Stock Market | స్టాక్ మార్కెట్లో చాలా షేర్లు ఉంటాయి. అయితే అన్నీ ఒకే రకమైన లాభాలు మాత్రం అందించలేవు. కొన్ని షేర్లు (Stocks) అయితే ఇన్వెస్టర్లకు నష్టాలు కూడా మిగిలిస్తాయి. అందువల్ల స్టాక్ మార్కెట్లో (Share Market) డబ్బులు పెట్టే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధిక రిస్క్ ఉంటుందని గుర్తించాలి. స్టాక్ ఎంపికలో అప్రమత్తంగా ఉంటేనే లాభాలు పొందగలరు.
కొన్ని స్టాక్స్ నష్టాలు అందిస్తే.. మరికొన్ని షేర్లు మాత్రం భారీ లాభాలు అందిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇలాంటి స్టాక్ గురించే మాట్లాడుకోబోతున్నాం. మూడు షేర్లు ఇన్వెస్టర్ల పంట పండించాయి. పదేళ్లలో రూ.లక్ష ఏకంగా రూ. కోటిగా మార్చేశాయి. దీంతో ఆ షేర్లలో డబ్బులు పెట్టిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. ఆ మూడు స్టాక్స్ ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.
జనాలు ఎక్కువగా కొంటున్న టాప్ 10 బైక్స్ ఇవే.. వీటి క్రేజ్ వేరే లెవెల్!
దీపక్ నైట్రేట్, అల్కైల్ అమైన్స్ కెమికల్స్, కేఈఐ ఇండస్ట్రీస్ అనే షేర్లు ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేశాయి. ఈ మూడు షేర్లు గత పదేళ్ల కాలంలో చూస్తే ఏకంగా 10,000 శాతం రాబడిని అందించాయి. రూ.లక్ష మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు ఇది రూ.కోటి మారి ఉండేది. దీపక్ నైట్రేట్ షేరు 2012 అక్టోబర్ 19న కేవలం రూ.19 వద్ద ఉండేది. అయితే ఇప్పుడు ఈ షేరు ధర ఏకంగా రూ. 2247 వద్ద ఉంది. అంటే పదేళ్ల కింద రూ.లక్ష పెట్టిన వారికి ఇప్పుడు 1.17 కోట్లు లభించేవి.
రూ.10 లక్షల కన్నా తక్కువ ధరకే లభిస్తున్న టాప్ ఎస్యూవీ కార్లు ఇవే!
అలాగే అల్కైల్ అమైన్స్ కెమికల్స్ కూడా బంపర్ రిటర్న్ అందించింది. ఈ షేరు ధర 2012 నంబర్ 9న కేవలం రూ. 27 వద్ద ఉండేది. కానీ ఇప్ప్డు షేరు ధర రూ. 2960కు చేరింది. అంటే ఈ షేరు పదేళ్ల కాలంలో రూ.లక్ష మొత్తాన్ని రూ.1.06 కోట్లుగా మార్చేసింది. ఇక చివరిగా కేఈఐ ఇండస్ట్రీస్ కూడా దుమ్మురేపింది. ఈ షేరు రూ.లక్షను రూ. 1.24 కోట్లుగా మార్చేసింది. పదేళ్ల కాలంలో చూస్తే ఈ షేరు రూ.12 నుంచి రూ. 1595కు చేరింది. కాగా స్టాక్ మార్కెట్లో భారీ రిస్క్ ఉంటుంది. అందువల్ల డబ్బులు పెట్టే వారు ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. రిస్క్ తీసుకునే వారు మాత్రమే స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడం ఉత్తమం. లేదంటే పోస్టాఫీస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Multibagger stock, Share Market Update, Stock Market, Stocks