Share Market | పెట్టింది రూ. లక్ష. వచ్చింది రూ. కోటికి పైగా. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక షేరు ఇన్వెస్టర్లను కోటీశ్వరులను (Money) చేసింది. ఇప్పుడు మనం ఆ షేరు గురించి తెలుసుకోబోతున్నాం. ఆ షేరు పేరు ఆర్తి ఇండస్ట్రీస్. ఇది ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. ఎంతలా అంటే రూ. లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఏకంగా రూ. 1.5 కోట్లు లభించాయి. అది కూడా 11 ఏళ్లలోనే. మరే ఇతర స్కీమ్ (Scheme) కూడా ఇలాంటి రాబడిని అందించలేదు.
బోనస్ షేర్లు, స్టాక్ స్ల్పిట్, బై బ్యాక్, మధ్యంతర డివిడెట్, తుది డివిడెంట్ వంటివి అన్నీ కలుపుకుంటే దీర్ఘకాలంలో ఈ షేరోల డబ్బులు పెట్టిన వారికి భారీ రాబడి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆర్తి ఇండస్ట్రీస్ షేరు గత 11 ఏళ్లలో చూస్తే రూ. లక్ష ఇన్వెస్ట్‌మెంట్‌ను రూ. 1.55 కోట్లుగా మార్చేసింది. బీఎస్‌ఈ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. ఈ షేరు 2019, 2021లో బోనస్ షేర్లు ప్రకటించింది.
ఒక్కసారి చార్జ్ చేస్తే 330 కి.మి వెళ్లొచ్చు.. దేశంలో ఎక్కువ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!
2019 సెప్టెంబర్ 27న ఆర్తి ఇండస్ట్రీస్ షేరు ఒక షేరుకు మరో షేరును బోనస్‌గా అందించింది. ఇంకా 2021 జూన్ 22న కూడా కంపెనీ ఇలాగే ఒక షేరుకు మరో షేరును ఉచితంగా ఇచ్చింది. అంటే 11 ఏళ్ల కింద ఆర్తి ఇండస్ట్రీస్ షేరులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి 7142 షేర్లు వచ్చేవి. అప్పుడు షేరు ధర కేవలం రూ. 14 మాత్రమే. బోనస్ షేర్ల జారీ తర్వాత చూస్తే.. ఈ షేర్లు 28,568కు చేరతాయి.
ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. కొత్త రూల్, ఇకపై అలా చేయాల్సిందే!
అంటే ఈ లెక్కన చూస్తే.. 11 ఏళ్ల కిందట ఆర్తి ఇండస్ట్రీస్ షేరులో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు రూ. కోటి 50 లక్షలకు పైగా వచ్చేవి. ప్రస్తుతం ఈ షేరు ధర రూ. 544 వద్ద ఉంది. అంటే భారీ లాభం వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్‌లో భారీ రిస్క్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పెట్టిన డబ్బులు కూడా పూర్తిగా వెనక్కి రాకపోవచ్చు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారు మాత్రమే స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. అది కూడా స్టాక్ మార్కెట్ నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నష్టపోవాల్సి రావొచ్చు. అన్ని షేర్లు లాభాలు అందించలేవు. కొన్ని షేర్లు ఒక టైమ్‌లో లాభాలు అందించి.. ఇంకో టైమ్‌లో నష్టాలు ఇవ్వొచ్చు. అందుకే అలర్ట్‌గా ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Money, Multibagger stock, Share Market Update, Stock Market, Stocks