హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mukesh Ambani Grandson: ముఖేష్ అంబానీ మనవడి ఫస్ట్ ఫొటో

Mukesh Ambani Grandson: ముఖేష్ అంబానీ మనవడి ఫస్ట్ ఫొటో

మనవడితో ముఖేష్ అంబానీ (Image: Parimal Natwani/Twitter)

మనవడితో ముఖేష్ అంబానీ (Image: Parimal Natwani/Twitter)

మనవడు పుట్టడంతో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఆనందంలో మునిగితేలుతున్నారు. తమ కుటుంబంలోకి ఓ కొత్త వ్యక్తికి ఆనందంగా స్వాగతం పలుకుతున్నారని అంబానీ కుటుంబ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీకి మనవడు పుట్టాడు. ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కోడలు శ్లోక మెహతా తల్లిదండ్రులు అయ్యారు. శ్లోకా మెహతా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మనవడు పుట్టడంతో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఆనందంలో మునిగితేలుతున్నారు. తమ కుటుంబంలోకి ఓ కొత్త వ్యక్తికి ఆనందంగా స్వాగతం పలుకుతున్నారని అంబానీ కుటుంబ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. మనవడు పుట్టిన ఆనందం ముఖేష్ అంబానీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో ఇది. మనవడిని ఎత్తుకుని ఉన్న ముఖేష్ అంబానీని ఇందులో చూడవచ్చు. స్కై బ్లూ కలర్ క్లాత్‌లో వెచ్చగా నిద్రపోతున్న మనవడిని ముఖేష్ అంబానీ ఎత్తుకుని ఉన్న ఫొటోను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్పొరేట్ ఎఫైర్స్ డైరెక్టర్ పరిమళ్ నత్వానీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

‘తల్లిదండ్రులు అయిన శ్లోక, ఆకాష్ అంబానీలకు అభినందనలు. కుటుంబంలో కొత్త సభ్యుడికి స్వాగతం పలుకుతున్న ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, మొత్తం అంబానీ కుటుంబానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఇది వారి కుటుంబంలో ఆనందకరమైన రోజు. ఆ పసిబిడ్డకు నా దీవెనలు.’ అని పరిమళ్ నత్వానీ కామెంట్ చేశారు.

‘నీతా అంబానీ, ముఖేష్ అంబానీ తొలిసారి నానమ్మ, తాతయ్య అయ్యారు. ధీరూబాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీల మునిమనవడికి వారు స్వాగతం పలుకుతున్నారు. శ్లోక, ఆకాష్ అంబానీలకు ఈరోజు (డిసెంబర్ 10) న మగశిశువు జన్మించాడు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. కొత్త సభ్యుడి రాక అంబానీ, మెహతా కుటుంబాల్లో అత్యంత ఆనందాన్ని నింపింది.’ అని అంబానీ కుటుంబం ఓ ప్రకటనలో తెలిపింది.

ఆకాష్ అంబానీ, శ్లోక మెహతా వివాహం 2019 మార్చి 9న జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త రస్సెల్ మెహతా, మోనా మెహతాల కుమార్తె శ్లోక, అపరకుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు ఆకాష్ అంబానీల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ప్రముఖులు విచ్చేశారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ లాంటి వారు పెళ్లికి హాజరయ్యారు. దేశ విదేశాల నుంచి రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

First published:

Tags: Akash Ambani, Mukesh Ambani

ఉత్తమ కథలు