ఆదాయ పన్ను శాఖ (IT department) నిర్ణయించిన శ్లాబుల ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ (income tax) చెల్లించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రస్తుతం రూ. 2.5 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిందే! అయితే ఈ పరిమితిని ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న యూనియన్ బడ్జెట్లో పెంచే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు. ఫిబ్రవరి 1, 2022న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2022-23లో ప్రాథమిక ఆదాయపు పన్ను మినహాయింపు (basic income tax exemption) పరిమితిని ప్రస్తుత రూ. 2.5 లక్షల నుంచి పెంచవచ్చని తాజా సర్వే చెబుతోంది. సర్వేలో పాల్గొన్న నిపుణుల్లో 64 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫైనాన్షియల్ సర్వీసెస్, బిజినెస్ అడ్వైజరీ, ఇంటర్నల్ ఆడిట్ అందించే KPMG India లేటెస్ట్ ప్రీ-బడ్జెట్ సర్వేలో నిపుణులు 'బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జింప్షన్ లిమిట్' పెంచవచ్చని చెప్పారు.
IGNOU: సామాజిక సేవను ఉద్యోగంగా మార్చే కోర్సు... మీరూ ఆన్లైన్లో చేయొచ్చు
కేపీఎంజీ ఇండియా (KPMG India) జనవరి నెలలో నిర్వహించిన సర్వేలో దాదాపు 200 మంది ఫైనాన్స్ నిపుణులు పాల్గొన్నారు. వారిలో 36 శాతం మంది 80-సీ మినహాయింపు పరిమితిని రూ. 1.5 లక్షలకు పెంచుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్పులు తీసుకురావచ్చని భావించారు. అయితే వేతన తరగతికి ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.50,000 నుంచి స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచవచ్చని 19 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ కనెక్షన్, ఫర్నీచర్, ఇయర్ఫోన్ల సదుపాయం నుంచి హోం ఆఫీస్ ఏర్పాటు వరకు అయిన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని జీతం పొందే వ్యక్తులకు పన్ను రహిత అలవెన్సులు/పర్క్విసైట్ (perquisites)లను బడ్జెట్ అందిస్తుందని సర్వే పార్టిసిపెంట్లలో 16 శాతం మంది అభిప్రాయపడ్డారు.
సర్వేలో పాల్గొన్న నిపుణులలో ఏకంగా 64 శాతం మంది ప్రాథమిక ఐటీ మినహాయింపు పరిమితిని సంవత్సరానికి రూ. 2.5 లక్షల నుంచి పెంచే అవకాశం ఉందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ కేంద్ర బడ్జెట్ 2022లో ఐటీ నిబంధనల్లో మార్పులు ప్రకటిస్తూ 'బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జింప్షన్ లిమిట్' పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడిస్తే ట్యాక్స్ పేయర్ల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఈ కరోనా సమయంలో వారికి పెద్ద ఊరట లభించినట్లవుతుంది.
2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి దేశీయ కంపెనీల హెడ్లైన్ కార్పొరేట్ పన్ను రేటు (headline corporate tax rate)ను 30 శాతం నుంచి 22 శాతానికి ప్రభుత్వం తగ్గించడంతో... విదేశీ కంపెనీలకు, దేశీయ కంపెనీలకు వర్తించే రేట్ల మధ్య అంతరం పెరిగిందని సర్వే తెలిపింది. ప్రస్తుతం, విదేశీ కంపెనీల భారతీయ శాఖలు 40 శాతం కార్పొరేట్ పన్ను పరిధిలోకి వస్తాయి. "భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ పెట్టుబడి అధికార పరిధిగా ఉండాలంటే.. 2019 రేటు కోతలకు అనుగుణంగా భారతీయ శాఖలకు వర్తించే రేటును తగ్గించాల్సిన అవసరం ఉందని సర్వేలో పాల్గొన్నవారిలో చాలా మంది అభిప్రాయపడ్డారు" అని సర్వే పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Income tax, It department