సైనికుల కోసం ధీరూభాయ్ అంబానీ స్క్వేర్‌లో మ్యూజికల్ షో

ఇటీవల ప్రారంభించిన ధీరూభాయ్ అంబానీ స్క్కేర్ వద్ద చిన్నారులతో రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ

ధీరూభాయ్ అంబానీ స్క్వేర్‌లో రెండు మ్యూజికల్ షోలను ఏర్పాటు చేయనున్నారు. 7000 మందికి పైగా సైన్యం, పోలీసులు వారి కుటుంబాల కోసం ఈ ప్రత్యేక షోలను ఏర్పాటు చేశారు.

 • Share this:
  రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహ వేడుకలో భాగంగా.. సైనికుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది రిలయన్స్ ఫౌండేషన్. మార్చి 6న ముంబైలోని బీకేసీలో ధీరూభాయ్ అంబానీ స్క్వేర్‌ను జాతికి అంకితం చేశారు. సుమారు 2000 మంది పేద బాలలతో కలసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది రిలయన్స్ ఫౌండేషన్. ధీరూభాయ్ అంబానీ స్క్వేర్‌లో రెండు మ్యూజికల్ షోలను ఏర్పాటు చేయనున్నారు. 7000 మందికి పైగా సైన్యం, పోలీసులు వారి కుటుంబాల కోసం ఈ ప్రత్యేక షోలను ఏర్పాటు చేశారు. ఎల్లప్పుడూ దేశ రక్షణలో ఉండే వారి ఆశీస్సులు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాలకు అందించాలని ఆకాంక్షిస్తూ ఈ భారీ ప్రోగ్రామ్‌ను చేపట్టారు. మార్చి 12వ తేదీన ఈ కార్యక్రమం జరగనుంది.

  మా సంతోషాన్ని భారత సైన్యం, పోలీసులతో పంచుకోవడం ఆనందంగా ఉంది. దేశాన్ని సురక్షితంగా, క్షేమంగా ఉంచడానికి వారు అనునిత్యం ప్రయత్నిస్తుంటారు. ధీరూభాయ్ అంబానీ స్క్వేర్‌లో ఏర్పాటు చేసే స్పెషల్ మ్యూజికల్ ప్రోగ్రాం ముంబై భిన్నత్వానికి ప్రతీకగా ఉంటుంది. సైనికులు, పోలీసులు, వారి కుటుంబాలతో ఆనందాన్ని పంచుకోవడానికి ఎదురుచూస్తున్నా.
  నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్


  మ్యూజిక్‌కు తగ్గట్టుగా డ్యాన్స్ చేసే వాటర్ ఫౌంటెయిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఓవైపు వాటర్ ఫౌంటెయిన్ మిరుమిట్లు గొలిపిస్తుంటే, మరోవైపు దాని పైభాగంలో డ్యాన్సర్లు చేసే విన్యాసాలు కూడా ఆకట్టుకోనున్నాయి. దీంతోపాటు బృందావనంలో గోపికలతో శ్రీకృష్ణుడి రాసలీలను స్మరిస్తూ దృశ్యరూపకాన్ని ప్రదర్శించనున్నారు. సుమారు 150 మంది భారతీయ, అంతర్జాతీయ కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు.
  First published: