Home /News /business /

Reliance | రిలయన్స్ మరో ఘనత... వరల్డ్ టాప్ 50 కంపెనీల్లో చోటు..

Reliance | రిలయన్స్ మరో ఘనత... వరల్డ్ టాప్ 50 కంపెనీల్లో చోటు..

ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ

Mukesh Ambani | ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను సాధించింది.

    ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను సాధించింది. ప్రపంచంలో అత్యంత విలువైన టాప్ 50 కంపెనీల్లో స్థానం సంపాదించింది. స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం... రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ స్థానాన్ని దక్కించుకుంది. సౌదీ ఆరామ్కో ప్రపంచంలో అతి పెద్ద ‘మార్కెట్ క్యాప్’ ఉన్న సంస్థ. ఆ సంస్థ మార్కెట్ క్యాప్ 1.7 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. ఆ తర్వాత స్థానాల్లో ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ గురువారం నాడు బీఎస్ఈలో రూ.2060.65 వద్ద ముగిసింది. అంతకుముందు రోజు క్లోజింగ్ డేటాతో పోలిస్తే అది 2.82 శాతం పెరిగింది. ప్రస్తుతం రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.13 లక్షల కోట్లు. తాజాగా జారీ చేసిన రైట్స్ ఇష్యూతో కూడా కలుపుకొంటే రూ.13.5 లక్షల కోట్ల మార్కెట్ విలువను కలిగి ఉంది. భారత్‌కు చెందిన ఏ కంపెనీ కూడా రూ.13 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ దాటలేదు. ఒరాకిల్, యూనీలీవర్, బ్యాంక్ ఆఫ్ చైనా, బీహెచ్‌పీ గ్రూప్, రాయల్ డచ్ షెల్, సాఫ్ట్ బ్యాంక్‌ల కంటే కూడా రిలయన్స్ మార్కెట్ క్యాప్ ఎక్కువ. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆసియాలో అతిపెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల జాబితాలో 10వ స్థానంలో ఉంది. చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ గ్లోబల్ మార్కెట్ క్యాప్‌లో ఏడో స్థానంలో ఉంది. ఇక అత్యంత విలువైన టాప్ 100 జాబితాలో భారత్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ గ్రూప్ మాత్రమే చోటు సాధించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Mukesh Ambani, Reliance Industries

    తదుపరి వార్తలు