హోమ్ /వార్తలు /బిజినెస్ /

Ambani on Modi's 2047 vision: భారతదేశం వృద్ధి, స్థిరత్వానికి మార్గం.. ప్రధాని మోదీ 2047 విజన్‌పై ముఖేష్ అంబానీ

Ambani on Modi's 2047 vision: భారతదేశం వృద్ధి, స్థిరత్వానికి మార్గం.. ప్రధాని మోదీ 2047 విజన్‌పై ముఖేష్ అంబానీ

భారతదేశం వృద్ధి, స్థిరత్వానికి మార్గం.. ప్రధాని మోదీ 2047 విజన్‌పై ముఖేష్ అంబానీ

భారతదేశం వృద్ధి, స్థిరత్వానికి మార్గం.. ప్రధాని మోదీ 2047 విజన్‌పై ముఖేష్ అంబానీ

Ambani on Modi's 2047 vision: దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) యాన్యువల్ జనరల్ మీటింగ్ సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్‌పర్సన్ ముఖేష్ అంబానీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) యాన్యువల్ జనరల్ మీటింగ్(Annual General Meeting)ను ఆగస్టు 29 సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్‌పర్సన్ ముఖేష్ అంబానీ(Reliance Industries Chairperson Mukesh Ambani) మాట్లాడుతూ.. గ్లోబల్ అన్‌ప్రెడిక్టబిలిటీ(Global Unpredictability) మధ్య భారతదేశాన్ని ‘వృద్ధి, స్థిరత్వానికి మార్గం’గా అభివర్ణించారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల గురించి అంబానీ వివరించారు. కొవిడ్‌ కాలంలో కేంద్రం తీసుకున్న చర్యలను అభినందించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పిలుపు నిచ్చిన పంచ ప్రాణ మంత్రం(పంచ్‌-ప్రాణ్‌) ఆవశ్యకతను వివరించారు. రాబోయే 25 ఏళ్ల కాలం భారత్‌ అభివృద్ధికి కీలకమని అంబానీ పేర్కొన్నారు.


* మోదీ ‘పంచ్‌-ప్రాణ్‌’(panch-pran) గురించి ప్రస్తావించిన అంబానీ
ముఖేష్ అంబానీ తన ప్రసంగంలో.. 2022 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పిన ‘పంచ్‌-ప్రాణ్‌’ లేదా భారత దేశ అభివృద్ధికి అవసరమైన ఐదు సూత్రాలు ప్రస్తావించారు. ఆ ప్రతిజ్ఞలు భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపడంలో కీలకంగా పని చేస్తాయని అన్నారు. బానిసత్వ మనస్తత్వాన్ని విస్మరించేలా చేస్తాయని చెప్పారు.


మన వారసత్వం గురించి గర్వించేలా చేస్తాయని, దేశం పట్ల ఐక్యత, కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయని పేర్కొన్నారు. 2047 నాటికి ‘పంచ్‌ ‌ప్రాణ్‌’ తప్పకుండా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తుందని అంబానీ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 25 ఏళ్లు భారతదేశ చరిత్రలో అత్యంత పరివర్తన చెందే కాలంగా ఆయన తెలిపారు. స్వాతంత్య్రానంతర తరాలు ఇప్పటి వరకు సమిష్టిగా సాధించిన అన్నింటి కంటే తదుపరి తరం భారతీయులు ఎక్కువ సాధించబోతున్నారని తెలిపారు.


* ఆర్థిక ఒత్తిడిలో ప్రపంచ దేశాలు

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయో పారిశ్రామికవేత్త వివరించారు. ప్రపంచం COVID-19ని దాదాపుగా అధిగమించిందని, అయితే ‘పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు’ మళ్లీ అనిశ్చితిని సృష్టించాయని ఆయన అన్నారు. దీంతో కొవిడ్‌ కోరల నుంచి బయటపడిన ప్రపంచ దేశాలకు మళ్లీ సవాళ్లు తప్పలేదని పేర్కొన్నారు.


ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఉందని వివరించారు. పెరుగుతున్న ఇంధనం, ఆహారం, ఎరువుల ధరలు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. అధిక ద్రవ్యోల్బణం, సరఫరా అంతరాయాలు ప్రపంచ మాంద్యాన్ని ప్రేరేపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న అస్థిరత మధ్య భారతదేశం ‘అభివృద్ధి, స్థిరత్వానికి మార్గం’ అని అంబానీ తెలిపారు.


* రిలయన్స్‌ భారతదేశ పురోగతికి దోహదపడుతుంది

మహమ్మారి కట్టడికి కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుందని, తదుపరి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో ఆచరణాత్మక విధానం భారతదేశానికి సహాయపడిందని అంబానీ అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశ పురోగతికి మరింత దోహదపడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Mukesh Ambani, PM Narendra Modi, Reliance Industries

ఉత్తమ కథలు