Home /News /business /

MOTOR INSURANCE BENEFITS AND ADVANTAGES IN THE MONSOON UMG GH

Motor Insurance: ఈ వర్షాకాలంలో మోటార్ ఇన్సూరెన్స్ చేయించుకోండి.. మీకు భలే బెనిఫిట్స్..!

వర్షాకాలంలో మీ వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరి.

వర్షాకాలంలో మీ వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరి.

వర్షాకాలంలో (Mansoon) రహదారుల (Roads)పై గుంతలు పడి, నీరు నిలిచి, ముందు మార్గం సక్రమంగా కనిపించని పరిస్థితుల్లో ఎక్కువ ప్రమాదాలు (Accidents) జరుగుతాయి. దీంతో సమగ్ర బీమాను సెలక్ట్‌ చేసుకోవడం, యాడ్-ఆన్ రైడర్‌లను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా భద్రత పెరుగుతుంది.

ఇంకా చదవండి ...
భారతదేశంలో రుతుపవనాల (Monsoon) ప్రభావంతో వర్షాలు (Rains) కురుస్తున్నాయి. వర్షాకాలంలో ప్రజలు ట్రాఫిక్‌ జామ్‌లు, రోడ్లపై నీరు నిలిచిపోవడం, ముందు మార్గం సక్రమంగా కనిపించకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. వానాకాలంలో లాంగ్‌డ్రైవ్‌లు (Long Drive) ఎంజాయ్‌ చేయడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. అదే సమయంలో వాహనం భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచంలోని వాహనాల్లో భారతదేశంలో కేవలం 1 శాతం మాత్రమే ఉన్నా.. రోడ్డు ప్రమాదాలు మాత్రం ఎక్కువగా జరుగుతున్నట్లు ఇటీవల వరల్డ్‌ బ్యాంక్‌ ఓ నివేదికలో పేర్కొంది. వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది.

ప్రమాదాల నుంచి వాహన యజమానులను రక్షించడానికి, థర్డ్-పార్టీ మోటార్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేశారు. కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు ఒక సంవత్సరం సమగ్ర, మూడేళ్ల థర్డ్-పార్టీ పాలసీని తప్పని సరిగా యజమానులు చేయించాలి. రెండు, మూడో సంవత్సరాలలో, కస్టమర్ కేవలం స్టాండలోన్‌ ఓన్‌ డ్యామేజ్‌(SAOD) పాలసీని కొనుగోలు చేయాలి. కానీ ఇది పాక్షిక కవచాన్ని మాత్రమే అందిస్తుంది. వర్షాకాలంలో రహదారులపై గుంతలు పడి, నీరు నిలిచి, ముందు మార్గం సక్రమంగా కనిపించని పరిస్థితుల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. దీంతో సమగ్ర బీమాను సెలక్ట్‌ చేసుకోవడం, యాడ్-ఆన్ రైడర్‌లను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా భద్రత పెరుగుతుంది.

ఇదీ చదవండి: వాట్సాప్ సూపర్ అప్‌డేట్.. ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ టైమ్ లిమిట్‌ పెంపు.. ఎన్ని రోజులంటే..?


వర్షాకాలంలో మోటారు ఇన్సూరెన్స్‌ పాలసీలో భాగమైన కొన్ని యాడ్‌ ఆన్‌ రైడర్‌లు ఇవే..

* కన్‌స్యూమబుల్‌ కవర్‌ (Consumables Cover)
కారును కొనుగోలు చేసేటప్పుడు టైర్ మార్పులు, సాధారణ మెయింటెనెన్స్ వంటి కొన్ని ఖర్చుల గురించి ముందుగానే ఆలోచిస్తాం. అయితే కారు అనేది నాలుగు చక్రాల, దృఢమైన మెటల్ బాడీ సజావుగా నడపడానికి బోల్ట్‌లు, స్క్రూలు, కూలెంట్, లూబ్రికెంట్, గ్రీజు మొదలైన కన్‌స్యూమబుల్‌ వస్తువులు అవసరం అవుతాయి. అందువల్ల 60-నెలల పాత కారు కోసం సమగ్ర కార్ బీమా పాలసీకి కన్‌స్యూమబుల్‌ కవర్‌ రైడర్‌ను కొనుగోలు చేయడం ద్వారా.. వాటి మరమ్మతు సమయంలో ఈ భాగాలపై అయ్యే ఖర్చులకు రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.

