హోమ్ /వార్తలు /బిజినెస్ /

Multibagger Stock: ఒక్క షేరుకు 5 షేర్లు ఉచితం.. నెల రోజుల్లో భారీ లాభం, కొన్న వారి పంట పండినట్లే?

Multibagger Stock: ఒక్క షేరుకు 5 షేర్లు ఉచితం.. నెల రోజుల్లో భారీ లాభం, కొన్న వారి పంట పండినట్లే?

Multibagger Stock: ఒక్క షేరుకు 5 షేర్లు ఉచితం.. నెల రోజుల్లో భారీ లాభం, కొన్న వారి పంట పండినట్లే?

Multibagger Stock: ఒక్క షేరుకు 5 షేర్లు ఉచితం.. నెల రోజుల్లో భారీ లాభం, కొన్న వారి పంట పండినట్లే?

Multibagger Share | మార్కెట్‌లో ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. స్టాక్ స్ల్పిట్‌కు కంపెనీ బోర్డు అంగీకారం తెలిపింది. దీంతో ఒక్క షేరుకు ఐదు షేర్లు లభించనున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Stock Market Today | స్టాక్ మార్కెట్‌లో ఎన్నో రకాల షేర్లు ఉంటాయి. వీటిల్లో కొన్ని అదిరే ప్రాఫిట్ అందించి ఉంటే.. మరికొన్ని మాత్రం నష్టాలు మిగిలించి ఉండొచ్చు. అయితే స్టాక్ (Stock) ఎంపిక ప్రాతిపదికనే లాభనష్టాలు ఆధారపడి ఉంటాయని గుర్తించుకోవాలి. స్టాక్ మార్కెట్‌లో భారీ రిస్క్ ఉంటుంది. అందుకే డబ్బులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. లేదంటే ప్రతికూల పరిస్థితుల్లో పెట్టిన డబ్బులు (Money) కూడా వెనక్కి తిరిగా రాకపోవచ్చు. అయితే కొన్ని స్టాక్స్ మాత్రం భారీ లాభాలు అందించి ఉంటాయి.

మనం ఇప్పుడు ఇన్వెస్టర్ల పంట పండించిన షేరు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ షేరు మ యాక్స్ హైట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఈ షేరు నెల రోజుల్లోనే ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించింది. షేరు 52 వారాల గరిష్టానికి చేరింది. రూ. 35.25 స్థాయికి ఎగసింది. తర్వాత 31.95 వద్ద క్లోజ్ అయ్యింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కేవలం రూ. 50 కోట్లు మాత్రమే.

శుభవార్త.. రూ.3 వేలకు పైగా పతనమైన బంగారం ధర.. ఆల్‌టైమ్ గరిష్టం నుంచి..

మ్యాక్స్ హైట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ వాల్యూమ్స్ తక్కువగానే ఉన్నాయి. అయితే వీటిల్లో కూడా పెరుగుదల నమోదు అయ్యింది. 20 రోజుల యావరేజ్ వాల్యూమ్ 15,035గా ఉంది. గత ఏడాదిలో ఈ షేరు మల్టీ బ్యాగర్ రిటర్న్ అందించింది. 159 శాతం మేర పరుగులు పెట్టింది. 2022 ఏడాదిలో చూస్తే.. ఈ స్టాక్ ధర 83 శాతం మేర పైకి కదిలిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆరు నెలల్లో కూడా ఈ స్టాక్ బంపర్ రిటర్న్ అందించింది. 148 శాతం మేర ర్యాలీ చేసింది. ఇంకా నెల రోజుల వ్యవధిలో గమనిస్తే.. ఈ షేరు ధర 102 శాతం మేర పరుగులు పెట్టింది.

కస్టమర్లకు భారీ షాకిచ్చిన 2 బ్యాంకులు.. ఈరోజు నుంచి..

నిన్న జరిగిన కంపెనీ బోర్డు మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టాక్ స్ల్పిట్‌కు ఆమోదం తెలిపారు. ఒక్కో షేరు ఐదు షేర్లుగా విడిపోనుంది. అంటే మీ వద్ద ఒక్క షేరు ఉంటే.. ఐదు షేర్లు వస్తాయి. ఇలా ఒక్కో షేరు ఐదు స్టాక్స్‌గా విడిపోతుంది. కాగా మ్యాక్స్ హైట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనేది కన్సూమర్ డిస్క్రీషనరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ విభాగంలో సర్వీసులు అందిస్తోంది. అలాగే రియల్ ఎస్టేట్‌లో సేవలు అందిస్తోంది. కంపెనీ సభ్యులు, ఇతర రెగ్యులేటరీ అనుమతుల ఆధారంగా స్టాక్ స్ల్పిట్ ఆధారపడి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇకపోతే 2023 మార్చి 31 కల్లా ఈ స్టాక్ స్ల్పిట్ పూర్తి అవుతుందని కంపెనీ వెల్లడించింది.

First published:

Tags: Multibagger stock, Share Market Update, Stock Market, Stocks

ఉత్తమ కథలు