Multibagger Stock | మనం స్టాక్ మార్కెట్లో ఎన్నో రకాల షేర్లను చూస్తూ ఉంటాం. కొన్ని షేర్లు లాభాలు అందిస్తే.. మరికొన్ని ఏమో నష్టాలను మిగిలిస్తూ ఉంటాయి. అయితే ఈక్విటీ మార్కెట్లో (Stock Market) ఒక షేరు మాత్రం ఇన్వెస్టర్ల పంట పండించింది. ఎంతలా అంటే ఏకంగా షేరు వరుసగా 53 రోజులు అప్పర్ సర్క్యూట్ తాకింది. అంటే ఏ రేంజ్లో షేరు (Stock) ధర పరుగులు పెడుతూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
కాన్ఫిడెన్స్ ఫ్యూచరిస్టిక్ ఎనర్జీటెక్ షేరు ఏకంగా 53 రోజులు వరుసగా అప్పర్ సర్క్యూట్ తాకుతూ వచ్చింది. ఈ కంపెనీ బ్లాస్ట్ ప్రూఫ్ ట్రాన్స్సెంట్ లైట్ వెయిట్ కంపోసైట్ సిలిండర్లను తయారు చేస్తుంది. గో గ్యాస్ లైట్ బ్రాండ్ కింద కంపెనీ వీటిని తయారు చేస్తోంది. డొమెస్టిక్, కమర్షియల్ వినియోగానికి ఈ సిలిండర్లను ఉపయోగించొచ్చు. అంతేకాకుండా ఈ కంపెనీ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ లేదా హై ప్రెజర్ సిలిండర్లను కూడా తయారు చేస్తుంది.
వడ్డీ రేట్లు భారీగా పెంచేసిన బ్యాంక్.. డబ్బులు దాచుకునే వారికి పండగే!
కంపెనీ బోర్డు ఇటీవలనే స్టాక్ స్ల్పిట్‌కు ఆమోదం తెలిపింది. నవంబర్ 3 రికార్డ్ డేట్‌గా ఉంది. ప్రతి ఒక్క షేరుకు 2 షేర్లు అదనంగా లభిస్తాయి. స్టాక్ ఫేస్ వాల్యూ 10 నుంచి రూ. 5కు తగ్గుతుంది. అందువల్ల ఈ స్టాక్‌ను కొనుగోలు చేయాలని భావించే వారు ఇప్పుడే కొనొచ్చు. స్టాక్ స్ల్పిట్ తర్వాత షేరు ర్యాలీ చేస్తే అధిక రాబడి పొందొచ్చు.
ఒకే రోజు 3 శుభవార్తలు అందించిన ఐసీఐసీఐ బ్యాంక్!
కాగా మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ షేరు గత నెల రోజుల కాలంలో ఏకంగా రూ. 270 నుంచి రూ. 590కు చేరింది. ఏకంగా 120 శాతం ర్యాలీ చేసింది. అంటే నెల రోజుల్లోనే డబ్బు రెట్టింపు చేసింది. అంతేకాకుండా ఆరు నెలల కాలంలో చూస్తే.. షేరు ధర రూ. 144 నుంచి రూ. 590కు ఎగసింది. 300 శాతానికి పైగా ప్రాఫిట్ ఇచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే షేరు 700 శాతానికి పైగా లాభాన్ని అర్జించి పెట్టింది. గత ఏడాది కాలంలో స్టాక్ ధర రూ. 49 నుంచి రూ. 590కు పరుగులు పెట్టింది. 1100 శాతం లాభాన్ని ఇచ్చింది. 2018 జూన్ నెలలో ఈ షేరు ధర కేవలం రూ. 12.5 మాత్రమే. అంటే అప్పటి నుంచి చూస్తే స్టాక్ ధర 4600 శాతం ర్యాలీ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ షేరులో డబ్బులు పెట్టిన వారి పంట పండింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Multibagger stock, Share Market Update, Stock Market, Stocks