హోమ్ /వార్తలు /business /

Multibagger Stock: ఏడాదిలో 150 శాతం పెరిగిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌.. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం..!

Multibagger Stock: ఏడాదిలో 150 శాతం పెరిగిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌.. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం..!

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను ఒక మల్టీబ్యాగర్ స్టాక్ ఆకర్షిస్తోంది. ఇందులో చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ఊహించని లాభాలను అందుకుంది. అదే SRF Ltd. ఇది ఒక లార్జ్‌క్యాప్‌ కెమికల్‌ కంపెనీ. ఇండస్ట్రియల్‌, స్సెషాలిటీ ఇంటర్మీడియేట్స్‌ను మాన్యుఫాక్చర్‌ చేస్తోంది.

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను ఒక మల్టీబ్యాగర్ స్టాక్ ఆకర్షిస్తోంది. ఇందులో చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ఊహించని లాభాలను అందుకుంది. అదే SRF Ltd. ఇది ఒక లార్జ్‌క్యాప్‌ కెమికల్‌ కంపెనీ. ఇండస్ట్రియల్‌, స్సెషాలిటీ ఇంటర్మీడియేట్స్‌ను మాన్యుఫాక్చర్‌ చేస్తోంది.

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను ఒక మల్టీబ్యాగర్ స్టాక్ ఆకర్షిస్తోంది. ఇందులో చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ఊహించని లాభాలను అందుకుంది. అదే SRF Ltd. ఇది ఒక లార్జ్‌క్యాప్‌ కెమికల్‌ కంపెనీ. ఇండస్ట్రియల్‌, స్సెషాలిటీ ఇంటర్మీడియేట్స్‌ను మాన్యుఫాక్చర్‌ చేస్తోంది.

ఇంకా చదవండి ...

  స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను(Investors) ఒక మల్టీబ్యాగర్ స్టాక్ ఆకర్షిస్తోంది. ఇందులో చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ఊహించని లాభాలను అందుకుంది. అదే SRF Ltd. ఇది ఒక లార్జ్‌క్యాప్‌ కెమికల్‌ కంపెనీ. ఇండస్ట్రియల్‌, స్సెషాలిటీ ఇంటర్మీడియేట్స్‌ను మాన్యుఫాక్చర్‌ చేస్తోంది. గత మూడేళ్లలో SRF షేర్ ధర 76 శాతం కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌రేట్‌ (CAGR) సాధించింది. ఈ కంపెనీ షేర్ విలువ గత సంవత్సరంలో 141.84 శాతం పెరిగింది. 2021 మార్చి 30న రూ.1080.45గా ఉన్న షేర్‌ వాల్యూ 2022 మార్చి 30 సాయంత్రం 3:30 గంటలకు రూ.2,705.90కి పెరిగింది. ఆ సమయానికి SRF కెమికల్‌ సంస్థ 150.44 శాతం రాబడిని అందించింది. గత 12 నెలల్లో ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టినవారి డబ్బు(Money) రెట్టింపు అయింది. బ్రోకరేజ్ సంస్థ ICICI సెక్యూరిటీస్ కూడా SRF కంపెనీ షేర్లు మరింత పెరుగుతాయని అంచనా వేసింది. 12 నెలల కాల వ్యవధిలో ఈ స్టాక్‌ రూ.3065 రూపాయల టార్గెట్‌ను చేరుతుందని కాల్ రేటింగ్ ఇచ్చింది.

  1970లో ప్రారంభమైన SRF Ltd కంపెనీ.. నైలాన్ కార్డ్ టైర్‌ ఉత్పత్తులను మొదలుపెట్టిం. ఆ తర్వాత రిఫ్రిజెరాంట్ వాయువులు, స్పెషాలిటీ కెమికల్స్‌, ప్యాకేజింగ్ ఫిల్మ్ తయారు చేస్తూ ఇతర రంగాలలోకి విస్తరించింది. ఈ సంస్థకు అందుతున్న రెవెన్యూలో కెమికల్ ఉత్పత్తుల వాటా 43 శాతంగా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ప్యాకేజింగ్ ఫిల్మ్ (39 శాతం), టెక్నికల్ టెక్స్‌టైల్ (15 శాతం), ఇతర ఉత్పత్తులు(3 శాతం) ఉన్నాయి.

