MULTIBAGGER STOCKS FOR 2022 SHARE INDIA EXPERT RECOMMENDS 2 STOCKS TO BUY GH VB
Multibagger Stocks: 2022లో ఈ రెండు స్టాక్స్‌తో అధిక రాబడులు.. షేర్ ఇండియా నిపుణుల జోస్యం..
ప్రతీకాత్మక చిత్రం
ఏదైనా స్టాక్స్ పై పెట్టుబడి పెట్టినప్పుడు అనేక రెట్లు రాబడిని ఇచ్చే స్టాక్స్‌నే మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. క్లుప్తంగా చెప్పాలంటే 100 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడులను ఇచ్చే స్టాక్స్ ఇవి.
స్టాక్ మార్కెట్ (Stock Market)లో పెట్టుబడులు పెట్టినవారికి 2021 అత్యుత్తమంగా కలిసొచ్చింది. ముఖ్యంగా మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో(Multibagger stocks) ఇన్వెస్ట్ చేసివారికి మంచి రాబడులు అందాయి. అన్ని సెగ్మెంట్లలో షేర్లు ఊపందుకున్నాయి. తాజాగా 2022 సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ ఏడాది కూడా మార్కెట్లో (Markets) మంచి లాభాలు రావాలని ఔత్సాహికులు (Aspirants) ఆశిస్తున్నారు. ఇలాంటి పెట్టుబడిదారులను దృష్టిలో పెట్టుకునే షేర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, రిసెర్చ్ హెడ్ రవి సింగ్ మల్టీ బ్యాగర్ స్టాక్స్‌ను ఎంచుకున్నారు. ముఖ్యంగా CDSL, BSE షేర్లను తీసుకోవాలని కొనుగోలుదారులకు సూచించారు. ఈ వివరాలను ‘లైవ్ మింట్’ వార్తాసంస్థతో పంచుకున్నారు. ఆయన చెప్పిన విషయాలు తెలుసుకుందాం..
సీడీఎస్ఎల్..
సీడీఎస్ఎల్ షేర్ ధర చక్రీయంగా ఉందని రవి తెలిపారు. ఈ స్టాక్స్ రూ.1425 కనిష్ఠ స్థాయి నుంచి అత్యధిక స్థాయికి, అక్కడ నుంచి మళ్లీ స్వింగ్ అవుతూ వచ్చిందని అన్నారు. రోజువారీ ఛార్ట్‌లో బలమైన రీతిలో ఈ స్టాక్ అన్ని ప్రధాన షేర్ల కంటే కూడా సగటున 20, 50, 200 డీఎంఏల వరకు ముగుస్తుందన్నారు. 2022లో ఈ స్టాక్ రూ.3200 వరకు వెళ్తుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో సీడీఎస్ఎల్ షేర్ ధర రూ.1537 వద్ద ట్రేడ్ అవుతుంది.
బీఎస్ఈ..
ఓసిలేటర్ ఫ్రంట్ వద్ద బీఎస్ఈ షేర్ ధర గత 14 కాలవ్యవధుల్లో రూ.1700 నుంచి 1800 మధ్య కంఫర్ట్ జోన్లో కొనసాగింది. ముఖ్యంగా 9వ పీరియడ్ నుంచి కొంత ఒడుదొడుకులకు లోనైంది. అదే డేరివేటివ్స్ ఫ్రంట్‌లో గత కొన్ని ట్రేడింగ్ సెషన్లుగా బీఎస్ఈ దిగువ స్థాయిల్లో ట్రేడ్ అయింది. బీఎస్ఈలో ఈ షేర్లు 2022లో రూ.4000 వరకు చేరుకోవచ్చని రవిసింగ్ తెలిపారు.
మల్టీ బ్యాగర్ స్టాక్ అంటే..
ఏదైనా స్టాక్స్ పై పెట్టుబడి పెట్టినప్పుడు అనేక రెట్లు రాబడిని ఇచ్చే స్టాక్స్‌నే మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. క్లుప్తంగా చెప్పాలంటే 100 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడులను ఇచ్చే స్టాక్స్ ఇవి. ఉదాహరణకు ఏదైనా స్టాక్ రెండు రెట్లు రిటర్న్ ఇస్తే టూ-బ్యాగర్ స్టాక్ అని, మూడు రెట్లు రాబడి ఇస్తే త్రీ-బ్యాగర్, 4 రెట్లు ఇస్తే ఫోర్ -బ్యాగర్ అని అంటారు. ఈ విధంగా బహుళ రెట్లు రాబడినిచ్చే స్టాక్స్‌ను మల్టీబ్యాగర్ స్టాక్ అని అంటారు.
కొంచెం రిస్క్ తీసుకుని తమ డబ్బును అధికం చేయాలని చూసే పెట్టుబడిదారులు మల్టీబ్యాగర్ స్టాక్స్‌పై దృష్టి పెడతారు. ఏదైనా స్టాక్ ఈ స్థితి రాబడులు ఇచ్చేంత వరకు అది మల్టీబ్యాగర్ స్టాక్ అని ఎవ్వరికీ తెలియదు. మార్కెట్ ఊతమిచ్చే వాతావరణంలో ఇవి రిస్క్‌తో కూడికుని ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.