ఆగస్టు నెల భారత్‌లోని కార్ల మార్కెట్‌కి మంచి బూస్టింగ్ ఇస్తోందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలలో పోటాపోటీగా అన్ని కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫ్రీడమ్ సేల్స్ పేరుతో ఆఫర్లు, ప్రయోజనాలు అందిస్తున్నాయి. తయారీ సంస్థలు కొత్త మోడల్స్‌ను విడుదల చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న మోడల్స్‌పై కూడా మంచి ఆఫర్లు ప్రకటించాయి. ఈ క్రమంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ కూడా తమ కార్లు కొనే వారి కోసం వివిధ ఆఫర్లు అందిస్తోంది. ఆగస్టు నెలలో తమ కారు కొనేవారికి దాదాపు రూ.50,000 వరకు ప్రయోజనం కలిగేలా ఆఫర్లను అందిస్తోంది ఈ సౌత్ కొరియన్ ఆటోమొబైల్ సంస్థ.
కేవలం డిస్కౌంట్లు ఇతర ప్రయోజనాలు అందించడం మాత్రమే కాదు.. హ్యుందాయ్ సంస్థ ఫైనాన్స్ స్కీమ్స్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. అయితే ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటంటే కొన్ని హ్యుందాయ్ మోడల్స్ మాత్రమే ప్రస్తుతం ఈ డిస్కౌంట్లు, ఇతర ఆఫర్ల పరిదిలోకి వస్తాయి. ఆ మోడల్స్ హ్యుందాయ్ సాంత్రో, హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS, i20 వంటివి అన్నమాట.
ఎలాంటి మోడళ్లపై ఆఫర్లు ఉన్నాయి?
* హ్యుందాయ్ సాంత్రో పెట్రోల్ మోడల్ పై సుమారు రూ. 40,000 వరకు ఆఫర్లు అందిస్తోంది.
* హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ మోడల్స్‌పై సుమారు రూ. 40,000 వరకు ఆఫర్లు అందిస్తోంది.
* హ్యుందాయ్ i20 పెట్రోల్ మోడల్‌పై కూడా రూ.40,000 వరకు ఆఫర్ ఉంది.
* హ్యుందాయ్ ఆరా పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ మోడల్స్‌పై రూ. 50,000 వరకు ఆఫర్ అందిస్తోంది ఈ సంస్థ.
అయితే ఈ ఆఫర్లను కేవలం ఆగస్టు 30 వరకు మాత్రమే అందించనున్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది. అంతేకాదు.. ప్రాంతాలు, వేరియంట్లను బట్టి కూడా ఆఫర్లు మారే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఈ మోడళ్లకు చెందిన కార్లు కొనాలనుకుంటే మీకు దగ్గర్లో ఉన్న హ్యుందాయ్ డీలర్ షిప్ సెంటర్ కి వెళ్లి ఆఫర్ల వివరాలు తెలుసుకోవడం మంచిది. దీని వల్ల మీకు కావాల్సిన కారును కూడా నేరుగా చూసి ఎంచుకునే వీలు కలుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyundai