Home /News /business /

MUKESH AMBANI SAID THAT HE WAS A BIG BELIEVER IN BLOCKCHAIN TECHNOLOGY NS

Mukesh Ambani - Blockchain Technology: బ్లాక్‌చెయిన్‌పై నాకు నమ్మకం ఉంది.. మంచి సమాజం కోసం అవసరం: ముఖేష్ అంబానీ

Mukesh Ambani: డిజిటల్ సమాజానికి భారతదేశం గ్లోబల్ లీడర్‌గా మారుతుంది: ముకేష్ అంబానీ
(File Photo: Mukesh Ambani)

Mukesh Ambani: డిజిటల్ సమాజానికి భారతదేశం గ్లోబల్ లీడర్‌గా మారుతుంది: ముకేష్ అంబానీ (File Photo: Mukesh Ambani)

"నేను బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని నమ్ముతాను, ఇది క్రిప్టోకరెన్సీకి భిన్నంగా ఉంటుంది" అని అంబానీ అన్నారు. విశ్వాసం, సమానత్వం కలిగిన సొసైటీ కోసం బ్లాక్‌చెయిన్ చాలా ముఖ్యమైనదని కూడా ఆయన అన్నారు.

    బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై తనకు పూర్తి నమ్మకం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) అన్నారు. "నేను బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని నమ్ముతాను, ఇది క్రిప్టోకరెన్సీ(criptocurrency) కి భిన్నంగా ఉంటుంది" అని అంబానీ అన్నారు. విశ్వాసం, సమానత్వం కలిగిన సొసైటీ కోసం బ్లాక్‌చెయిన్ చాలా ముఖ్యమైనదని కూడా ఆయన అన్నారు. వర్చువల్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీకి చెందిన GIFT సిటీ ఇన్ఫినిటీ ఫోరమ్ (IFSCA)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ముఖేష్ అంబాయ్ బ్లాక్‌చెయిన్‌పై పై విధంగా వ్యాఖ్యానించారు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ.. క్రిప్టోకరెన్సీని నియంత్రించేందుకు ప్రభుత్వం బిల్లును రూపొందిస్తోందన్నారు. క్రిప్టోకరెన్సీ లేకుండా కూడా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ పనిచేస్తుందని నమ్ముతున్న వారిలో RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ కూడా ఉన్నారన్నారు. బ్లాక్‌చెయిన్‌ని ఉపయోగించడం వల్ల మునుపెన్నడూ లేనివిధంగా ఎలాంటి లావాదేవీలకైనా భద్రత, విశ్వసనీయత, ఆటోమేషన్ లభిస్తుందని అంబానీ వివరించారు. "దీనిని మా సప్లై చైన్ ను మెరుగుపరచడానికి కూడా ఉపయోగించవచ్చు." అని అంబానీ అన్నారు. తదుపరి స్థాయి ఫైనాన్స్ ఆవిష్కరణలకు ఇదొక మంచి అవకాశం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్లాక్‌చెయిన్‌ని ఉపయోగించి మంచి భద్రత, నమ్మకం, ఆటోమేషన్ మరియు సామర్థ్యాన్ని దాదాపు ఏ రకమైన లావాదేవీలకైనా అందించగలమని అంబానీ చెప్పారు.
    Mukesh Ambani: డిజిటల్ సమాజానికి భారతదేశం గ్లోబల్ లీడర్‌గా మారుతుంది: ముకేష్ అంబానీ

    నిజ సమయంలో క్రెడిట్ స్కోర్‌లను నిర్వహిస్తూనే లక్షలాది మంది వ్యాపారుల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి ఇది వినూత్న పరిష్కారాలను రూపొందించడంలో కూడా సహాయపడుతుందని అంబానీ అభిప్రాయపడ్డారు. రాబోయే 10 సంవత్సరాలలో ఇది జరుగుతుందని తాను భావిస్తున్నట్లు అంబానీ అన్నారు. గొప్ప ఆర్థిక వృద్ధికి ఇది ఒక ముందస్తు అవసరమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
    Reliance: గ్యాసిఫికేషన్ ఆస్తుల పునర్నిర్మాణంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ దృష్టి.. భవిష్యత్తు అవసరాల కోసం RIL కొత్త ప్రణాళికలు

    ఈ శతాబ్దంలో మొదటి రెండు దశాబ్దాలు కనెక్టివిటీ టెక్నాలజీ, కంప్యూటింగ్ టెక్నాలజీ, నెక్స్‌ట్ జనరేషన్ సిలికాన్ చిప్స్, అనేక సాంకేతికతల కలయిక గొప్ప మార్పులకు దారితీశాయి. అయితే ఇది 'మరింత నమ్మశక్యం కాని, మరింత ఉత్తేజకరమైన, మరింత ప్రయోజనకరమైన' పరివర్తనకు నాంది మాత్రమేనని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ (Mukesh Ambani) అన్నారు. డిసెంబర్ 3న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ, బ్లూమ్‌బర్గ్ ఆసియా ఇన్ఫినిటీ ఫోరమ్‌లో అవానా క్యాపిటల్ వ్యవస్థాపకురాలు, దేనా బ్యాంక్ మాజీ చైర్ అంజలీ బన్సల్‌తో మాట్లాడుతూ ముఖేష్ అంబానీ అనేక విషయాలు పంచుకున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Criptocurrency, Mukesh Ambani, Reliance, Reliance Industries

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు