Home /News /business /

Motorola G31: డిసెంబర్​ 6న భారత మార్కెట్​లోకి మోటో జీ31 స్మార్ట్​ఫోన్.. ఫ్లిప్​కార్ట్​ ద్వారా అమ్మకాలు​

Motorola G31: డిసెంబర్​ 6న భారత మార్కెట్​లోకి మోటో జీ31 స్మార్ట్​ఫోన్.. ఫ్లిప్​కార్ట్​ ద్వారా అమ్మకాలు​

(image: Motorola India)

(image: Motorola India)

మోటరోలా సంస్థ ఇటీవల వరుసగా స్మార్ట్​ఫోన్లను లాంచ్​ చేస్తూ దూకుడుమీదుంది. గత వారంలో మోటరోలా తన జీ సిరీస్​లో మోటో జీ 31ను లాంచ్​ చేసిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్ డిసెంబర్ 6న ఫ్లిప్​కార్ట్​ ద్వారా​ అమ్మకానికి రానుంది.

లెనోవో (Lenovo) యాజమాన్యంలోని మోటరోలా సంస్థ (Motorola company) ఇటీవల వరుసగా స్మార్ట్​ఫోన్లను లాంచ్​ చేస్తూ దూకుడుమీదుంది. గత వారంలో మోటరోలా తన జీ సిరీస్​లో మోటో జీ 31 (Moto G31)ను లాంచ్​ చేసిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్ (Smartphone) డిసెంబర్ 6న ఫ్లిప్​కార్ట్ (Flip cart)​ ద్వారా​ అమ్మకానికి రానుంది. ఇది రూ.12,999 ధర వద్ద లభిస్తుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్​ఫోన్​ ఇప్పటికే యూరోపియన్​ మార్కెట్​లోకి రిలీజైంది. అక్కడ మంచి రెస్పాన్స్​ రావడంతో.. భారత్​లోకి (India) దీన్ని ఇప్పుడు తీసుకొస్తోంది. మోటో G31 భారత బడ్జెట్ కేటగిరీలో ప్రస్తుతం లభిస్తున్న రియల్​మీ, షియోమి ఫోన్లకు గట్టిపోటీనివ్వనుంది. ఇది బ్లూ (Blue), బ్లాక్ (black).. మొత్తం రెండు కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది.

దీని లాంచింగ్ (launching)​ను ధ్రువీకరిస్తూ మోటరోలా ఇండియా (Motorola India) ట్వీట్ చేసింది. ‘‘మోటో జీ 31 డిస్​ప్లేపై ఉండే అత్యుత్తమ 50 ఎంపీ క్వాడ్ ఫంక్షన్ కెమెరా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. డిసెంబర్ 6న ఫ్లిప్​కార్ట్​ (Flip cart)లో అందుబాటులోకి వస్తుంది. రూ. 12,999 వద్ద దీన్ని పొందండి!”అని ట్వీట్​లో పేర్కొంది. ట్వీట్​కు #GoDazzle #gomotog హ్యాష్​ట్యాగ్​లు జోడించింది.

* ఫోన్ డిజైన్​ ఎలా ఉంది?

మోటో G31 స్మార్ట్​ఫోన్​ 6.4 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ (Refresh rate)ను కలిగి ఉంటుంది. ఈ డిస్​ప్లే 700 నిట్స్​ బ్రైట్​నెస్​, 409 పీపీఐ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ డిస్​ప్లే మీకు మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ స్టైలిష్​ డిజైత్ (Stylish design)​తో వస్తుంది.

* కెమెరాలు

మోటో G31లో ట్రిపుల్ రియర్ కెమెరా (Triple Rear camera) సెటప్​తో వస్తుంది. దీనిలో 50 ఎంపి (MP) మెయిన్​ షూటర్‌ కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరాను చేర్చింది. మరోవైపు, 8 ఎంపీ డెప్త్ సెన్సార్ కెమెరా (Depth Censor camera)ను కూడా అందించింది. ఇక, సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కోసం 13 ఎంపీ సెల్ఫీ కెమెరాను చేర్చింది.

* ప్రాసెసర్

స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఓఎస్​పై రన్ (Run) అవుతుంది. మోటో జీ 31 మీడియా టెక్​ హీలియో G85 చిప్‌సెట్‌తో వస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ (Internal Storage), 6 జీబీ ర్యామ్​/128 జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​ ఆప్షన్లలో లభిస్తుంది.

* బ్యాటరీ

మోటరోలా జీ31లో 5,000mAh భారీ బ్యాటరీని అందించింది. ఇది ఫాస్ట్​ ఛార్జింగ్​ (fast charging)కు మద్దతిస్తుంది.

మోటో G31 ఆల్-ప్లాస్టిక్ బాడీని కలిగి ఉంటుంది. దీనికి IPX2 వాటర్ రిపెల్లెంట్ రేటింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ స్కిడ్, ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ (Finger print Resistant) అని కూడా నివేదికలు చెబుతున్నాయి.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Motorola, New feature, Smart phone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు