హోమ్ /వార్తలు /బిజినెస్ /

Investment: రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఏడాదిలో రూ.11 లక్షల రిటర్న్స్

Investment: రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఏడాదిలో రూ.11 లక్షల రిటర్న్స్

Investment: రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఏడాదిలో రూ.11 లక్షల రిటర్న్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Investment: రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఏడాదిలో రూ.11 లక్షల రిటర్న్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Multibagger Stock | మల్టీబ్యాగర్ స్టాక్స్ ఊహించని రిటర్న్స్ ఇస్తుంటాయి. స్టాక్ మార్కెట్లో (Stock Market) ఓ కంపెనీ ఏడాదిలో 1050 శాతం రిటర్న్స్ ఇవ్వడం విశేషం. ఏడాది క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.11.50 లక్షలు రిటర్న్స్ వచ్చాయి.

ఇంకా చదవండి ...

స్టాక్ మార్కెట్లో నష్టాలు ఎక్కువగా వస్తాయని అంటుంటారు. కానీ లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసినవారికి లాభాల వర్షం కురిసింది. ఏడాది క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.11 లక్షల రిటర్న్స్ వచ్చాయి. కరోనావైరస్ మహమ్మారి (Covid 19 Pandemic) కారణంగా కొంతకాలం నష్టాలబాట పట్టిన స్టాక్ మార్కెట్లు (Stock Market) ఆ తర్వాత లాభాల పరుగులు తీశాయి. అయితే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం (Russia Ukraine War), అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఇటీవల స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అయినా కొన్ని స్టాక్స్ మాత్రం లాభాల పంట పండిస్తుండటం విశేషం.

స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నవారికి మంచి లాభాలు ఇచ్చిన షేర్లలో రాధికా జ్యువెల్‌టెక్ కంపెనీ కూడా ఒకటి. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2021 ఏప్రిల్ 23న ఈ షేర్ ధర రూ.15.30. సరిగ్గా ఏడాది తర్వాత అంటే 2022 ఏప్రిల్ 22న ఈ షేర్ ధర రూ.178.10. ఏడాదిలో 1050 శాతం రిటర్న్స్ ఇచ్చాయి రాధికా జ్యువెల్‌టెక్ షేర్లు. ఈ ఏడాది రాధికా జ్యువెల్‌టెక్ షేర్ రూ.132 నుంచి రూ.178 ధరకు చేరుకుంది. ఒక నెలలోనే 15 శాతం రిటర్న్స్ ఇస్తూ రూ.154 నుంచి రూ.178 కి పెరిగింది. గత ఆరు నెలల్లో ఈ షేర్ ధర రూ.86 నుంచి రూ.178 ధరకు చేరుకుంది. అంటే ఆరు నెలల్లో 110 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

SBI Alert: కస్టమర్లకు ఎస్‌బీఐ అలర్ట్... గైడ్‌లైన్స్ విడుదల చేసిన బ్యాంక్

రిటర్న్స్ వివరాలు చూస్తే ఏడాది క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.11.50 లక్షలు రిటర్న్స్ రావడం విశేషం. నెల క్రితం ఈ స్టాక్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.1.15 లక్షల రిటర్న్స్ వచ్చేవి. ఇక ఆరు నెలల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.2.10 లక్షల రిటర్న్స్ వచ్చేవి.

రాధికా జ్యువెల్‌టెక్ కంపెనీ 2016లో ఏర్పాటైంది. బంగారు నగలు, వజ్రాల నగలు, ఆభరణాల వ్యాపారంలో ఉంది ఈ సంస్థ. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో రెండో రీటైల్ షోరూమ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఇటీవల సెబీకి తెలిపింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోని తర్వాత త్రైమాసికంలో 10,000 చదరపు అడుగుల అతిపెద్ద షోరూమ్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. రాధికా జ్యువెల్‌టెక్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 421 కోట్లు.

India Post: అలర్ట్... ఇండియా పోస్ట్ పేరుతో ఈ లింక్స్ మీకు కూడా వచ్చాయా?

స్టాక్ మార్కెట్లో ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్ చాలానే ఉంటాయి. అయితే ఏ షేర్ మల్టీబ్యాగర్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. షేర్లలో ఇన్వెస్ట్ చేసేప్పుడు ఆ కంపెనీ గురించి పూర్తిగా అధ్యయనం చేయాలి. లేదా ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ సలహాలు తీసుకోవాలి. స్టాక్ మార్కెట్ గురించి అధ్యయనం చేసే సమయం లేనివారు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.

First published:

Tags: Multibagger stock, Personal Finance, Share Market Update, Stock Market, Stocks

ఉత్తమ కథలు