MUKESH AMBANI TALKS OF LEADERSHIP TRANSITION AT RELIANCE WANTS TO ACCELERATE THE PROCESS MK
Reliance Family Day: రిలయన్స్ నాయకత్వ మార్పుపై ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యలు, భవిష్యత్ పై ఆశాభావం...
ముఖేష్ అంబానీ (File Photo)
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నాయకత్వం మార్పుపై వ్యాఖ్యలు చేశారు. ఎనర్జీ నుంచి రిటైల్ వరకూ విస్తరించిన వ్యాపార శ్రేణిని సీనియర్లతో కలిసి ముందుకు తీసుకెళ్లడంతో పాటు కొత్త తరానికి ఆ ఫలితాలను అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
Reliance Family Day:రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) నాయకత్వం మార్పుపై వ్యాఖ్యలు చేశారు. ఎనర్జీ నుంచి రిటైల్ వరకూ విస్తరించిన వ్యాపార శ్రేణిని సీనియర్లతో కలిసి ముందుకు తీసుకెళ్లడంతో పాటు కొత్త తరానికి ఆ ఫలితాలను అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంబానీ భవిష్యత్తు భాధ్యతల గురించి తొలిసారిగా ప్రస్తావించారు. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా పేరొందిన రిలయన్స్ సంస్థలో “అత్యంత ప్రభావవంతమైన నాయకత్వ మార్పు”కు శ్రీకారం పడనున్నట్లు సూచించారు. ముఖేష్ అంబానీ, నీతా దంపతులకు ముగ్గురు సంతానం ఉండగా, వారిలో ఆకాశ్, ఈశ కవలలు కాగా, అనంత్ అంబానీ తర్వాతి తరంగా ఎదిగి వస్తున్నారు.
రిలయన్స్ ఫ్యామిలీ డే సందర్భంగా ముఖేష్ పలు ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. రిలయన్స్ గ్రూప్ నిర్మాత అయినటువంటి ధీరూబాయి అంబానీ జయంతిని పురస్కరించుకొని రిలయన్స్ గ్రూప్ ప్రాశస్త్యాన్ని గుర్తుచేశారు. అతి త్వరలోనే రిలయన్స్ గ్రూప్ , దేశీయంగా ఎదిగి వచ్చిన బహుళ జాతీయ కంపెనీగా ప్రపంచంపై ముద్ర వేయనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ సెక్టార్ తో పాటు, టెలికాం బిజినెస్ లో అందుకోలేనంత ఎత్తుకు ఎదగనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
గొప్ప కలలను సాకారం చేసుకునేందుకు, లక్ష్యంపై చూపుతో ముందుకు వెళ్లేందుకు సరైన వ్యక్తులు, సరైన నాయకత్వం అవసరం, రిలయన్స్ ప్రస్తుతం ఒక కీలక దశలో మార్పు దిశగా అడుగులు వేస్తోంది. నా తరానికి సంబంధించిన సీనియర్లతో పాటు, తర్వాతి తరం యువలీడర్ల వైపు ఈ మార్పు సాగుతుందని సూచించారు. అంతేకాదు ఈ ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు.
అందరు సీనియర్లు, నాతో సహా, పూర్తిగా పోటీతత్వంతో పాటు, అంకిత భావంతో పనిచేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం, అలాగే యువతరం సైతం సిద్ధమవుతోందని అంబానీ సూచించారు. వారిని గైడ్ చేయడంతోపాటు, శక్తివంతులను చేసే, వారి వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ, వారి విజయాలకు సాక్షులుగా నిలిచి జయ ధ్వానాలు చేస్తామని అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.
రిలయన్స్ సంస్థను నూతన స్థాయికి తీసుకెళ్లడంలో తర్వాతి తరం ప్రతినిధులు అయిన ఆకాశ్, ఈశా, అనంత్ శాయశక్తులు కృషి చస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. వారిలో ఒక చురుకుతో పాటు సామర్థ్యం కనిపించిందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.