హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance Jio: రిలయన్స్ జియోకు ముకేష్ అంబానీ రాజీనామా... ఛైర్మన్‌గా ఆకాశ్ అంబానీ

Reliance Jio: రిలయన్స్ జియోకు ముకేష్ అంబానీ రాజీనామా... ఛైర్మన్‌గా ఆకాశ్ అంబానీ

Reliance Jio: రిలయన్స్ జియోకు ముకేష్ అంబానీ రాజీనామా... ఛైర్మన్‌గా ఆకాశ్ అంబానీ
(File Photo: Reuters)

Reliance Jio: రిలయన్స్ జియోకు ముకేష్ అంబానీ రాజీనామా... ఛైర్మన్‌గా ఆకాశ్ అంబానీ (File Photo: Reuters)

Reliance Jio | రిలయన్స్ జియోలో నాయకత్వ మార్పు జరిగింది. డైరెక్టర్ పదవికి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) రాజీనామా చేశారు. ఆయన తనయుడు ఆకాశ్ అంబానీని ఛైర్మన్‌గా చేస్తూ బోర్డు ఆమోదముద్ర వేసింది.

రిలయన్స్ జియో డైరెక్టర్ పదవికి ముకేష్ అంబానీ (Mukesh Ambani) రాజీనామా చేశారు. ముకేష్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీని (Akash Ambani) ఛైర్మన్‌గా నియమించారు. ఈ వివరాలను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కంపెనీ సెక్రెటరీ జ్యోతి జైన్ సెక్యూరిటీ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (SEBI) వెల్లడించింది కంపెనీ. రిలయన్స్ జియో (Reliance Jio) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం జూన్ 27న జరిగింది. ఈ సమావేశంలో బోర్డు పలు నిర్ణయాలను తీసుకుంది. రిలయన్స్ జియో డైరెక్టర్‌గా ఉన్న ముకేశ్ అంబానీ తన పదవికి రాజీనామా చేశారు. జూన్ 27 పనివేళలు ముగిసేంతవరకు ఆయన ఈ పదవిలో ఉన్నారు. ఇక ముకేశ్ అంబానీ తనయుడు, నాన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీని ఛైర్మన్‌గా నియమించేందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదముద్రవేశారు.

Pension Scheme: నెలకు రూ.5,000 పొదుపు చేస్తే ప్రతీ నెలా రూ.1,00,000 పెన్షన్... స్కీమ్ వివరాలివే

రమీందర్ సింగ్ గుజ్రాల్, కేవీ చౌదరీలను కంపెనీ అడిషనల్ డైరెక్టర్‌గా నియమించారు. జూన్ 27 నుంచి ఐదేళ్లపాటు వీరు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. ఇందుకు షేర్‌హోల్డర్స్ ఆమోదం తెలపాల్సి ఉంది. పంకజ్ మోహన్ పవార్‌ను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. జూన్ 27 నుంచి అమలులోకి వచ్చింది. షేర్‌హోల్డర్స్ ఆమోదం తెలపాల్సి ఉంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌తో సహా అన్ని జియో డిజిటల్ సేవల బ్రాండ్‌లను కలిగి ఉన్న ఫ్లాగ్‌షిప్ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్ ఛైర్మన్‌గా ముకేష్ అంబానీ కొనసాగుతారు.

ఆకాష్ అంబానీ బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో మేజర్ పట్టభద్రుడయ్యారు. రిలయన్స్ గ్రూప్ డిజిటల్ సేవలు, వినియోగదారు రిటైల్ ప్రతిపాదనల ద్వారా రిలయన్స్ జియో సృష్టించిన అన్ని సంచలనాల్లో ఆకాశ్ భాగస్వామిగా ఉండటం విశేషం. జియో 4జీ అభివృద్ధిలో అతని పాత్ర కూడా ఉంది. 2017లో భారతదేశంలోని యూజర్ల కోసం జియోఫోన్ రూపొందించడంలో ఇంజనీర్ల బృందంతో కలిసి పనిచేశారు. లక్షలాది మంది యూజర్లు 2జీ నుంచి 4జీకి మారడానికి ఈ డివైజ్ ఉపయోగపడింది. ఇప్పుడు 500 మిలియన్లకు పైగా వినియోగదారులను చేరుకునే లక్ష్యానికి నాయకత్వం వహించనున్నారు.

New Rules: అలర్ట్... జూలై 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్‌గా ఆకాశ్ ఎదుగుదల డిజిటల్ సేవల ప్రయాణానికి అతను చేసిన సహకారాన్ని గుర్తిస్తుంది. మరింత ముందుకు సాగడానికి అతన్ని ఉన్నత స్థాయి బాధ్యతలు అప్పగించినట్టవుతుంది. అతను గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ స్పేస్‌లో జియో చేసిన కీలకమైన కొనుగోళ్లకు వ్యక్తిగతంగా నాయకత్వం వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్‌ సహా కొత్త టెక్నాలజీ అభివృద్ధిలో ఆసక్తిగా పాల్గొన్నారు. 2020లో టెక్ దిగ్గజాలు, ఇతర ఇన్వెస్టర్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించడంలో ఆకాశ్ పాత్ర కూడా ఉంది.

First published:

Tags: Akash Ambani, Mukesh Ambani, Reliance Jio

ఉత్తమ కథలు