హోమ్ /వార్తలు /బిజినెస్ /

Investment: రూ.లక్ష పెట్టుబడి.. 3 ఏళ్లలో రూ.70 లక్షల లాభం!

Investment: రూ.లక్ష పెట్టుబడి.. 3 ఏళ్లలో రూ.70 లక్షల లాభం!

 Investment: రూ.లక్ష పెట్టుబడి.. 3 ఏళ్లలో రూ.70 లక్షల లాభం!

Investment: రూ.లక్ష పెట్టుబడి.. 3 ఏళ్లలో రూ.70 లక్షల లాభం!

Money | మూడేళ్లలోనే భారీ లాభం. రూ.లక్ష పెట్టినోళ్లకు ఏకంగా రూ. 70 లక్షల ప్రాఫిట్. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Multibagger Share | ఇన్వెస్ట్‌మెంట్ పవర్ చాలా మందికి తెలిసి ఉండదు. సరైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఎంచుకుంటే అదిరిపోయే రాబడి పొందొచ్చు. దీనికి స్టాక్ మార్కెట్‌లో మల్టీ బ్యాగర్ (Multibaggers) షేర్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తక్కువ కాలంలోనే భారీ లాభాలు పొందొచ్చు. అయితే స్టాక్ మార్కెట్‌లో (Stock Market) భారీ రిస్క్ కూడా ఉంటుందని గర్తించుకోవాలి. అందుకే డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మార్కెట్‌లో చాలా మల్టీబ్యాగర్ స్టాక్స్ ఉంటాయి. వీటిల్లో మనం ఇప్పుడు ఆదిత్య విజన్ షేరు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ స్టాక్ ఇన్వెస్టర్ల పంట పండించింది. డబ్బులు పెట్టిన వారికి భారీ లాభాలు అందించింది. ఎంతలా అంటే రూ. లక్ష మొత్తాన్ని ఏకంగా రూ. 70 లక్షలుగా మార్చేసింది. అది కూడా కేవలం మూడేళ్ల కాల వ్యవధిలోనే. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

వావ్.. కార్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్ ఆఫర్లు.. ఏకంగా రూ.57 వేల తగ్గింపు!

బీఎస్ఈలో లిస్ట్ అయిన ఈ షేరు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూస్తే ఇన్వెస్టర్ల డబ్బులను రెట్టింపు చేసింది. షేరు ధర రూ. 630 నుంచి రూ. 1390కు చేరింది. ఒకప్పుడు ఆదిత్య విజన్ అనేది పెన్నీ స్టాక్. తర్వాత డబుల్ డిజిట్, తర్వాత ట్రిబుల్ డిజిట్, ఇప్పుడు ఫోర్ డిజిట్లకు చేరింది. ఆరేళ్లలోనే ఈ షేరు ఇలా ర్యాలీ చేసింది. కోవిడ్ తర్వాత ఈ స్టాక్ పెరుగుదల బాగుందని చెప్పుకోవచ్చు.

వారెవ్వా.. ఇలా చేస్తే రూ.15 వేల ఫోన్‌ను రూ.599కే కొనొచ్చు.. ఫ్లిప్‌కార్ట్‌ దిమ్మతిరిగే ఆఫర్లు!

మూడేళ్ల కాలంలో షేరు ధర రూ. 20 నుంచి రూ. 1390కు చేరింది. అంటే ఏకంగా 6900 శాతం పరుగులు పెట్టింది. అంటే రూ.లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఏకంగా రూ. 70 లక్షలు లభించేవని చెప్పుకోవచ్చు. అది కూడా కేవలం మూడేళ్ల వ్యవధిలోనే. ఇలాంటి లాభాలను స్టాక్ మార్కెట్‌లోనే చూడగలం.

కాగా మీరు కూడా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే మాత్రం.. జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి రెండు సార్లు స్టాక్స్ ఎంపికలో అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని స్టాక్స్ లాభాలు అందిస్తే.. మరికొన్ని నష్టాలు ఇస్తాయి. అందువల్ల మీరు డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వారు, సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ కోరుకునే వారు అయితే పోస్టాఫీస్, బ్యాంక్ స్కీమ్స్‌లో డబ్బులు పెట్టొచ్చు. మార్కెట్‌కు దూరంగా ఉండటం బెస్ట్.

First published:

Tags: Multibagger stock, Share Market Update, Stock Market, Stocks

ఉత్తమ కథలు