హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mukesh Ambani | ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానానికి ముఖేష్ అంబానీ

Mukesh Ambani | ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానానికి ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకారు.

    రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కు నెట్టి నాలుగో స్థానానికి చేరుకున్నారు. ముఖేష్ అంబానీ సంపద రూ.6.04 లక్షల కోట్లుగా బ్లూంబర్గ్ అంచనా వేసింది. ఈ ఏడాదిలోనే ఆయన సంపద 22 బిలియన్ డాలర్లు వృద్ది చెందింది. అర్నాల్ట్ ఆస్తుల విలువ రూ.6.01 లక్షల కోట్లు. ఆయన ఐదో స్థానానికి పడిపోయారు. ముఖేష్ అంబానీ ఇటీవల ప్రపంచ కుబేరుల టాప్ 10 జాబితాలో చోటు సంపాదించిన దగ్గరి నుంచి వరుసగా ఒక్కో మెట్టూ ఎదుగుతూ ఉన్నారు. ఎలాన్ మస్క్, లారీ పేజ్, వారెన్ బఫెట్ లాంటి వారిని పక్కకు నెట్టి టాప్ 10 జాబితాలో పైకి దూసుకెళ్తున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బిజోన్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. ఆయన సంపద 187 బిలియన్ డాలర్లు. ఆ తర్వాత స్థానంలో బిల్ గేట్స్ ఉన్నారు. గేట్స్ సంపద 121 బిలియన్ డాలర్లు. ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ మూడో స్థానంలో ఉన్నారు. జుకర్ బర్గ్ సంపద 102 బిలియన్ డాలర్లు. 2020 జనవరి నుంచి ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ షేర్లు 145 శాతం వృద్ది చెందాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్ ఫాంలో ఫేస్ బుక్, గూగుల్ సహా పలు సంస్థలు సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిన తర్వాత ముఖేష్ అంబానీ సంపద క్రమక్రమంగా వృద్ది చెందుతోంది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Mukesh Ambani, Reliance Industries, Reliance Jio

    ఉత్తమ కథలు