* ఇంజిన్ ప్రొటెక్షన్‌ కవర్
నీటి సంబంధిత సమస్యలకు ఇంజిన్ ప్రొటెక్షన్‌ కవర్‌ తప్పనిసరి. ఈ యాడ్-ఆన్ ఫీచర్ వర్షాకాలంలో కారు యజమానికి చాలా విలువైనది. వాహనంలో ఇంజిన్ చాలా ముఖ్యమైన భాగం. దాని రక్షణ మరిచిపోకూడదు. ఇది వాహనం అత్యంత ఖరీదైన భాగం కూడా. ఒక ప్రామాణిక మోటారు ఇన్సూరెన్స్‌ పాలసీ ఇంజిన్ నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. నీరు చేరడం లేదా లూబ్రికెంట్ లీకేజీ వల్ల కలిగే నష్టాలు డిఫాల్ట్‌గా పాలసీలో కవర్ కావు. దీని కోసం, పాలసీలో ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్‌ని ఎంచుకోవాలి. వాటర్ ఇన్‌గ్రెషన్ లేదా గేర్‌బాక్స్ దెబ్బతినడం మొదలైన వాటి వల్ల ఇంజిన్‌కు కలిగే నష్టాలకు కవర్ చేస్తుంది. అలాగే, వాటర్‌లాగింగ్, సీపేజ్ కారణంగా హైడ్రోస్టాటిక్ లాక్ అనేది ఈ సమయంలో ఒక సాధారణ సమస్య, ఇది ఈ యాడ్-ఆన్ ద్వారా కవర్ అవుతుంది. ప్రత్యామ్నాయంగా, మోటారు ఇన్సూరెన్స్‌ పాలసీని ఎంచుకోవడానికి హైడ్రోస్టాటిక్ లాక్ కవర్ కూడా అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి: ఆకట్టుకునే ఫీచర్లతో అద్భుతమైన షావోమి ఫోన్లు..!


* నిల్ లేదా సున్నా డిప్రిసియేషన్‌ కవర్ (Nil Or Zero Depreciation Cover)
రోజులు గడిచేకొద్దీ కారు విలువ తగ్గిపోతుంది. కొనుగోలు చేసిన మరుసటి రోజు కూడా, కారు విలువ దాదాపు 5 శాతం తగ్గుతుంది. అందువల్ల, క్లెయిమ్‌ను దాఖలు చేసేటప్పుడు, ఇన్సూరెన్స్‌ సంస్థలు రీప్లేస్‌ చేసిన పార్ట్‌లకు తగ్గింపు విలువనే ప్రస్తుత విలువగా పరిగణించి పరిహారం చెల్లిస్తాయి. అయితే సాధారణంగా తెలిసిన ఈ బంపర్-టు-బంపర్ కవర్‌ను కొనుగోలు చేయడం ద్వారా, చక్రాలు, వాటి భాగాల తరుగుదల బాధ్యతను ఇన్సూరెన్స్‌ కంపెనీకి మళ్లించవచ్చు. ఇంకా జీరో డిప్రిసియేషన్ యాడ్-ఆన్ రైడర్ అన్ని వాహన భాగాలను 100 శాతం రక్షిస్తుంది. ట్యూబ్‌లు, బ్యాటరీలు, టైర్లును 50 శాతం కవర్ చేస్తుంది.* నో-క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్‌ కవర్
నో క్లెయిమ్ బోనస్ (NCB) అనేది వాహనంపై అదనపు జాగ్రత్తలు తీసుకున్నందుకు బీమా కంపెనీ ఇచ్చే రివార్డ్. పాలసీ టర్మ్ మొత్తం వ్యవధిలో ఒక్క క్లెయిమ్‌ను ఫైల్ చేయకపోవడం ద్వారా, పాలసీని రెన్యువల్‌ లేదా పోర్ట్ చేసేటప్పుడు బీమా కంపెనీ ఆకర్షణీయమైన డిస్కౌంట్ లేదా తక్కువ ప్రీమియంలను అందిస్తుంది. కానీ చిన్న క్లెయిమ్‌ వేసినప్పటికీ ఈ బోనస్ శూన్యం. కాబట్టి, NCB ప్రొటెక్షన్‌ కవర్‌ ఎంచుకోవడం ద్వారా, క్లెయిమ్ చేసినప్పటికీ NCB ప్రయోజనాన్ని అలాగే ఉంచుకోవచ్చు. ఐదు క్లెయిమ్ రహిత పాలసీ సంవత్సరాల వరకు ఒకరు 20-50 శాతం వరకు సంపాదించవచ్చు, కాబట్టి ఇది విలువైన యాడ్-ఆన్.

* టైర్ ప్రొటెక్షన్‌ కవర్
కారు చక్రాలపై నడుస్తుంది, కాబట్టి టైర్ ప్రొటెక్షన్‌లో ఎప్పుడూ రాజీపడకూడదు. టైర్ ప్రొటెక్షన్‌ చక్రాలను టైర్ పేలుళ్లు, కోతలు, రీఫిట్ చేయడానికి లేబర్ ఛార్జీలు మొదలైన వాటి నుంచి రక్షిస్తుంది. అలాగే, భారీ వర్షాల సమయంలో ట్రాక్షన్ తీవ్రంగా నష్టపోయినప్పుడు, ధృడమైన వీల్ బ్యాండ్‌ ఉండటం చాలా ముఖ్యం. అయితే, ఇది చిన్న పంక్చర్ మరమ్మతులు, తయారీ లోపాలు, రీబ్యాలెన్సింగ్, టైర్లను ఫిట్ చేయడాన్ని కవర్ చేయదు.
Published by:Mahesh
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు