క్రిప్టో కరెన్సీ (Crypto Currency) పెట్టుబడులపై భారత ప్రభుత్వం (Indian government) అధికారికంగా నియంత్రణలు విధించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో క్రిప్టో ఇన్వెస్టర్లు (Investors) ఆందోళన చెందే విషయం చెప్పారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (Raghuram Rajan). ప్రస్తుతం ఉన్న 6,000 క్రిప్టోకరెన్సీలలో చాలా వరకు మనుగడ కోల్పోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. వీటిలో ఒకటి, రెండు లేదా కొన్ని మాత్రమే మనుగడలో ఉంటాయని చెప్పారు. తక్కువ ధరలతో ఎక్కువ విలువను అందించే ఇలాంటి పెట్టుబడులను గాలిబుడలుగా (bubble) అభివర్ణించారు రాజన్. క్రిప్టో కరెన్సీలపై CNBC-TV18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు. కొనడానికి సిద్ధంగా ఉన్న మూర్ఖులు ఉన్నంతకాలం చాలా క్రిప్టోలకు విలువ ఉంటుందని చెప్పారు. అయితే వీటి భవిష్యత్తుపై మాత్రం ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
క్రిప్టోలు ప్రజల నుంచి డబ్బు తీసుకొని, క్రమబద్ధీకరించని చిట్ ఫండ్‌ల మాదిరిగానే పనిచేస్తాయని, చివరకు వీటి మాదిరిగానే సమస్యలకు కారణమవుతాయని రఘురామ్ రాజన్ చెప్పారు. క్రిప్టో ఆస్తులను కలిగి ఉన్న చాలా మంది వ్యక్తులు చివరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
Gold Rates: పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త.. బంగారం కొనేందుకు ఇదే సరైన సమయం..
* క్రిప్టోలకు విలువ లేదా?
క్రిప్టో కరెన్సీలకు అస్సలు విలువ లేదని చెప్పట్లేదు కానీ.. చాలా క్రిప్టోలకు శాశ్వత విలువ మాత్రం లేదంటున్నారు రాజన్. అలాగే వాటిలో కొన్ని పేమెంట్ సేవలను అందించడానికి మనుగడ సాగిస్తాయని చెప్పారు. ముఖ్యంగా సరిహద్దు చెల్లింపు సేవలను (cross-border payments) క్రిప్టోలు అందించవచ్చని తెలిపారు. అమెరికాలో క్రిప్టో అనేది 2.5 ట్రిలియన్ డాలర్ల సమస్యగా మారిందన్నారు. దీన్ని ఎవరూ నియంత్రించే ప్రయత్నం చేయట్లేదన్నారు.
Apple Car: మార్కెట్లోకి వచ్చేస్తోంది యాపిల్ డ్రైవర్ లెస్ కార్...రిలీజ్ ఎప్పుడంటే...
* బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి ప్రాధాన్యం
భారతదేశంలో అంతర్లీనంగా ఉన్న బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి కేంద్రం చొరవ తీసుకోవాలని రాజన్ చెప్పారు. లావాదేవీల విషయంలో బ్లాక్‌చెయిన్ మార్గాలు చాలా చౌకగా ఉన్నాయని, ముఖ్యంగా క్రాస్- బోర్డర్ పేమెంట్లలో ఇవి బాగా ఉపయోగపడతాయని తెలిపారు. నవంబర్ 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కొన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను మినహాయించి అన్నింటిని నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతోపాటు RBI జారీ చేసే డిజిటల్ కరెన్సీని నియంత్రించడానికి, ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి సైతం కేంద్రం ఈ బిల్లును సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Hyundai Hydrogen Car: హ్యుందాయ్ హైడ్రోజన్ కారు...పెట్రోల్, డీజిల్ కన్నా చౌక ఇంధనం..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cryptocurrency, Raghuram rajan, Rbi, Reserve Bank of India