క్రెడిట్ కార్డ్... ఈ రోజుల్లో చాలామందికి ఓ అవసరం. గతంలో క్రెడిట్ కార్డుల జారీ ప్రక్రియ కాస్త కఠినంగా ఉండేది. దాంతో కొద్ది మంది దగ్గరే క్రెడిట్ కార్డులు ఉండేవి. ఇప్పుడు బ్యాంకులు కస్టమర్లను వెతికిమరీ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని మూడు నాలుగు క్రెడిట్ కార్డులు వాడుతున్నవాళ్లు కూడా ఉన్నారు. మరి ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే నష్టమా? దాని వల్ల క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ఉంటుందా? తెలుసుకోండి.
Read this: Personal Finance: అకౌంట్‌లో ఎక్కువ వడ్డీ ఇచ్చే 'ఆటో స్వీప్' గురించి మీకు తెలుసా?
క్రెడిట్ కార్డు అంటే మనకు అప్పు ఇచ్చే కార్డు. మీరు అవసరానికి మీ స్నేహితుల దగ్గర అప్పు తీసుకున్నట్టు క్రెడిట్ కార్డు ద్వారా అప్పులు చేస్తారు. ఆ తర్వాత బిల్లులు చెల్లించి అప్పులు తీర్చేస్తారు. మరి మీ దగ్గర ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయంటే... మీరు ఎక్కువగా అప్పులు చేసేవాళ్లు అని బ్యాంకులు అర్థం చేసుకుంటాయి. అయితే ఆ అప్పులు మీ ఆదాయ పరిమితిలో ఉంటే ఇబ్బందేమీ ఉండదు. కానీ మీ ఆదాయానికి అప్పులకు పొంతనలేదంటే చిక్కుల్లో పడాల్సిందే. మీ క్రెడిట్ స్కోర్ తగ్గడానికి ఇది ఓ కారణం అవుతుంది.
Read this: Health Apps: బరువు తగ్గాలా? ఈ 7 యాప్స్ ట్రై చేయండి
మూడునాలుగు కార్డులు వాడుతూ వాటిపై లేట్ మెంట్స్ చేస్తూ ఉన్నా మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. మిమ్మల్ని హై-రిస్క్ కస్టమర్‌గా బ్యాంకు భావిస్తుంది. భవిష్యత్తులో ఏవైనా లోన్స్‌కు దరఖాస్తు చేసినా బ్యాంకులు మీకు అప్పు ఇవ్వడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాయి. మీ తిరిగి చెల్లింపుల చరిత్ర క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఈఎంఐలు ఆలస్యంగా చెల్లించొద్దు. గడువులోగా వాయిదాలు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.
Read this: LIC Children's Policy: రోజుకు రూ.12... మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా
ఒక్కసారి గడువులోగా బిల్లులు చెల్లించకపోతే సిబిల్ స్కోర్ 80-110 పాయింట్లు పడిపోతుంది. క్రెడిట్ స్కోర్‌పై చెల్లింపుల చరిత్ర ప్రభావం 35 శాతం ఉంటుంది. ఎక్కువ క్రెడిట్ అకౌంట్లు ఉంటే క్రెడిట్ స్కోర్‌పై 30 శాతం ప్రభావం చూపిస్తుంది. మీ క్రెడిట్ లిమిట్‌లో 60 శాతం కన్నా ఎక్కువ వాడకపోవడం మంచిది. లోన్లకు, క్రెడిట్ కార్డులకు ఎక్కువగా దరఖాస్తులు చేసినా క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. అందుకే వీలైనంత వరకు ఎక్కువ క్రెడిట్ కార్డులు, లోన్లకు దూరంగా ఉండటమే మంచిది.
Photos: అమరవీరుల స్మృతి చిహ్నం 'నేషనల్ వార్ మెమోరియల్'
ఇవి కూడా చదవండి:
Indian Railways: భారతీయ రైల్వే లగేజీ రూల్స్ ఇవే...
Mobile Insurance: మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ ఉందా? బీమా ఎంత ముఖ్యం?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Credit cards, Personal Finance