కరోనా మహమ్మారి(Corona Wave) తర్వాత ప్రపంచం ఎంతో మారింది. వివిధ రకాల వ్యాపార, వాణిజ్య రంగాల్లో కొత్త మార్పులు వచ్చాయి. ఇన్సూరెన్స్ పాలసీల ప్రాధాన్యం గురించి కోవిడ్ విజృంభణ తర్వాతే అవగాహన పెరిగింది. అయితే మోటార్ ఇన్సూరెన్స్(Motor Insurance) పాలసీలు కూడా కరోనా తర్వాత చాలా వరకు మారాయి. ముఖ్యంగా కోవిడ్ టైమ్‌లో చాలామంది కొన్ని నెలల పాటు తమ వాహనాలను బయటకు తీయలేదు. దీంతో వాహనాల వినియోగానికి తగ్గట్లే కవరేజీ పొందే మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలను(Motor Insurance Policy) ప్రవేశపెట్టింది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI). ఈ క్రమంలో పే-యాజ్-యు-డ్రైవ్, పే-హౌ-యు-డ్రైవ్, ఫ్యామిలీ ఫ్లోటర్ వంటి యాడ్ ఆన్‌లకు డిమాండ్ పెరిగింది.
ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించిన పే-యాజ్-యు-డ్రైవ్ యాడ్ ఆన్ పాలసీ ఎంతో పాపులర్ అయింది. ఇలాంటి యాడ్ ఆన్స్‌తో పాలసీదారులు తమ వాహనం వినియోగానికి అనుగుణంగా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించే ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా ప్రీమియం మొత్తాన్ని చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. మారుతున్న ప్రజల డ్రైవింగ్ అలవాట్లను పరిగణనలోకి తీసుకున్న IRDAI, ఇలాంటి వినూత్న ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేస్తోంది.
పే-హౌ-యు-డ్రైవ్ ఫీచర్‌తో బెనిఫిట్స్
పే-హౌ-యు-డ్రైవ్ (Pay-how-you-drive) అనే యాడ్ ఆన్ విషయంలో.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, స్పీడ్ లిమిట్ దాటడం, ఇతర రిస్క్‌లను పరిగణనలోకి తీసుకుంటారు. పాలసీదారుల డ్రైవింగ్ అలవాట్లను విశ్లేషించడానికి ట్రాకింగ్ డివైజ్, అల్గారిథమ్‌లను ఉపయోగిస్తారు. దీని ద్వారా సురక్షితమైన డ్రైవింగ్ చేసే వారికి తక్కువ ప్రీమియంతో రివార్డ్ ఇస్తారు. ఈ వినూత్న యాడ్ ఆన్ వాహన యజమానుల్లో మంచి డ్రైవింగ్ అలవాట్లను పెంపొందించడంతో పాటు ప్రీమియం భారాన్ని ఆదా చేస్తుంది.
* తగ్గుతున్న ప్రీమియం భారం
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రిమోర్ట్ వర్కింగ్ కల్చర్ పెరిగింది. దీంతో ఉద్యోగులు రోడ్లపైకి తీసుకెళ్లే వ్యక్తిగత వాహనాలు ఇళ్లకే పరిమితమయ్యాయి. ట్రాఫిక్ ఇబ్బందులతో ఇంకొంతమంది పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌పై ఆధారపడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో వాహనాలను యజమానులు పూర్తి సామర్థ్యంతో నడపరు. కానీ వాటికి సంబంధించిన మోటార్ ఇన్సూరెన్స్ పూర్తి ప్రీమియం చెల్లిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇలా కాకుండా, మీరు వాహనాన్ని రోడ్లపైకి తీసుకొచ్చే నిర్ణీత వ్యవధికే పాలసీ చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తోంది పే-యాస్-యు-డ్రైవ్ (Pay-as-you-drive) పాలసీ.
దీని ద్వారా పాలసీదారులు తమ డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ, ప్రాధాన్యత ప్రకారం ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. దీని కింద పాలసీదారుకు వివిధ ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీలు కిలోమీటర్ల ఆధారంగా ప్రీమియం చెల్లించే ఆప్షన్‌ను అందిస్తున్నాయి. మరికొన్ని పాలసీలు స్విచ్-ఆన్-స్విచ్-ఆఫ్ మెకానిజంతో వస్తాయి. కిలోమీటర్లను ట్రాక్ చేయడానికి ట్రాకింగ్ డివైజ్ లేదా మొబైల్ యాప్ వాడతారు. వాహనాన్ని నడపని రోజులలో బీమా పాలసీని స్విచ్ ఆఫ్ చేయవచ్చు. దీంతో పాలసీ హోల్డర్లు ఇన్సూరెన్స్ ప్రీమియంను చాలా వరకు ఆదా చేసుకోవచ్చు.
ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్
ఒకటి కంటే ఎక్కువ వాహనాలు ఉన్న కుటుంబాలకు మోటార్ ఇన్సూరెన్స్ అనేది ఖర్చుతో కూడుకున్న విషయం. ఈ సందర్భంలో ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలతో (Family floater plans) ఒక వ్యక్తి తమ కుటుంబానికి చెందిన అన్ని వాహనాలకు కవరేజీ తీసుకోవచ్చు. దీనితో బీమా ప్రీమియంను తగ్గించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Insurance, Irdai, Motor insurance, Motorcycle