భారతదేశంలో వ్యాపార దిగ్గజం అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట మరోసారి పెళ్లి సందడి కనిపించబోతోంది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీ (Anant Ambani), విరెన్ మర్చెంట్, శైల దంపతుల కూతురైన రాధికా మర్చంట్‌ను (Radhika Merchant) పెళ్లిచేసుకోబోతున్నారు. వీరిద్దరి రోకా వేడుక (నిశ్చితార్థం) రాజస్తాన్‌లోని నథ్‌ద్వారాలో శ్రీనాథ్‌జీ ఆలయంలో జరిగింది. ఈ వేడుకలో ముకేశ్ అంబానీ, విరెన్ మర్చెంట్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆలయ పూజారులు పాల్గొన్నారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ శ్రీనాథ్‌జీ దేవుడి ఆశీస్సులు కోరుతూ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయంలో సాంప్రదాయ వేడుకల్లో పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఈ సంతోషకరమైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోనున్నారు.
Bank Holidays: 2023లో తెలంగాణ , ఏపీలో బ్యాంకులకు 21 సెలవులు... హాలిడేస్ లిస్ట్ ఇదే
అనంత్, రాధిక కొన్నేళ్లుగా ఒకరికొకరు తెలుసు. త్వరలో వారి వివాహం తర్వాత అధికారిక ప్రయాణం ప్రారంభం అవుతుంది. అనంత్, రాధిక జంటను కుటుంబ సభ్యులు, బంధువులు ఆశీర్వదించారు. శుభాకాంక్షలు తెలిపారు.
Shirdi Tour: రూ.2400 ధరకే షిరిడీ టూర్ ... తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీ
అనంత్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పలు హోదాల్లో పనిచేశారు. జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రీటైల్ వెంచర్స్ బోర్డుల్లో సభ్యుడిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎనర్జీ బిజినెస్‌ను లీడ్ చేస్తున్నారు. రాధికా మర్చంట్ న్యూయార్క్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anant Ambani and Radhika Merchant Wedding, Mukesh Ambani, Nita Ambani, Radhika Merchant