Home /News /business /

MSME EODB RAILWAYS CUTS VENDOR APPLICATION FEE BY OVER 90 TO ATTRACT MSMES GH VB

Railway Business: రైల్వేల్లో వ్యాపారం చేయడం ఇక సులువు.. ఆ ఫీజును భారీగా తగ్గించిన సంస్థ..!

ప్రతీకాత్మక చిత్రం (Image:Pexels)

ప్రతీకాత్మక చిత్రం (Image:Pexels)

MSME రంగంలో సులభతర వ్యాపారాలను ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే వెండర్స్ టెండర్ల దరఖాస్తు ఫీజును 90 శాతానికి పైగా తగ్గించింది. వీటి విషయంలో తక్కువ రుసుముతో కూడిన ప్రత్యేక సదుపాయాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇంకా చదవండి ...
రైల్వేల పరిధిలో సులభతర వ్యాపార మార్గాలను అన్వేషిస్తోంది యాజమాన్యం. ఈ మేరకు రైల్వేల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను(ఎంఎస్​ఎంఈ) ప్రోత్సహించేందుకు సంస్కరణల బాట పట్టింది. MSME రంగంలో సులభతర వ్యాపారాలను ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే వెండర్స్(Railway Venders) టెండర్ల దరఖాస్తు ఫీజును(Application Fee) 90 శాతానికి పైగా తగ్గించింది. వీటి విషయంలో తక్కువ రుసుముతో కూడిన ప్రత్యేక సదుపాయాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిర్ణయంతో ఎంఎస్​ఎంఈ(MSME) పరిశ్రమలో వ్యాపార వ్యయం తగ్గుతుందని, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని పేర్కొంది. అంతేగాక సప్లయి చైన్​లో మరింత మంది విక్రేతలను ఆకర్షించడం ద్వారా రైల్వేలకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడింది.

SBI: ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్​న్యూస్​.. ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు.. తాజా రేట్లను పరిశీలించండి..


లైసెన్సుల ఆమోదం కోసం MSMEల నుంచి రైల్వేస్ రీసెర్చ్, డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్​కి (RDSO) విక్రయదారులు దరఖాస్తు చేసుకునే వారు. వీరి నుంచి 1.5 లక్షల రూపాయల వరకు వసూలు చేసేవారు. ప్రస్తుత నిర్ణయంతో నిర్దిష్ట ప్రమాణాలతో పనులు చేపట్టే సంస్థల దరఖాస్తు ఫీజులో 93 శాతం తగ్గించినట్లైందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. MSMEలు కాకుండా ఇతర చిన్న వ్యాపారులకు సైతం లైసెన్స్​ ఫీజును తగ్గించింది రైల్వే. వీరికి 94 శాతం అంటే 2.5 లక్షల రూపాయల నుంచి 15 వేల రూపాయలకు తగ్గించినట్లు పేర్కొంది. రైల్వేల పరిధిలో వ్యాపారాలను సులభతరం చేసే దిశగా తీసుకున్న నిర్ణయంతో అభివృద్ధి పనులతో పాటు.. వ్యాపారులు, ఇతర కార్మికులకు ఉపాధి మార్గాలు వేగవంతమవుతాయని స్పష్టం చేసింది.

Union Budget: ఈ బడ్జెట్​లో వర్క్​ ఫ్రం హోం చేసేవారికి గుడ్​న్యూస్? పన్ను మినహాయింపులు ఉండే ఛాన్స్?


బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌(BIS) 2021, జూన్ 1న 'వన్ నేషన్-వన్ స్టాండర్డ్' మిషన్ కింద.. రీసెర్చ్, డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్​(RDSO) రైల్వేస్​ను స్టాండర్డ్ డెవలపింగ్ ఆర్గనైజేషన్​గా(SDO) ప్రకటించింది. ఈ నిర్ణయం అనంతరం దాదాపు ఎనిమిది నెలల తర్వాత రుసుములు తగ్గడం విశేషం.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌(BIS), స్టాండర్డ్ డెవలపింగ్ ఆర్గనైజేషన్​(SDO) కింద భారతీయ రైల్వేకు లభించిన గుర్తింపుతో పలు ప్రయోజనాలు ఉండనున్నాయి. సప్లయి చైన్​లోని పరిశ్రమలోని విక్రేతలు, MSMEలు, టెక్నాలజీ డెవలపర్‌లకు ప్రధాన భాగస్వామ్యం ఉంటుందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే విద్యాసంస్థలు, గుర్తింపు పొందిన ల్యాబ్‌లు, టెస్ట్ హౌస్‌లకు ప్రయోజనం చేకూరనుంది.

త్వరలోనే టాటా నుంచి బ్లాక్​బర్డ్​ మిడ్​ రేంజ్ ఎస్​యూవీ లాంచ్​.. సీఎన్​జీ, ఎలక్ట్రిక్​ వేరియంట్లలోనూ లభ్యం

భారతీయ రైల్వే.. వన్ నేషన్-వన్ స్టాండర్డ్ విజన్ కోసం SDO గుర్తింపు కోసం BIS ఒక పథకాన్ని ప్రారంభించింది. నిర్దిష్ట రంగాల్లో ప్రమాణాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న BIS ఆయా సంస్థల నైపుణ్యాన్ని సమగ్రపరచడం ద్వారా దేశంలోని ప్రామాణిక అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

విక్రేతల దరఖాస్తులను త్వరితగతిన ఆమోదించేందుకు ఏకీకృత వెండర్ అప్రూవల్ సిస్టమ్‌ను సైతం అమలు చేస్తున్నట్లు రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. అప్లికేషన్​కు సంబంధించిన వివరాలతో సహా.. ఆన్‌లైన్ అప్లికేషన్​ను ట్రాక్ చేసేందుకు ఆన్‌లైన్ యాక్సెస్‌ను ఉచితంగా అందించనుంది.
Published by:Veera Babu
First published:

Tags: India Railways, Msme

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు