Amazon CEO Jeff Bezos చేసిన పనికి కస్టమర్లు ఫిదా...ఊరికే నెంబర్ వన్ శ్రీమంతుడు కాలేదంటూ...

మన ఫిర్యాదుపై ఏకంగా సంస్థ సీఈఓనే స్పందించి పరిష్కరిస్తే ఊహించని అద్భుతమే కదా!.. అటువంటి అరుదైన అనుభవమే ఎదురైంది ముంబైకి చెందిన ఓంకార్ హన్మంతే అనే కస్టమర్ కి.

news18-telugu
Updated: October 17, 2020, 6:58 PM IST
Amazon CEO Jeff Bezos చేసిన పనికి కస్టమర్లు ఫిదా...ఊరికే నెంబర్ వన్ శ్రీమంతుడు కాలేదంటూ...
అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఫైల్ ఫోటో(Drew Angerer/Getty Images)
  • Share this:
ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ను డెలివరీ చేసే సమయంలో కొంతమంది డెలివరీ బాయ్స్ నిర్లక్ష్యాన్ని అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. దీనిపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా కస్టమర్ సర్వీస్ సెంటర్ నుంచి స్పందన రాని సందర్భాలెన్నో ఉంటాయి.  అయితే, మన ఫిర్యాదుపై ఏకంగా సంస్థ సీఈఓనే స్పందించి పరిష్కరిస్తే ఊహించని అద్భుతమే కదా!.. అటువంటి అరుదైన అనుభవమే ఎదురైంది ముంబైకి చెందిన ఓంకార్ హన్మంతే అనే కస్టమర్ కి. ఇటీవల అతను ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ లో నోకియా ఫోన్ ను బుక్ చేశాడు. అయితే, ఆ ఫోన్ డెలివరీ కానప్పటికీ, డెలివరీ అయినట్లు ఆర్డర్ స్టేటస్ లో చూపించింది.

దీంతో ఆందోళనకు గురైన ఓంకార్ హన్మంతే అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ కు తన సమస్యను ఈ–మెయిల్ ద్వారా వివరిస్తూ "హాయ్ జెఫ్, మీరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. తాజాగా మీ కస్టమర్ సర్వీస్ మరియు డెలివరీ సర్వీసులతో చాలా నిరాశ చెందాను. మా బామ్మ కోసం కొద్ది రోజుల క్రితమే అమెజాన్ సైట్ నుంచి నోకియా ఫోన్ ను బుక్ చేశాను. అయితే, అమెజాన్ డెలివరీ బాయ్ నా ఆర్డర్ ను చేతికి అప్పగించకుండా గేటుపై పెట్టి వెళ్లాడు. దీన్ని చూసిన ఒక దొంగ ఆ మొబైల్ ప్యాక్ ను దొంగిలించాడు.

డెలివరీ గురించి నాకు ఎప్పుడూ కాల్ రాలేదు, అంతేకాకుండా డెలివరీ సమయంలో నా సంతకాన్ని సైతం తీసుకోలేదు. దీనిపై మీ కస్టమర్ సర్వీస్ టీంకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు కొనసాగుతోందని చెబుతున్నారు. డెలివరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను క్రింద పొందుపర్చాను దయచేసి పరిశీలించగలరు. మీ సర్వీసుల నన్ను చాలా నిరాశపరిచాయి. అమెజాన్ వెబ్ సైట్ నుండి మళ్ళీ ఏదైనా ప్రొడక్ట్ కొనడానికి ఇకపై రెండుసార్లు ఆలోచిస్తాను.’’ అని పేర్కొన్నారు. ఓంకార్ హన్మంతే పంపిన ఈ–మెయిల్ ను చదివిన జెఫ్ బెజోస్ సమస్యను పరిష్కరించాలని ఎక్జిక్యూటివ్ టీంకు ఆదేశాలిచ్చారు.

కాగా, కస్టమర్ ఈ–మెయిల్ రాసిన కొద్దిరోజులకే, అమెజాన్ కస్టమర్ రిలేషన్స్ టీం ఎగ్జిక్యూటివ్ నుండి "జెఫ్ బెజోస్ మీ ఈ–మెయిల్ అందుకున్నాడు. నేను ఆయన తరపున స్పందిస్తున్నాను.”అని ఓంకర్ కు ఈ–మెయిల్ సందేశం వచ్చింది. ఈ–మెయిల్ అందుకున్న కొన్ని రోజులకే ఓంకార్ తన డబ్బును రీఫండ్ పొందాడు." తన సమస్యపై సీఈఓ స్పందించడంపై ఓంకార్ సంతోషం వ్యక్తం చేస్తూ "అమెజాన్ పూర్తిగా ప్రాసెస్ బేస్డ్ సంస్థ. ఒక కస్టమర్ కేసు నిజమైతే, వారు ఉత్పత్తిని తిరిగి అందజేస్తారు లేదా డబ్బును రీఫండ్ చేస్తారు. అమెజాన్ కస్టమర్ సేవ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. " అని అన్నాడు. కాగా, కస్టమర్ సమస్యల పట్ల జెఫ్ బెజోస్ స్పందించిన సందర్బాలు చాలానే ఉన్నాయి. కస్టమర్ పంపిన మెయిల్స్కు నేరుగా స్పందిచనప్పటికీ, వాటిని పరిశీలించి ఇన్ ఛార్జి ఎగ్జిక్యూటివ్లకు ఫార్వార్డ్ చేస్తాడు. కస్టమర్స్ తనకు పంపిన ఈ–మెయిళ్ళను స్వయంగా చదువుతానని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
Published by: Krishna Adithya
First published: October 17, 2020, 6:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading