భారత్‌లో రూ.3వేల కోట్ల పెట్టుబడులకు అంతర్జాతీయ ఆటో మొబైల్ సంస్థ ఎంజీ సంసిద్ధత..

ఎంజి సంస్థ సుమారు రూ.3వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకొంది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో విస్తరించాలని భావిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

news18-telugu
Updated: December 15, 2019, 10:51 PM IST
భారత్‌లో రూ.3వేల కోట్ల పెట్టుబడులకు అంతర్జాతీయ ఆటో మొబైల్ సంస్థ ఎంజీ సంసిద్ధత..
జూలై: ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్‌టీ తగ్గింపు పర్యావరణ అనుకూల రవాణా సదుపాయాల్ని ప్రోత్సహించే క్రమంలో కేంద్ర జీఎస్‌టీ మండలి జూలై 27న కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించింది.
  • Share this:
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మారిస్ గారాజ్ ఇండియాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఎంజి సంస్థ సుమారు రూ.3వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకొంది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో విస్తరించాలని భావిస్తున్నట్లు ఎంజి వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఇప్పటికే ఎంజి మోటార్స్ భారత్‌లో రూ. 2వేలకు పైగా కోట్ల పెట్టుబడులు పెడుతోంది. అందులో భాగంగా గుజరాత్‌లో హాలోల్‌లో తన ప్లాంట్‌ను నెలకొల్పి సేవలందిస్తోంది. భారత్‌లో తాము సేవలను విస్తరించదలిచామని, భవిష్యత్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులకు సిద్ధమయ్యామని ఎంజి మోటర్స్ ప్రధాన వాణిజ్య వ్యవహారాల అధికారి గౌరవ్ గుప్తా పేర్కొన్నారు. భారత్‌లో రూ.3వేల కోట్ల పెట్టుబడులకు కంపెనీ రెడీగా ఉందన్నారు. భారత్‌లో ఎంజి మోటార్స్ ఇప్పటికే 13వేల కార్లను విక్రయించిందన్నారు.

First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>