Motorola Moto G 5G: మోటరోలా నుంచి సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్.. భారత్‌లో ఎప్పుడంటే..

మోటో జి 5జి పేరుతో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 6న యూరప్‌లో విడుదల చేసింది. మోటో జి 5జి స్మార్ట్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750జి ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

news18-telugu
Updated: November 11, 2020, 8:56 PM IST
Motorola Moto G 5G: మోటరోలా నుంచి సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్.. భారత్‌లో ఎప్పుడంటే..
ఫ్రతీకాత్మకచిత్రం
  • Share this:
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన జీ సిరీస్లో సరికొత్త 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. మోటో జి 5జి పేరుతో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 6న యూరప్‌లో విడుదల చేసింది. మోటో జి 5జి స్మార్ట్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750జి ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. కాగా, ధర విషయానికి వస్తే మోటో జి 5జి స్మార్ట్ ఫోన్ 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్ EUR 299.99 (భారత కరెన్సీలో సుమారు రూ .26,200) ధరతో లాంచ్ చేయబడింది. కాగా, ప్రస్తుతం ఎంపిక చేసిన యూరోపియన్ దేశాల్లో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండనుందని, త్వరలోనే ఆయా దేశాల్లో అమ్మకాలు ప్రారంభిస్తామని మోటరోలా ప్రకటించింది. రాబోయే కొద్ది వారాల్లోనే భారతదేశం, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాలల్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

స్పెసిఫికేషన్లు

మోటో జి 5 జి వోల్కానిక్ గ్రే, ఫ్రాస్టడ్ సిల్వర్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.- మోటో జి 5 జి స్మార్ట్ఫోన్ 397 పిపి పిక్సెల్ సాంద్రతతో కూడిన 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750 జి చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. కాగా, ప్రస్తుతం ఇది 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ తో మాత్రమే అందుబాటులోకి రానుంది. కాకపోతే, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు మైక్రో SD కార్డ్ ఉపయోగించి స్టోరేజ్ ను 1TB వరకు విస్తరించవచ్చు. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కూడా అందించింది మోటో సంస్థ.

48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ షూటర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాల వంటి కెమెరాలను చేర్చింది. అంతేకాక, సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ ను అందించింది. కనెక్టివిటీ పరంగా చూస్తే మోటో జి 5 జిలో 5 జి కనెక్టివిటీ, ఎన్‌ఎఫ్‌సి, బ్లూటూత్ 5.1, వై-ఫై 802.11ac, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, జిపిఎస్ వంటి అట్రక్టివ్ ఆప్షన్లను అందించింది. స్మార్ట్ ఫోన్ డస్ట్ ప్రొటక్షన్ కోసం IP52 సర్టిఫికేషన్ పొందింది. ఇది 166mm x 76mm x 10mm పొడవు, వెడల్పుతో పాటు 212 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
Published by: Krishna Adithya
First published: November 11, 2020, 8:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading