హోమ్ /వార్తలు /బిజినెస్ /

Multibagger Penny stocks: లక్ష పెట్టుబడితో రూ.4 కోట్ల రాబడి.. ఒక్క ఏడాదిలోనే అనూహ్య లాభాలు

Multibagger Penny stocks: లక్ష పెట్టుబడితో రూ.4 కోట్ల రాబడి.. ఒక్క ఏడాదిలోనే అనూహ్య లాభాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Isgec Heavy Engineering Ltd: గత ఏడాది ISGEC షేర్ విలువ రూ.1.55 మాత్రమే. కానీ ఇప్పుడు దాని విలువ 603కి చేరింది. అంటే కేవలం ఏడాది కాలంలోనే ఏకంగా 38, 848 శాతం పెరిగింది.

స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. ఒకరోజు లాభాల జోరు చూపిస్తే.. మరోరోజు నష్టాలతో పతనమవుతుంటాయి. కొందరు ఎన్నో ఆశలతో కొన్ని కంపెనీల స్టాక్స్ కొనుగోలు చేస్తారు. కానీ అవి ఆశించినంత లాభాలు తీసుకురావు. ఇంకొన్ని స్టాక్స్ ఉంటాయి.  జనాలకు పెద్దగా తెలియవు.  అందుకే వాటిని ఎవరూ పట్టించుకోరు. కానీ అలాంటివే అనూహ్య లాభాలను తీసుకొస్తాయి. సామాన్యులను కూడా కోటీశ్వరులను చేస్తాయి. ISGECహెవీ ఇంజనీరింగ్ లిమిటెడ్ కూడా ఆ కోవలోకే వస్తోంది. 2021లో ఎన్నో స్టాక్స్ లాభాలు తెచ్చాయి. కానీ ISGEC కంపెనీ.. షేర్ మార్కెట్లో మరే స్టాక్‌కు సాధ్యం కాదనంతగా దుమ్మురేపింది. ఈ ఏడాది అత్యధిక లాభాలు గడించిన షేర్ ఇదే. ఏకంగా 40వేల శాతం లాభాలతో పెట్టుబడి దారులపై కాసుల వర్షం కురిపించింది.

డిసెంబర్ 30న ఐఎస్‌జీఈసీ హెవీ ఇంజినీరింగ్ లిమిటెడ్ స్టాక్ రూ. 603.20 పైసల వద్ద ముగిసింది. నిన్న ఈ షేర్ వాల్యూ 2.68 శాతం పడిపోయింది. గరిష్టంగా 627.50.. కనిష్ట స్థాయి రూ.601గా నమోదైంది. ఐతే సరిగ్గా ఏడాది క్రితం ఈ స్టాక్ విలువ ఎంతో తెలుసా? మీరు అస్సలు ఊహించ లేరు. అంత తక్కువగా ఉంది. గత ఏడాది ISGEC షేర్ విలువ రూ.1.55 మాత్రమే. కానీ ఇప్పుడు దాని విలువ రూ.603కి చేరింది. అంటే కేవలం ఏడాది కాలంలోనే ఏకంగా 38, 848 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఎవరైనా ఏడాది క్రితం ఈ స్టాక్‌లో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే.. ఇప్పుడు దాని విలువ 3 కోట్ల 88 లక్షల 48 వేల రూపాయలకు పెరిగేది. కనీసం 10 వేల రూపాయలు పెట్టినా కూడా ఇప్పుడు రూ.38 లక్షల రూపాయలు అయ్యేవి.

Bank Holidays January 2022: జనవరిలో బ్యాంకులకు 9 హాలిడేస్... ఎప్పుడెప్పుడంటే

ISGEC షేర్ విలువ ఇప్పుడు కాస్త తగ్గింది కానీ.. అదే జులైలో అయితే ఆల్ రికార్డు స్థాయిని తాకింది. జూలై 2021లో రూ.878.35గా నమోదైంది. 52 వారాల్లో ఈ స్టాక్ గరిష్ట విలువ ఇదే. కానీ ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు రూ.610కి అటూ ఇటూగా ట్రేడ్ అవుతోంది. ఇందులో పెట్టుబడిన వారు ఒకవేళ జులైలోనే స్టాక్స్ అమ్మేసి.. డబ్బును విత్‌డ్రా చేసి ఉంటే.. ఏకంగా 56,568 శాతం లాభాలు వచ్చేవి. అంటే గత ఏడాది ఎవరైనా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి.. జులైలోనే స్టాక్స్ అమ్మేసి ఉంటే ఏకంగా 5.60 కోట్లు వచ్చేవి. అంతలా లాభాల పంట పడించింది.

New Rules: అలర్ట్... జనవరి నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి

ప్రస్తుతం ISGECహెవీ ఇంజనీరింగ్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటల్ విలువ. రూ. 4440.45 కోట్లు. కంపెనీ షేర్లలో 62.43 శాతం దాని ప్రమోటర్ల వద్దే ఉన్నాయి. 28.59 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషన్‌ల వద్ద ఉన్నాయి. కొన్ని పెద్ద మ్యూచువల్ ఫండ్‌లు కూడా ఈ స్టాక్‌లో 6.68 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

Home Loan: మీ సాలరీ రూ.50 వేల లోపు ఉందా...అయితే ఎంత గృహరుణం వస్తుందో తెలుసుకోండి...

కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం...  1933లో ISGECహెవీ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభమయింది. అప్పుడు దానిని సరస్వతీ షుగర్ సిండికేట్ పేరుతో పలిచేవారు. దీని ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది. sgec Heavy Engineering Ltd అనేది బహుళ ఉత్పత్తుల సంస్థ. గత 88 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఇంజనీరింగ్ యంత్రాలను అందిస్తోంది. ఈ కంపెనీ ఉత్పత్తులు 91 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ కంపెనీ 2021 ET 500 లిస్టింగ్‌లో 252వ స్థానంలో నిలిచింది. ఫార్చ్యూన్ ఇండియా 500 లిస్టింగ్‌లో 253వ స్థానాన్ని దక్కించుకుంది.

First published:

Tags: Business, Multibagger stock, Share price, Stock Market

ఉత్తమ కథలు