MUKESH AMBANI NOW RICHER THAN ELON MUSK GOOGLE FOUNDERS MK
RIL: ముఖేష్ అంబానీ మరో ఘనత...టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ సైతం వెనక్కే...
ముఖేశ్ అంబానీ
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) చైర్మన్ నికర విలువ 72.4 బిలియన్ డాలర్లు. ఎలాన్ మాస్క్ నికర విలువ 68.6 బిలియన్ డాలర్లు కాగా, లారీ పేజ్ సంపద ప్రస్తుతం 71.6 బిలియన్ డాలర్లు కాగా, బ్రిన్స్ సంపద 69.4 బిలియన్ డాలర్లుగా ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ మరో ఘనత సాధించారు. ప్రస్తుతం ఆయన సంపద ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా సీఈవో ఎలోన్ మస్క్, అలాగే గూగుల్ సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్ మరియు లారీ పేజ్ నికర విలువను దాటేసింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) చైర్మన్ నికర విలువ 72.4 బిలియన్ డాలర్లు. ఎలాన్ మాస్క్ నికర విలువ 68.6 బిలియన్ డాలర్లు కాగా, లారీ పేజ్ సంపద ప్రస్తుతం 71.6 బిలియన్ డాలర్లు కాగా, బ్రిన్స్ సంపద 69.4 బిలియన్ డాలర్లుగా ఉంది.
టెలికాం యూనిట్ జియో ప్లాట్‌ఫామ్‌లకు ఫేస్బుక్, కెకెఆర్, ఇంటెల్ సహా పలువురు ప్రపంచ పెట్టుబడిదారుల నుండి నిధులు వచ్చిన తరువాత మార్చి నుండి ఆర్ఐఎల్ షేర్ విపరీతంగా ధర పెరిగింది.
జూన్ 19 న, రైట్స్ ఇష్యూ ద్వారా జియో ప్లాట్ఫామ్లో పెట్టుబడులు వరద కొనసాగింది. అయితే 2021 మార్చి 31 నాటికి రిలయన్స్ గ్రూపు రుణ రహిత కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ నిర్ణీత తేదీ కంటే ముందే కంపెనీ నికర రుణ రహిత సంస్థగా మారి భారత కార్పోరేట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి తలుపులు తెరిచింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అంబానీ సంపద ఇటీవల ప్రఖ్యాత పెట్టుబడిదారు వారెన్ బఫ్ఫెట్ ను సైతం అధిగమించడం విశేషం.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.