భూకంపాలను తట్టుకునే స్టీల్‌ విడుదల చేసిన MSAF..ఏపీలో కొత్తగా తయారీ ప్లాంటు

స్టీల్‌ తయారీ రంగంలో ఉన్న ఎంఎస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ (MS Agarwal Foundries).. ఎంఎస్‌ లైఫ్‌ 600 ప్లస్‌ పేరుతో భూకంపాలను తట్టుకునే టీఎంటీ బార్స్‌ను ఆవిష్కరించింది.

news18-telugu
Updated: November 7, 2020, 1:00 PM IST
భూకంపాలను తట్టుకునే స్టీల్‌ విడుదల చేసిన MSAF..ఏపీలో కొత్తగా తయారీ ప్లాంటు
కంపెనీ డైరెక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌
  • Share this:
స్టీల్‌ తయారీ రంగంలో ఉన్న ఎంఎస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ (MS Agarwal Foundries).. ఎంఎస్‌ లైఫ్‌ 600 ప్లస్‌ పేరుతో భూకంపాలను తట్టుకునే టీఎంటీ బార్స్‌ను ఆవిష్కరించింది. ఇటువంటి ఉత్పాదన దేశంలో తొలిసారి అని కంపెనీ డైరెక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ మీడియాకు వెల్లడించారు. అత్యంత నాణ్యమైన రసాయనాలు, మిశ్రమాలను వినియోగించామన్నారు.  హైదరాబాద్‌ సమీపంలోని తూప్రాన్‌ వద్ద ఉన్న ప్లాంటులో వీటిని తయారు చేస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్‌ లైఫ్‌ 600, ఏఎఫ్‌ స్టార్‌ 500–డి పేరుతో స్టీల్‌ ఉత్పత్తులను దక్షిణాదిన 750 చానెల్‌ పార్ట్‌నర్స్‌ ద్వారా కంపెనీ విక్రయిస్తోంది. గంగవరం, కృష్ణపట్నం పోర్టు, హైదరాబాద్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు కంపెనీ స్టీల్‌ను సరఫరా చేసింది.

ఏపీలో 1,200 కోట్లతో...

కంపెనీ కొత్తగా అత్యాధునిక స్టీల్‌ ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద ఏర్పాటు చేస్తోంది. ఇందుకు రూ.1,200 కోట్లు పెట్టుబడి చేస్తోంది. ఈ కేంద్రం ద్వారా 1,800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్లాంటు రెడీ అవుతుందని కంపెనీ డైరెక్టర్‌ గౌతమ్‌ గనెరివాల్‌ తెలిపారు. ప్రస్తుతం సంస్థలో 8,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. గ్రూప్‌ టర్నోవర్‌ రూ.2,100 కోట్లు. సంస్థకు తెలంగాణ, ఏపీలో ఇప్పటికే మూడు ప్లాంట్లు ఉన్నాయి. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులు. కొత్త ప్లాంటు తోడైతే సామర్థ్యం 2.5 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరనుంది.
Published by: Krishna Adithya
First published: November 7, 2020, 1:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading