Stock Market Today | ఫినోటెక్స్ కెమికల్స్ షేర్లు ఇన్వెస్టర్ల పంట పండించాయి. డబ్బులు పెట్టిన వారికి కాసుల వర్షం కురిపించాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే..ఈ అశిశ్ కచోలియా పోర్ట్‌పోలియో షేరు (Stock) ఏకంగా 130 శాతానికి పైగా రాబడిని అందించింది. అదే గత మూడేళ్ల కాలంలో చూస్తే.. ఈ మల్టీ బ్యాగర్ (Multibagger) కెమికల్ స్టాక్ రూ. 15 నుంచి రూ. 316 స్థాయికి ర్యాలీ చేసింది. అంటే ఏకంగా 2 వేల శాతానికి పైగా రాబడిని అందించింది.
గత నెల రోజుల కాలంలో గమనిస్తే.. ఈ మల్టీ బ్యాగర్ స్టాక్ ప్రాఫిట్ బుకింగ్ ఒత్తిడిలో ఉంది. దాదాపు 10 శాతం మేర పడిపోయింది. అయితే గత ఆరు నెలల కాలంలో చూస్తే.. ఈ కెమికల్ స్టాక్ రూ. 180 నుంచి రూ. 316 స్థాయికి చేరింది. దాదాపు 75 శాతం రాబడిని అందించింది. అలాగే గత ఏడాది కాలంలో షేరు పనితీరును గమనిస్తే.. ఇది రూ. 105 నుంచి రూ. 316 స్థాయికి చేరింది. దాదాపు 200 శాతం మేర ప్రాఫిట్ అందించింది.
ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్ న్యూస్.. కస్టమర్లకు అదిరిపోయే కొత్త సర్వీసులు!
2020 మార్చి నెలలో ఈ స్టాక్ ధర దాదాపు రూ .15 మాత్రమే. కోవిడ్ 19 వచ్చిన దగ్గరి నుంచి ఈ స్టాక్ కూడా ర్యాలీ చేస్తూ వచ్చింది. గత మూడేళ్ల కాలంలో చూస్తే.. ఈ కెమికల్ స్టాక్ రూ. 15 నుంచి రూ. 316 స్థాయికి చేరింది. ఏకంగా 2000 శాతం మేర పరుగులు పెట్టింది. అంటే షేరు పని తీరు ఆధారంగా చూస్తే.. ఈ షేరు ఇన్వెస్టర్లకు ఎలాంటి రాబడిని అందించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్వెస్టర్లు ఫినోటెక్స్ కెమికల్ షేరులో ఆరు నెలల కిందట రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ విలువ రూ. 1.75 లక్షలకు చేరి ఉండేది. అలాగే ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే.. రూ.లక్ష ఇన్వెస్ట్మెంట్ రూ. 2.3 లక్షలుగా మారి ఉండేది. అలాగే ఏడాది కిందట ఈ షేరులో రూ.లక్ష పెట్టిన వారికి ఇప్పుడు రూ. 3 లక్షలు వచ్చేవి. ఇంకా మూడేళ్ల కిందట ఈ స్టాక్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ విలువ ఏకంగా రూ. 21 లక్షలుగా మారి ఉండేది. ఫినోటెక్స్ కెమికల్లో అశిశ్ కచోలియాకు 2.64 శాతం వాటా ఉంది. అంటే ఈయనకు దాదాపు 29,24,072 షేర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Money, Multibagger stock, Share Market Update, Stock Market, Stocks