Home /News /business /

MULTIBAGGER PENNY STOCK 97 PAISA BECOMES 194 RUPEES INVESTORS GETS 2 CRORES IN JUST THREE YEAS KNOW ABOUT THAT STOCK SK

Stock Market: పెట్టింది లక్ష.. వచ్చింది రూ.2 కోట్లు.. సామాన్యులను కోటీశ్వరులు చేసిన స్టాక్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

MultiBagger stock: డిగ్జామ్ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ 2021 ఆల్ఫా స్టాక్‌గా రికార్డు సృష్టించింది. ఇది ప్రధాన సూచికలన్నంటినీ అధిగమించింది.

    స్టాక్ మార్కెట్‌ (Stock Market)లో పెట్టుబడులు పెట్టే వారు ఇటీవల ఎక్కువయ్యారు. అంతేకాకుండా ఈ ఏడాది ఎన్నో ఐపీవో (IPO)లు వచ్చాయి. వాటికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రిస్క్ అని తెలిసినప్పటికీ చాల మంది స్టాక్ మార్కెట్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. స్టాక్ మార్కెట్‌ గురించి ఇప్పుడిప్పుడే అవగాహన తెచ్చుకుంటూ అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వారు కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకోవాలి. పైసల్లో ఉన్న షేర్ విలువ ఇప్పుడు వందలు పలుకుతున్నాయి. గత రెండు మూడేళ్లలో పెట్టుబడి దారులపై నోట్ల వర్షం కురిపించాయి. ఒకరకంగాా చెప్పాలంటే సామాన్యులను కోటీశ్వరులు చేశాయి. డిగ్జామ్ (Digjam share price) ఆ కోవలోకే వస్తుంది. ఈ పెన్నీ మల్టీబ్యాగర్ స్టాక్ (Penny Multi bagger stock) టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్‌కు సంబంధించింది. గత 3 సంవత్సరాలలో దీని షేర్ వాల్యూ రూ.0.97 నుండి రూ.194కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు ఏకంగా 19,900 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

    Home Loan రిజెక్ట్ అయ్యిందా..అయితే కారణాలు ఇవే...అప్లై చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    డిగ్జామ్ షేరు (Digjam share) ధరను పరిశీలిస్తే.. గత 1 నెలలో ఒక్కో షేరుకు రూ.66.60 నుంచి రూ.194కి పెరిగింది. అంటే గత నెలలో ఈ స్టాక్ దాదాపు 90 శాతం పెరిగింది. గడిచిన 3 నెలల్లో ఈ స్టాక్ రూ.17.27 నుంచి రూ.194కి పెరిగింది. ఈ మూడు నెలల్లోనే ఇది 1000 శాతం వృద్ధిిన నమోదు చేసింది. గత ఏడాది కాలంలో ఈ స్టాక్ రూ.3.98 నుండి రూ.194కి పెరిగింది. ఈ సమయంలో స్టాక్ ఏకంగా 4800 శాతం పెరిగింది. గత 3 సంవత్సరాలలో డిగ్జామ్ స్టాక్ రూ. 0.97 నుండి రూ. 194కి పెరిగింది. అంటే ఈ మూడేళ్ల కాలంలో దీని విలువ ఏకంగా 200 రెట్లు పెరిగింది.

    ఖర్చులు పెరుగుతున్నాయని క్రెడిట్ కార్డు తీసుకున్నారా..అయితే ఈ త‌ప్పులు అస్సలు  చేయకండి

    లక్ష పెడితే.. రూ.కోట్లు రాబడి
    ఒక పెట్టుబడిదారుడు 1 నెల క్రితం డిగ్జామ్ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే... ఇప్పుడు దాని విలువ రూ. 1.90 లక్షలకు చేరింది. 3 నెలల క్రితం ఇన్వెస్టర్ ఈ స్టాక్‌లో రూ.లక్ష పెట్టి ఉంటే.. ఆ లక్ష రూపాయలు నేడు రూ.11 లక్షలుగా మారాయి. అదే విధంగా ఎవరైనా పెట్టుబడిదారుడు 1 సంవత్సరం క్రితం పెట్టినట్లయితే.. అప్పుడు అతను 49 లక్షలు పొందేవాడు. 3 సంవత్సరాల క్రితం డిగ్జామ్ స్టాక్‌లో 1 లక్ష రూపాయలు పెట్టిన ఇన్వెస్టర్ల రాబడి.. ఇప్పుడు 2 కోట్ల రూపాయలకు చేరింది.

    SIP: నెల‌కు రూ.3 ల‌క్ష‌ల ఆదాయం పొందాలని ఉందా...అయితే ఇలా పొదుపు చేసి చూడండి..ఆశ్చర్యపోతారు

    ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ 2021 ఆల్ఫా స్టాక్‌గా రికార్డు సృష్టించింది. ఇది ప్రధాన సూచికలన్నంటినీ అధిగమించింది. 3 సంవత్సరాల కాలంలో NSE నిఫ్టీ 57.60 శాతం, సెన్సెక్స్ 59 శాతం మాత్రమే రాబడిని అందించగా.. అదే కాలంలో డిగ్జామ్ స్టాక్ ఏకంగా 19900 శాతం రాబడిని ఇచ్చింది. ఇంత భారీ లాభాలు వస్తున్నాయని.. వెనకా ముందు ఆలోచించుండా ఎందులో పడితే అందులో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. కంపెనీతో పాటు ఆ రంగం గురించి లోతైన విశ్లేషణ చేసి తర్వాతే పెట్టుబడులు పెట్టాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Business, Share price, Stock Market

    తదుపరి వార్తలు