Home /News /business /

MOTO E30 WITH 48 MEGAPIXEL MAIN CAMERA LAUNCHED PRICED AT ROUGHLY RS 10000 MK GH

Moto E30: మోటో ఈ 30 స్మార్ట్​ఫోన్​ లాంచ్​.. రూ.10 వేలలోపు ధరలోనే ప్రీమియం ఫీచర్లు

Moto E30

Moto E30

మోటరోలా తన మోటో ఈ సిరీస్​ లైనప్​లో E30 బడ్జెట్ స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ సిరీస్​లో లభిస్తున్న మోటో E40కి కొనసాగింపుగా దీన్ని లాంచ్​ చేసింది.

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ మోటరోలా వరుసగా స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తూ తన మార్కెట్​ను విస్తరిస్తోంది. తాజాగా మోటరోలా తన మోటో ఈ సిరీస్​ లైనప్​లో E30 బడ్జెట్ స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ సిరీస్​లో లభిస్తున్న మోటో E40కి కొనసాగింపుగా దీన్ని లాంచ్​ చేసింది. ఈ కొత్త మోటో E30 స్మార్ట్​ఫోన్​లో దాదాపు మోటో E40కి సమానమైన స్పెసిఫికేషన్లనే అందించింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్​ ఆండ్రాయిడ్ గో ఓఎస్​పై పనిచేస్తుంది. ప్రస్తుతానికి యూరోప్​ మార్కెట్​లో లాంచ్​ అయిన మోటో E30.. త్వరలోనే భారత మార్కెట్​లోకి రానుంది.

ఇవి చదవండి..Amazon Prime: అమెజాన్ యూజర్లకు అలర్ట్... భారీగా పెరుగుతున్న ప్రైమ్  చార్జీలు

మోటో ఈ 30 ధర

ప్రస్తుతానికి యూరప్​లో విడుదలైన మోటో E 30 ధరను పరిశీలిస్తే.. 2 జీబీ ర్యామ్​, 32 జీబీ స్టోరేజ్ గల సింగిల్​ వేరియంట్​ GBP 99.99 (సుమారు రూ. 10,000) వద్ద లభిస్తుంది. అయితే భారత్​లో ధరపై ఇంకా స్పష్టత లేదు. ఈ స్మార్ట్​ఫోన్​ మినరల్ గ్రే, డిజిటల్ బ్లూ కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

ఇవి చదవండి..Nokia C30: భారత మార్కెట్​లోకి నోకియా సి 30 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్​..  జియో ఎక్స్​క్లూజివ్​ ఆఫర్​తో రూ.10 వేలలోపే లభ్యం

స్పెసిఫికేషన్లు

మోటో E30 డివైజ్ 6.5 అంగుళాల హెచ్​డీ+ మాక్స్ విజన్ IPS డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో 2 జీబీ ర్యామ్​, 32 జీబీ స్టోరేజ్​తో జతచేసిన యూనిసోక్​ T700 చిప్‌సెట్‌ను అందించింది. దీని స్టోరేజీని మైక్రో ఎస్​డీ కార్డ్ స్లాట్ ద్వారా 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. మోటో E30 డ్యూయల్ సిమ్ కార్డ్‌కు (నానో)కు మద్దతు ఇస్తుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్​ కోసం దీని వెనుక వైపు మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్​ను అందించింది.

ఇవి చదవండి..WhatsApp: గూగుల్‌ డ్రైవ్‌ లేకుండా కొత్త ఫోన్‌లోకి వాట్సప్​ డేటా ట్రాన్స్‌ఫర్‌ చేయండిలా

మోటో E30 గో ఎడిషన్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేస్తుంది. దీని ట్రిపుల్ రియర్ కెమెరాలు దీర్ఘచతురస్రాకార మాడ్యూల్‌తో వస్తాయి. దీని బ్యాక్​ కెమెరా సిస్టమ్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలను సంస్థ అందించింది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను చేర్చింది. మోటో E30 స్మార్ట్​ఫోన్​ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. యూఎస్​బీసీ పోర్ట్ ద్వారా 10W ఫాస్ట్​ ఛార్జింగ్​కు మద్ధతిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. 4G ఎల్​టీఈ, వైఫై 802.11, బ్లూటూత్ v5, జీపీఎస్​, యూఎస్​బీ టైప్-సీ పోర్ట్​ వంటివి అందించింది.

ఇవి చదవండి..Lenovo Yoga Tab 11: లెనోవో యోగా ట్యాబ్ 11 రిలీజ్... సేల్‌లో రూ.10,000 తగ్గింపు
Published by:Krishna Adithya
First published:

Tags: Cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు