Home /News /business /

RIL: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనత...Fortune టాప్ 100 జాబితాలో స్థానం...

RIL: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనత...Fortune టాప్ 100 జాబితాలో స్థానం...

ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనత సాధించింది. తాజాగా ఫార్చ్యూన్ విడుదల చేసిన ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ఆర్‌ఐఎల్ 96 వ స్థానంలో నిలిచింది.

    రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనత సాధించింది. తాజాగా ఫార్చ్యూన్ విడుదల చేసిన ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ఆగస్టు 11 న ఆర్‌ఐఎల్ 96 వ స్థానంలో నిలిచింది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ఏ భారతీయ కంపెనీ సాధించని ఘనత రిలయన్స్ సాధించడం విశేషం. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ప్రపంచంలోని టాప్ 100 కంపెనీలలో చోటు దక్కించుకుంది. 86.2 బిలియన్ డాలర్ల ఆదాయంతో టాప్ 100 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలవడం విశేషం.

    ఫార్చ్యూన్ ఆగస్టు 11 న విడుదల చేసిన 2020 సంవత్సర జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 96 వ స్థానంలో నిలిచింది. 2020 మార్చి 31 న లేదా అంతకు ముందు ముగిసిన ఆయా ఆర్థిక సంవత్సరాలకు వారి మొత్తం ఆదాయాల ఆధారంగా ఫార్చ్యూన్ ఈ ఫలితాలను ప్రకటించింది.

    జాబితాలో చోటు దక్కించుకున్న ఇతర భారతీయ సంస్థలలో భారత్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (BPCL) 309 వ స్థానంలో, టాటా మోటార్స్ 337 వద్ద, Rajesh Exports 462వ స్థానంలోనూ, ఇండియన్ ఆయిల్ కార్ప్ (IOC) 151 వద్ద, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్ప్ (ONGC) 190వ స్థానంలో ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఎస్బిఐ 221 వ స్థానంలో నిలిచింది.R
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Business, Mukesh Ambani, Reliance Industries, RIL

    తదుపరి వార్తలు