హోమ్ /వార్తలు /బిజినెస్ /

Akash Ambani: టైమ్స్ 100 ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో ఆకాశ్ అంబానీ

Akash Ambani: టైమ్స్ 100 ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో ఆకాశ్ అంబానీ

Akash Ambani: టైమ్స్ 100 ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో ఆకాశ్ అంబానీ
(File Photo: Akash Ambani)

Akash Ambani: టైమ్స్ 100 ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో ఆకాశ్ అంబానీ (File Photo: Akash Ambani)

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీకి (Akash Ambani) టైమ్స్ 100 ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో చోటు దక్కింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తనయుడు, భారతదేశంలో అతిపెద్ద టెలికామ్ కంపెనీ అయిన జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీకి (Akash Ambani) అరుదైన టైమ్స్ 100 ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో చోటు దక్కింది. వాల్డ్ రైజింగ్ స్టార్స్ జాబితాను టైమ్100 నెక్స్‌ట్ (Time100 Next) పేరుతో విడుదల చేసింది టైమ్స్. ఈ జాబితాలో భారతదేశం నుంచి ఒకే ఒక్కరికి చోటు దక్కడం విశేషం. అయితే భారత సంతతికి చెందిన అమెరికన్ బిజినెస్ లీడర్ అమ్రాపాలీ గన్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. భారతీయ పారిశ్రామిక దిగ్గజ కుటుంబ వారసుడు, ఆకాశ్ అంబానీ వ్యాపారంలో ఎదగాలని నిరంతరం భావించేవారని, అతను చాలా కష్టపడుతున్నారని ఆకాశ్ అంబానీ గురించి టైమ్ వివరించింది.

రిలయన్స్ జియో ఛైర్మన్‌గా 30 ఏళ్ల ఆకాశ్ అంబానీ పదవీ బాధ్యతలు చేపట్టారు. భారతదేశంలో అతిపెద్ద టెలికామ్ కంపెనీ అయిన జియోకు 42.6 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అంతకన్నా ముందు 22 ఏళ్ల వయస్సులోనే బోర్డు మెంబర్‌గా బాధ్యతల్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అతను దిగ్గజ టెక్ కంపెనీలైన గూగుల్ , ఫేస్‌బుక్ నుంచి బిలియన్ డాలర్ల పెట్టుబడులను సేకరించడంలో కీలక పాత్ర పోషించారని టైమ్ వివరించింది.

Train Tickets: దసరా ట్రైన్‌లో టికెట్ కన్ఫామ్ అయిందా? వాట్సప్‌లో చెక్ చేయండిలా

జూన్ 27న రిలయన్స్ జియో డైరెక్టర్ పదవికి ముకేశ్ అంబానీ రాజీనామా చేశారు. అదే రోజున ముకేశ్ అంబానీ తనయుడు, నాన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా ఉన్న ఆకాశ్ అంబానీని ఛైర్మన్‌గా నియమిస్తూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదముద్రవేశారు. ఆకాష్ అంబానీ బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో మేజర్ పట్టభద్రుడయ్యారు. రిలయన్స్ గ్రూప్ డిజిటల్ సేవలు, వినియోగదారు రిటైల్ ప్రతిపాదనల ద్వారా రిలయన్స్ జియో సృష్టించిన అన్ని సంచలనాల్లో ఆకాశ్ భాగస్వామిగా ఉండటం విశేషం.

జియో 4జీ అభివృద్ధిలో అతని పాత్ర కూడా ఉంది. ఇప్పుడు జియో 5జీ లాంఛ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. 2017లో భారతదేశంలోని యూజర్ల కోసం జియోఫోన్ రూపొందించడంలో ఇంజనీర్ల బృందంతో కలిసి పనిచేశారు. లక్షలాది మంది యూజర్లు 2జీ నుంచి 4జీకి మారడానికి ఈ డివైజ్ ఉపయోగపడింది. ఇప్పుడు 500 మిలియన్లకు పైగా వినియోగదారులను చేరుకునే లక్ష్యానికి నాయకత్వం వహించనున్నారు.

Smartphone: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? జనవరి 1 నుంచి కొత్త రూల్

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్‌గా ఆకాశ్ ఎదుగుదల డిజిటల్ సేవల ప్రయాణానికి అతను చేసిన సహకారాన్ని గుర్తిస్తుంది. మరింత ముందుకు సాగడానికి అతన్ని ఉన్నత స్థాయి బాధ్యతలు అప్పగించినట్టవుతుంది. అతను గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ స్పేస్‌లో జియో చేసిన కీలకమైన కొనుగోళ్లకు వ్యక్తిగతంగా నాయకత్వం వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్‌ సహా కొత్త టెక్నాలజీ అభివృద్ధిలో ఆసక్తిగా పాల్గొన్నారు. 2020లో టెక్ దిగ్గజాలు, ఇతర ఇన్వెస్టర్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించడంలో ఆకాశ్ పాత్ర కూడా ఉంది.

టైమ్100 నెక్స్‌ట్ జాబితాలో వ్యాపారం, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, రాజకీయం, ఆరోగ్యం, సైన్స్, యాక్టివిజం లాంటి రంగాల్లో రాణిస్తున్న 100 మంది ఎమర్జింగ్ లీడర్స్ ఉన్నారని టైమ్ తెలిపింది. ఈ లిస్ట్‌లో అమెరికాకు చెందిన సింగర్ SZA, నటి సిడ్నీ స్వీనీ, బాస్కెట్ బాల్ ప్లేయర్ జా మోరాంట్, స్పానిష్ టెన్నిస్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్, నటి, టీవీ పర్సనాలిటీ కేకే పాల్మర్, పర్యావరణ కార్యకర్త ఫర్వీజా ఫర్హాన్ పేర్లు ఉన్నాయి. భారత సంతతికి చెందిన అమెరికన్ బిజినెస్ లీడర్ అమ్రాపాలీ గన్ పేరు కూడా ఇందులో ఉంది. ఓన్లీ ఫ్యాన్స్ కంటెంట్ క్రియేటర్స్ సైట్‌కు సీఈఓగా ఆమె ఉన్నారు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Akash Ambani, Jio, Reliance Jio

ఉత్తమ కథలు