స్తంభించిన 63 లక్షల జన్‌ధన్ అకౌంట్లు... మీ ఖాతా పనిచేస్తోందా?

Jan Dhan Accounts : 2014లో కేంద్రం కోరింది కదా అని చాలా మంది జన్ ధన్ అకౌంట్లు తెరిచారు. ఐతే... చాలా మంది వాటిని వాడట్లేదు. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా...

Krishna Kumar N | news18-telugu
Updated: July 11, 2019, 5:36 AM IST
స్తంభించిన 63 లక్షల జన్‌ధన్ అకౌంట్లు... మీ ఖాతా పనిచేస్తోందా?
జన్ ధన్ ఖాతా (File)
  • Share this:
ఇదివరకటికీ ఇప్పటికీ బ్యాంకుల్లో రూల్స్ చాలా మారిపోయాయి. ప్రతీ అంశాన్నీ కమర్షియల్‌గా చూస్తున్నా బ్యాంకులు. ప్రయోజనం లేని అంశాలపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. అంటే... జన్ ధన్ ఖాతాల విషయంలో చూస్తే... ఎవరైనా అకౌంట్ తెరిచి... ఏడాది పాటూ అందులో ఎలాంటి ట్రాన్సాక్షన్లూ చెయ్యకపోతే, ఇక ఆ అకౌంట్ పనిచెయ్యదు. ఎందుకంటే అలాంటి అకౌంట్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని బ్యాంకులు భావిస్తుండటమే ఇందుకు కారణం. బీహార్‌లో ప్రజలు ప్రధాని చెప్పారు కదా అని పెద్ద ఎత్తున జన్ ధన్ ఖాతాలు తెరిచారు. కానీ వాళ్లలో చాలా మంది వాటిని వాడట్లేదు. కనీసం రూపాయి కూడా వాటిలో డిపాజిట్ చెయ్యలేదు. ఫలితంగా అక్కడ చాలా అకౌంట్లు స్తంభించిపోయాయి. చిన్న వ్యాపారులు, పేదవాళ్లు జన్ ధన్ ఖాతాలు తెరిచినా వాడట్లేదు. అలాంటి అకౌంట్లు ఇప్పుడు స్తంభించిపోయినట్లే.

జన్ ధన్ అకౌంట్లు ఓపెన్ చేసినవారికి రూ.2 లక్షల వరకూ ప్రమాద బీమా కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతో చాలా మంది ఆసక్తిగా అకౌంట్లు తెరిచారు గానీ... లావాదేవీలు జరపట్లేదు. తాజా లెక్కల ప్రకారం బీహార్‌లో ఇప్పటివరకూ 62,76,025 అకౌంట్లు పనిచెయ్యకుండా పోయాయి. బీహార్‌లో 4 కోట్లకు పైగా జన్‌ధన్ అకౌంట్లు ఉన్నాయి. వాటిలో రూ.9,100 కోట్లు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. మరి మీకూ జన్‌ధన్ అకౌంట్ ఉంటే, అది పనిచేస్తోందో, లేదో వెంటనే తెలుసుకోండి. స్తంభించకపోతే మంచిదే... స్తంభించిపోతే మాత్రం బ్యాంక్ అధికారులను అడిగి, ఏం చెయ్యాలో తెలుసుకోండి. అకౌంట్ ద్వారా ఆరు నెలలకు ఓసారైనా ఏదో ఒక ట్రాన్సాక్షన్ జరుపుతూ ఉంటే, అకౌంట్లు ఫ్రీజ్ కావంటున్నారు అధికారులు.

జన్ ధన్ ఖాతాల్లో రూ.లక్ష కోట్లు : 2014 ఆగస్ట్ 28న జన్ ధన్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 36కోట్ల 6లక్షలకు పైగా జన్ ధన్ ఖాతాలున్నాయి. జులై 3 నాటికి వాటిలో మొత్తం రూ.లక్ష కోట్లకు పైగా డబ్బు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

First published: July 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు