హోమ్ /వార్తలు /బిజినెస్ /

Multibagger Stock: ఏడాదిలోనే నాలుగు రెట్ల రాబడి.. ఇన్వెస్టర్లను ధనవంతులు చేసిన స్టాక్..

Multibagger Stock: ఏడాదిలోనే నాలుగు రెట్ల రాబడి.. ఇన్వెస్టర్లను ధనవంతులు చేసిన స్టాక్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Yasho industries: గత నెల రోజుల్లో యశో ఇండస్ట్రీస్ షేర్ 4.47 శాతం క్షీణించింది. గురువారం మాత్రం మళ్లీ లాభాల బాట పట్టింది. గురువారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి యశో ఇండస్ట్రీస్ షేర్ విలువ రూ.85.40 పెరిగింది

  ఆశిష్ కచోలియా (ashish kacholia).. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ పేరు సుపరిచితమే. ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో బిగ్ వేల్‌గా ఆయనకు పేరుంది. ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియోలో అనేక మల్టీబ్యాగర్ స్టాక్స్ ఉన్నాయి. అందులో కొన్ని స్టాక్స్ గత ఏడాదిలో అదిరిపోయే రాబడిని ఇచ్చాయి. మల్టీబ్యాగర్ స్టాక్‌లను గుర్తించడంలో ఆశిష్ కచోలియాకు అద్భుతమైన సామర్థ్యం ఉంది. ఆయన పోర్ట్‌ఫోలియోలో యశో ఇండస్ట్రీస్ (yasho industries ) షేర్లు కూడా ఉన్నాయి. ఈ కంపెనీ స్టాక్ ఇటీవల బాగా ర్యాలీ చేస్తోంది. ఒక సంవత్సర కాలంలోనే తన ఇన్వెస్టర్లకు 389 శాతం లాభాలను అందించింది.

  యశో ఇండస్ట్రీస్ స్టాక్ (yasho industries share price) గురువారం బాగా పెరిగింది. ఇంట్రాడేలో ఈ స్టాక్ 5 శాతం పెరిగి రూ. 1,793.70 వద్ద ట్రేడవుతోంది. యశో ఇండస్ట్రీస్ మార్చి 2022 త్రైమాసికానికి సంబంధించిన షేర్ హోల్డింగ్ విధానం ప్రకారం.. ఆశిష్ కచోలియా ఈ కంపెనీలో 2,91,231 షేర్లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీ పెయిడప్‌ క్యాపిటల్‌లో 2.55 శాతం. మార్చి త్రైమాసికంలో ఆశిష్ కచోలియా ఈ స్టాక్‌లో తన వాటాను పెంచుకున్నారు. డిసెంబర్ త్రైమాసికంలో కచోలియాకు 2,69,431 షేర్లు (2.36 శాతం) ఉంటే.. 2021-22 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో మరో 21,800 షేర్లు కొనుగోలు చేశారు. తద్వారా కంపెనీలో తన వాటాను మరో 0.19శాతం పెంచుకున్నారు.

  Palm Oil: ఒక దేశం అలా.. మరో దేశం ఇలా.. మనకు తప్పని పామాయిల్ పోటు

  యశో ఇండస్ట్రీ షేర్లు ఒక సంవత్సరంలో తమ పెట్టుబడిదారులకు 389 శాతం రాబడిని అందించాయి. గత ఆరు నెలల్లో ఈ షేరు విలువ 32.94 శాతం లాభపడింది. అదేవిధంగా 2022 సంవత్సరంలో 52.68 శాతం పెరిగింది. ఐతే గత ఒక నెల నుంచి ఈ కంపెనీ స్టాక్స్ అమ్మకాలు పెరగడం వల్ల.. షేర్ విలువ తగ్గింది. గత నెల రోజుల్లో యశో ఇండస్ట్రీస్ షేర్ 4.47 శాతం క్షీణించింది. గురువారం మాత్రం మళ్లీ లాభాల బాట పట్టింది. గురువారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి యశో ఇండస్ట్రీస్ షేర్ విలువ రూ.85.40 పెరిగింది. 5 శాతం లాభంతో రూ.1,793.70 వద్ద ముగిసింది. యశో ఇండస్ట్రీస్ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ. 2,099. 52 వారాల కనిష్టం రూ. 3,49.05గా ఉంది.

  PM Kisan: పీఎం కిసాన్ రైతులకు కేంద్రం మరో గుడ్ న్యూస్.. త్వరలోనే అవి కూడా..

  యశో ఇండస్ట్రీస్ కంపెనీ పలు రకాల రసాయనాలను ఉత్పత్తి చేసి, సరఫరా చేస్తుంది. తమ ఉత్పత్తులను ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి చేస్తుంది. డిసెంబర్ త్రైమాసికంలో యశో ఇండస్ట్రీస్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 77.22 శాతం పెరిగి.. రూ.163.81 కోట్లకు చేరుకుంది. నికర ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 53 శాతం పెరిగి... రూ.14.49 కోట్లకు చేరుకుంది. నిర్వహణ ఆదాయం కూడా 150.33 శాతం పెరిగి.. రూ.19.28 కోట్లకు పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ స్టాక్ విలువ మరింతగా పెరగవచ్చని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Business, Personal Finance, Share Market Update, Stock Market

  ఉత్తమ కథలు