులను తొలగించబోతోంది. అందులో భారతీయ ఉద్యోగుల తొలగింపును ఇప్పటికే ప్రారంభించింది. ట్విట్టర్ ఇండియాలోని(Twitter India) కొంతమంది ఉద్యోగులు ఇటువంటి పరిస్థితిపై ఈ సమాచారాన్ని ఇచ్చారు. గత వారం ప్రారంభంలో.. ఎలాన్ మస్క్ ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో(Parag Agarwal) పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(Financial Officer) మరియు మరికొందరు ఉన్నతాధికారులను తొలగించారు. అదే సమయంలో.. దీని తర్వాత చాలా మంది ఉన్నత స్థాయి అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు.
సంస్థ యొక్క ప్రపంచ శ్రామిక శక్తిని తగ్గించడానికి మస్క్ ఇప్పుడు భారీ తొలగింపులను ప్రారంభించాడు. ట్విట్టర్ లో పని చేసే ఓ ఉద్యోగి ఈ విషయాలను వెల్లడించారు. తమ సహోద్యోగులలో కొందరికి దీని గురించి ఇమెయిల్ ద్వారా తెలియజేయబడిందన్నారు. ఇలా దాదాపు ట్విట్టర్ ఇండియాకు సంబంధించిన 200 మందికిపైగా తమ ఈ మెయిల్స్, సిస్టమ్ లాగిన్, వాట్సాప్ గ్రూప్ లకు సంబంధించి యాక్సెస్ నిలిచిపోయినట్లు సమాచారం. అంతే కాకుండా.. మస్క్ గత వారం కొత్త CEO గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నుండి అంతర్గత కమ్యూనికేషన్ లేకపోవడం గురించి ఫిర్యాదు చేశారు.
తమను వదిలించుకోవడం అనేది అత్యంత అమానవీయ మార్గాలలో ఒకటని.. ట్విట్టర్ ఇండియాలో తాము చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నట్లు బాధితులు IANSకు చెప్పుకుంటూ వాపోయారు. మస్క్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి తమకు ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికే ట్విట్టర్ ఇండియాలో సేవలు అందిస్తున్న మిగతా ఉద్యోగులు కూడా.. తమ ఉద్యోగాలు కూడా ఎప్పుడు పోతాయో అని అనునిత్యం భయంతో జీవిస్తున్నారు.
మస్క్ చేపట్టే చర్యల ఆధారంగా ఇది కూడా త్వరలోనే జరుగుతుందని వారు భావిస్తున్నారు.
కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన మస్క్ దాదాపు తమ కంపెనీ నుంచి సగం మందికి పైగా ఇంటికి పంపించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ కార్యాలయాలకు ఉద్యోగి బ్యాడ్జ్ యాక్సెస్ అనేది ప్రస్తుతం తాత్కాలికంగా రద్దు చేయబడింది. Twitter యొక్క భద్రతను నిర్ధారించడంలో సహాయపడటానికి.. తమ కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయని.. ఉద్యోగి యొక్క బ్యాడ్జి యాక్సెస్ కూడా నిలిపివేయబడుతుందని ట్విట్టర్ అంతర్గత మెమోలో పేర్కొంది.
మీరు కార్యాలయంలో ఉన్నట్లయితే లేదా కార్యాలయానికి వచ్చే మార్గంలో ఉంటే.. దయచేసి ఇంటికి తిరిగి వెళ్లండి అని అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఎలన్ మస్క్ ట్విటర్‌ని కొనుగోలు చేయకముందే సోషల్ మీడియా సంస్థలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటాడనే టాక్ వచ్చింది. కొన్ని నివేదికలలో.. అతను ఉద్యోగుల సంఖ్యను 75 శాతం తగ్గిస్తాడని కూడా చెప్పబడింది. ప్రస్తుతం అవే సూచికలు కినిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.