హోమ్ /వార్తలు /బిజినెస్ /

RIL Q1 FY22 Results: భారీగా పెరిగిన రిలయన్స్ ఆదాయం.. ఆర్ఐఎల్ లాభం రూ.12,273 కోట్లు

RIL Q1 FY22 Results: భారీగా పెరిగిన రిలయన్స్ ఆదాయం.. ఆర్ఐఎల్ లాభం రూ.12,273 కోట్లు

ముఖేష్ అంబానీ, రిలయన్స్ అధినేత

ముఖేష్ అంబానీ, రిలయన్స్ అధినేత

ముకేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జూన్ 30తో ముగిసిన ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.12,273 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.13,233 కోట్లతో పోల్చితే లాభం ఏడు శాతం తగ్గింది. అయితే.. కన్సాలిడేటెడ్ ఆదాయం మాత్రం రూ.91,238 కోట్ల నుంచి రూ.1,44,372 కోట్లకు పెరిగింది.

ఇంకా చదవండి ...

ముంబై: ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జూన్ 30తో ముగిసిన ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.12,273 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.13,233 కోట్లతో పోల్చితే లాభం ఏడు శాతం తగ్గింది. అయితే.. కన్సాలిడేటెడ్ ఆదాయం మాత్రం రూ.91,238 కోట్ల నుంచి రూ.1,44,372 కోట్లకు పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిటైర్ వ్యాపార విభాగంలో ఏర్పడిన అవాంతరాలే లాభం తగ్గడానికి కారణమని రిలయన్స్ తెలిపింది. అయితే.. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ చెప్పుకోదగ్గ వృద్ధిని కనబర్చాయి. రిటైల్ నికర లాభం రెట్టింపు కాగా.. టెలికాం లాభం 45 శాతం వృద్ధి సాధించింది. ఇక.. రిలయన్స్ ఆదాయం ఏడాది క్రితం రూ.91,238 కోట్లతో పోలిస్తే.. చమురు, టెలికాం సమ్మేళన సంస్థ కార్యకలాపాల నుంచి ఆదాయం 58.2 శాతం పెరిగి రూ.1.44 లక్షల కోట్లకు చేరుకుంది. రిలయన్స్ టెలికాం విభాగం.. జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం ఏకంగా 45 శాతం పెరిగి రూ.3651 కోట్లకు చేరింది.

రిలయన్స్ సాధించిన వృద్ధిపై ఆర్‌ఐల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా గడ్డు పరిస్థితులు, సవాళ్లతో కూడిన వాతావరణం నెలకొని ఉన్నప్పటికీ కంపెనీ లాభాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్ నేపథ్యంలో విధించిన ఆంక్షలు కూడా ఈ త్రైమాసికంలో రిలయన్స్ రిటైర్ బిజినెస్ కార్యకలాపాలపై ప్రభావం చూపాయని ఆయన వివరించారు.

రిలయన్స్ జియో లాభం గురించి ఒక్కసారి పరిశీలిస్తే.. ఒక్కో వినియోగదారునిపై రూ.138.4 ఆదాయం నమోదైంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఉద్యోగులు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోంలో ఉండటం, విద్యార్థుల ఆన్‌లైన్ క్లాసులు.. ఇలా పలు కారణాల వల్ల డేటా వినియోగం విపరీతంగా పెరిగింది. ఇక.. రిటైల్ విషయానికొస్తే.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా రిటైల్ వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడినప్పటికీ ఆ నష్టాలను డిజిటల్ కామర్స్ విభాగం ద్వారా పూడ్చుకునే అవకాశం దొరికిందని రిలయన్స్ పేర్కొంది.

First published:

Tags: BUSINESS NEWS, Jio, Mukesh Ambani, Reliance, RIL

ఉత్తమ కథలు