హోమ్ /వార్తలు /బిజినెస్ /

సీఎం జగన్‌‌తో ముఖేష్ అంబానీ భేటీ...

సీఎం జగన్‌‌తో ముఖేష్ అంబానీ భేటీ...

అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో వైఎస్ జగన్, ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ

అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో వైఎస్ జగన్, ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సమావేశం అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్‌ను కలిశారు. ముఖేష్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ సంస్థ భవిష్యత్తులో పెట్టాలనుకుంటున్న పెట్టుబడులకు సంబంధించి వారిమధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ముఖేష్ అంబానీ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీని, అనంత్ అంబానీని సీఎం జగన్ ఘనంగా స్వాగతం పలికారు. వారిద్దరినీ శాలువాలతో సత్కరించారు. జ్ఞాపికలను అందజేశారు.


రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి జ్ఞాపికను బహూకరిస్తున్న సీఎం వైఎస్ జగన్

అంతకు ముందు గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మరికొందరు నేతలు ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీకి స్వాగతం పలికారు. ముఖేష్, అనంత్ అంబానీలకు శాలువాలు కప్పిన విజయసాయిరెడ్డి జ్ఞాపికను బహూకరించారు.

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి జ్ఞాపికను బహూకరిస్తున్న సీఎం వైఎస్ జగన్

క్యాంప్ ఆఫీసులో జగన్‌తో కొద్దిసేపు చర్చించిన తర్వాత ముఖేష్ అంబానీ తిరుగు ప్రయాణమయ్యారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Mukesh Ambani, Reliance Industries, Reliance Jio

ఉత్తమ కథలు