రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine War) యుద్ధం యావత్ ప్రపంచాన్ని వణికించింది. అంతేకాదు ప్రారంభం రోజుల్లో ప్రపంచ స్టాక్ మార్కెట్‌లోనూ ప్రకంపనలు సృష్టించింది. ఈ యుద్ధం వల్ల పలు రకాల నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ముడిచమురు ధరలు అనూహ్యంగా ఎగబాకాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ముడి చమురు ధరలు అత్యధిక స్థాయికి చేరుకోవడంతో రసాయన పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. రసాయన పరిశ్రమలో అనేక ఉత్పత్తుల తయారీలో ముడి చమురు లేదా దాని ఉత్పన్నాలు ఉపయోగిస్తారు. ఇప్పుడు ముడిచమరులు ధరలు పెరగడంతో దాని ప్రభావం ఆయా కంపెనీలపై పడింది.
ముడిచమురు ధరలు పెరగడంతో పలు రసాయన కంపెనీల స్టాక్స్ భారీగా నష్టపోయాయి. షేర్ వాల్యూ పడిపోయింది. కానీ రసాయన రంగంలోనూ లాభాలు తెచ్చిన స్టాక్స్ కొన్ని ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు బలమైన రాబడిని ఇచ్చాయి. ఆల్కైల్ అమీన్స్, దీపక్ నైట్రేట్, ప్రైవీ స్పెషాలిటీ కెమికల్స్, తిరుమలై కెమికల్స్, ఆర్తి ఇండస్ట్రీస్, నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్, బాలాజీ అమైన్‌లు కంపెనీల స్టాక్స్.. గత 10 ఏళ్లలో 1000 శాతానికి పైగా రాబడులు ఇచ్చాయి. అందులో ఇప్పుడు ఆల్కైల్ అమీన్స్ (Alkyl Amines)కెమికల్స్ కంపెనీ షేర్ గురించి తెలుసుకుందాం.
Multibagger stock: రూ.లక్షకు రూ.16 లక్షలు లాభం.. కరోనా సమయంలోనూ దుమ్మురేపిన స్టాక్
దేశీయ రసాయన తయారీదారు ఆల్కైల్ అమీన్స్ కెమికల్స్ స్టాక్ గత 8 సంవత్సరాలలో దాదాపు 6,000 శాతం రాబడిని అందించింది. ఈ కాలంలో బిఎస్‌ఇ సెన్సెక్స్ వృద్ధి 160 శాతంగా ఉంది. ఆల్కైల్ అమీన్స్ కెమికల్స్ లిమిటెడ్ (AACL) స్టాక్ గత ఎనిమిదేళ్లలో 5,950 శాతం ర్యాలీ చేసింది. దీని షేరు మార్చి 16, 2014న రూ. 49గా ఉంటే.. ఇప్పుడది మార్చి 17, 2022న నాటికి రూ.2,894కి పెరిగింది. ఒకవేళ మీరు మార్చి 2014లో ఈ కంపెనీలో రూ.1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పడు ఆ మొత్తం దాదాపు రూ.60 లక్షలకు పెరిగి ఉండేది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరల పెరుగుదలతో.. రసాయన స్టాక్‌ల ఔట్‌లుక్‌లో మెరుగుదల కారణంగా ఈ స్టాక్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. గత ఏడాది ఈ స్టాక్ దాదాపు 37 శాతం రాబడిని ఇచ్చింది. అయితే గత నెల రోజుల్లో3 శాతం క్షీణించడ విశేషం.
New Cars: త్వరలో మార్కెట్‌లోకి దూసుకొస్తున్నకొత్త కార్లు.. ఫీచర్స్ ఇవే
కంపెనీ ఏమి చేస్తుందో తెలుసుకోండి
ఈ కంపెనీ గత 30 సంవత్సరాలుగా ఎలిఫెటిక్ అమిన్స్, అమిన్ డిరివేటివ్స్‌తో పాటు పలు ప్రత్యేకమైన రసాయనాల మార్కోటింగ్ వ్యాపారం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్న ఫార్మాస్యూటికల్, ఆగ్రోకెమికల్, రబ్బర్ కెమికల్, వాటర్ ట్రీట్‌మెంట్ పరిశ్రమలకు అమైన్‌లు, అమైన్ ఆధారిత రసాయనాలను సరఫరా చేస్తుంది. ఆల్కైల్ అమిన్స్ కంపెనీకి మొత్తం 12 పొడక్షన్స్ ప్లాంట్స్ ఉన్నాయి. మహారాష్ట్రలోని పాతాళగంగ. కుర్కుంభ్‌తో పాటు గుజరాత్‌లోని దహేజ్‌లో మూడు మానుఫ్యాక్చరింగ్ సైట్స్ కూడా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Multibagger stock, Stock Market