MUKESH AMBANI GAUTAM ADANI NOW RICHER THAN MARK ZUCKERBERG PVN
Ambani, Adani : మెటా ఎఫెక్ట్..జూకర్ బర్గ్ కన్నా అంబానీ,అదానీనే రిచ్
రిలయన్ అధినేత ముఖేష్ అంబానీ(ఫైల్ ఫొటో)
Ambani, Adani Richer Than Zuckerberg : ప్రపంచ కుబేరుల జాబితాలో నిన్నటి వరకు టాప్-10లో ఉన్న మార్క్‌జుకర్‌బర్గ్ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆయన అస్తుల విలువ భారత కుబేరులు ముకేష్ అంబానీ(Mukesh Ambani), గౌతమ్ అదానీ(Gautam Adani) కంటే తక్కువగా నమోదైంది.
Ambani, Adani Richer Than Zuckerberg : ప్రపంచ కుబేరుల జాబితాలో నిన్నటి వరకు టాప్-10లో ఉన్న మార్క్‌జుకర్‌బర్గ్ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ Meta Platforms Inc క్యూ 3లో నిరుత్సాహకరమైన ఆదాయాలను నమోదుచేయడంతో గురువారం మెటా షేర్లు కార్డు స్థాయిలో 26శాతం పతనమయ్యాయి. దీంతో మెటా కంపెనీ 200 బిలియన్ డాలర్ల నష్టం రాగా, ఇందులో 12.8శాతం వాటా కలిగిన జుకర్ బర్గ్(Mark Zuckerberg) కు 29 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. అంటే ఒక్కరోజులోనే 29 బిలియన్ డాలర్ల జుకర్ బర్గ్ సంపద ఆవిరైంది. చరిత్రలో నమోదైన అత్యంత భారీ నష్టాల్లో ఇది రెండోది కావడం గమనార్హం. గతేడాది నవంబర్ లో టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఒక్కరోజులోన 35 బిలియన్ డాలర్లను కోల్పోయిన విషయం తెలిసిందే.
టిక్‌టాక్, యూట్యూబ్ వంటి ప్రత్యర్థుల నుంచి ఫేస్బుక్ భారీ పోటీ ఎదుర్కొంది. ఫేస్బుక్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యూజర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇదే మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కొంపముంచింది. దాంతో పాటుగా ప్రైవసీ మార్పులపై తీసుకున్న యాపిల్ నిర్ణయాలు మెటా షేర్లు పడిపోవడానికి కారణాలుగా ఉన్నాయి.
ఇక,మెటా షేర్లు భారీగా పతనమవ్వడంతో జుకర్ బర్గ్ నికర ఆస్తుల విలువ కూడా భారీగా తగ్గిపోయింది. ఫోర్బ్స్ ప్రకారం..మెటా సీఈవో జుకర్ బర్గ్ నికర విలువ 85 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. సంపద భారీగా తగ్గడం వల్ల జుకర్ బర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో 12వ స్థానానికి పడిపోయారు. ఫలితంగా ఆయన అస్తుల విలువ భారత కుబేరులు ముకేష్ అంబానీ(Mukesh Ambani), గౌతమ్ అదానీ(Gautam Adani) కంటే తక్కువగా నమోదైంది. అంతర్జాతీయ కుబేరుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న అదానీ ఆస్తులు విలువ 90.1 బిలియన్ డాలర్లు కాగా.. 11వ స్థానంలో ఉన్న అంబానీ ఆస్తుల విలువ 90 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద మాత్రం మరో 20 బిలియన్ డాలర్లు పెరిగింది. అమెజాన్ భారీ లాభాలు ఆర్జించడం వల్ల ఇది సాధ్యమైంది.
ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో 232 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బెర్నార్డ్ అర్నాల్ట్ 193.6 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, జెఫ్ బెజోస్ 164.8 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.