  Pension Scheme: ఈ స్కీమ్‌లో ఈరోజు చేరితే నెలకు రూ.9,250పెన్షన్ ఇచ్చే పథకం

  SRF Ltd కంపెనీ ఓ ప్రకటనలో.. ‘జనరల్‌ థీమ్స్‌ ఆఫ్‌ వెర్టికల్‌ ఇంటెగ్రేషన్‌ అండ్‌ హయ్యర్‌ ఆపరేటింగ్‌ లెవరేజ్‌ ద్వారా కాకుండా ఆగ్రోకెమికల్‌, ఫార్మా రంగాలకు అవసరమైన ఉత్పత్తులను ఫఫ్లోరో కాంపౌండ్స్‌తో తయారు చేస్తాం. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా R22 బ్యాక్‌వర్డ్ ఇంటిగ్రేషన్ ద్వారా పాలిటెట్రాఫ్లోరోఎథైలీన్ (PTFE) లోకి తొలిసారిగా ప్రవేశిస్తున్నాం. ఫ్లోరోపాలిమర్‌ల వినియోగంతో దదీర్ఘకాలికంగా రెవెన్యూ పెరుగుతుంది’ అని పేర్కొంది.

  ప్యాకేజింగ్ విభాగానికి సంబంధించి ఈ కంపెనీ అల్యూమినియం ఫాయిల్స్‌ తయారీపై దృష్టి పెట్టింది. ఇండియా ఎక్కువగా అల్యూమినియం ఫాయిల్స్‌ను దిగుమతి చేసుకోంటోంది. అల్యూమినియం ఫాయిల్స్‌ తయారీతో రూ.425 కోట్ల వ్యాపారం చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో 1.75 నుంచి 2 రెట్లు వృద్ధిని అశిస్తోంది. ఈ అంశాలు కూడా కంపెనీ షేర్‌ విలువ పెరిగేందుకు దోహదపడతాయి.

  ICICI సెక్యూరిటీస్ ఓ ప్రకటనలో.. ‘SRF కంపెనీకి కాల్‌ రేటింగ్‌ ఇస్తున్నాం. రూ.3065లను టార్గెట్‌గా సూచిస్తున్నాం. స్టాక్ టేల్స్ ఫార్మాట్‌లో కవరేజీని ప్రారంభిస్తాం. టార్గెట్‌ను చేరుకొన్న తర్వాత పెట్టుబడుదారులు స్టాప్‌లాస్‌ను కూడా రూ.3065గా గమనించాలి. ప్రతికూల వ్యవసాయ సీజన్ స్పెషాలిటీ కెమికల్ గ్రోత్‌పై ప్రభావం చూపవచ్చు. లోయర్‌ స్ప్రెడ్‌ ఇన్‌ ప్యాకేజింగ్ ఫిల్మ్‌ ఆపరేషనల్‌ గ్రోత్‌ను ప్రభావితం చేయవచ్చు.’ అని తెలిపింది.

  Multibagger Stock: రూ.2 స్టాక్.. రూ.10వేల పెట్టుబడికి రూ.1.30 కోట్ల రాబడి.. ఇన్వెసర్లపై కో

  SRF లిమిటెడ్‌లో 2021 డిసెంబరు 31వ తేదీ నాటికి ప్రమోటర్లు 50.73 శాతం వాటా కలిగి ఉండగా, విదేశీ, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా 19.09 శాతం, 9.16 శాతం వాటా కలిగి ఉన్నారు. 2022 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి SRF లిమిటెడ్ రెగ్యులేటరీ ఆశిష్ భరత్ రామ్‌ని ఛైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్‌గా ననియమించింది. కార్తిక్ భరత్ రామ్‌ను జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తిరిగి నియమించాలని బోర్డు నిర్ణయించింది. 2022 జనవరి 26న విడుదలైన లేఖలో సమాచారం మేరకు 2022 ఏప్రిల్ 1 నుంచి డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్‌గా మిస్టర్ వెల్లయన్ సుబ్బయ్య బాధ్యతలు స్వీకరిస్తారు.

  First published:

  ఉత్తమ కథలు